Telegram డౌన్‌లోడ్‌లలో ఊహించని అభివృద్ధి!! ప్రమాదంలో వాట్సాప్

|

2021 జనవరిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన మెసేజింగ్ యాప్ లో టెలిగ్రామ్ మొదటి స్థానం పొందడంతో పాటుగా జనాదరణ సంఖ్యను కూడా పెంచుతున్నట్లు సెన్సార్ టవర్ కొత్త నివేదికను ప్రకటించింది. భారతదేశంలో అధిక డౌన్‌లోడ్‌లను సాధించడంతో అధిక జనాదరణ పొందిన యాప్ లలో వాట్సాప్ ను వెనక్కి నెట్టి టెలిగ్రామ్ మొదటి స్థానానికి చేరుకున్నది. అయితే వాట్సాప్ ఇప్పుడు ఐదవ స్థానానికి పడిపోయినట్లు డేటా వెల్లడించింది.

టెలిగ్రామ్ ఇన్‌స్టాల్‌

టెలిగ్రామ్ ఇప్పుడు మొత్తంగా 63 మిలియన్ల ఇన్‌స్టాల్‌లను సాధించింది. ఈ మొత్తం డౌన్‌లోడ్‌లలో భారతదేశంలోనే 24 శాతం వాటాను సాధించినట్లు నివేదికలు చూస్తున్నాయి. దేశంలో ప్రజలు యాప్ ను ఎంతలా ఆదరణను ప్రారంభిస్తున్నారో చూపిస్తుంది. మొత్తం డౌన్‌లోడ్‌లలో 10 శాతం ఇండోనేషియా ఉంది. గత సంవత్సరం జనవరి నుండి డౌన్‌లోడ్ల పరంగా 3.8 రెట్లు పెరిగినందున టెలిగ్రామ్ యొక్క ప్రజాదరణ మరింత ఎక్కువ అయింది.

అధిక డౌన్‌లోడ్‌ యాప్

అధిక డౌన్‌లోడ్‌లను సాధించిన వాటిలో రెండవ స్థానంలో టిక్‌టాక్ ఉంది. అయితే ఇది ఇప్పటికీ భారతదేశంలో నిషేధించబడింది. సిగ్నల్ యాప్ మూడవ స్థానంలో ఉండి త్వరిత మెసేజ్ యాప్ యొక్క ప్రజాదరణను షేర్ చేసుకుంది. నాల్గవ స్థానంలో ఫేస్బుక్ ఉండగా ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న వాట్సాప్ ఇప్పుడు ఐదవ స్థానానికి పడిపోయింది. 2020 డిసెంబర్‌లో మూడవ స్థానానికి పడిపోవడంతో ఇప్పుడు మరింత మంది వినియోగదారులను కోల్పోయింది.

వాట్సాప్ కొత్త అప్ డేట్

వాట్సాప్ ఇటీవల కొత్త అప్ డేట్ లో భాగంగా గోప్యతా విధానాలకు ఆపాదించబడింది. ఇది గోప్యతా ఉల్లంఘనను స్పష్టంగా తెలుపుతున్నందున వినియోగదారులు దీనిని ఉపయోగించడం మానుకుంటున్నారు. ఈ ఒక్క అప్ డేట్ కారణంగా వాట్సాప్ కు అనేక ప్రతికూలతలు వచ్చాయి. ప్రజలు ముఖ్యంగా భారతదేశంలోని వారు టెలిగ్రామ్ మరియు సిగ్నల్‌లను అధికంగా ఉపయోగించడం ప్రారంభించారు.

టెలిగ్రామ్

నాలుగు నెలల కాలంలో సాంకేతిక ప్రపంచంలో పోకడలు మారాయి. తక్షణ సందేశ యాప్ ల విషయంలో కూడా కొత్త ధోరణి లభించింది. అందువల్లనే ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గ టెలిగ్రామ్ దూసుకెళ్ళింది. టెలిగ్రామ్ తెలియని యాప్ కాదు. వాట్సాప్ కొత్త అప్ డేట్ కారణంగా భారతదేశంలో టెలిగ్రామ్ అభివృద్ధికి మంచి పాత్ర పోషించింది. సెన్సార్ టవర్ యొక్క కొత్త నివేదిక, టెలిగ్రామ్ టిక్‌టాక్‌ను అధిగమించి జనవరిలో ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన అనువర్తనంగా అవతరించింది.

Best Mobiles in India

English summary
Telegram Becomes The Most Download App in Jan 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X