టెలిగ్రామ్ 2025 అప్‌డేట్.. సరికొత్త ఫీచర్లు, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో అదిరిపోయే మార్పులు!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్, సరికొత్త హంగులతో 2025లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కొత్త అప్‌డేట్‌తో సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. ముఖ్యంగా గిఫ్ట్‌లకు సరికొత్త కళను తీసుకొచ్చింది. అంతేకాదు, సర్వీస్ మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్స్, మెసేజ్‌ల కోసం అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫిల్టర్లు, థర్డ్-పార్టీ వెరిఫికేషన్ ఐకాన్స్, యాప్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్, ప్రీమియం యూజర్ల కోసం కస్టమ్ ఎమోజీ ఫోల్డర్లు.. ఇలా ఎన్నో కొత్త ఫీచర్లతో టెలిగ్రామ్ తన యూజర్లకు పండగ చేసింది. అవేంటో చూద్దాం..
టెలిగ్రామ్‌లో ఇకపై మీకు వచ్చే గిఫ్ట్‌లను ప్రత్యేకమైన, అరుదైన డిజిటల్ వస్తువులుగా మార్చుకోవచ్చు. వీటినే కలెక్టిబుల్స్ అంటారు. ఈ కలెక్టిబుల్స్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దవచ్చు. అంతేకాదు, వాటిని మీ స్నేహితులకు పంపవచ్చు లేదా NFT మార్కెట్‌ప్లేస్‌లలో వేలం వేసి సొమ్ము చేసుకోవచ్చు.

ఒక గిఫ్ట్‌ను కలెక్టిబుల్‌గా మార్చినపుడు, టెలిగ్రామ్ డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్‌తో అది మరింత అందంగా మారుతుంది. ప్రతి కలెక్టిబుల్‌కు ఒక ప్రత్యేకమైన రంగు, గుర్తు (ఐకాన్), ఒక సంఖ్య ఉంటాయి. దాంతో ప్రతి కలెక్టిబుల్ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతుంది. కొన్ని కలెక్టిబుల్స్ అయితే చాలా అరుదుగా దొరుకుతాయి.
* సర్వీస్ మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్స్
టెలిగ్రామ్ తన అప్‌డేట్‌లో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించింది. ముఖ్యంగా, సర్వీస్ మెసేజ్‌లకు కూడా ఎమోజీలతో రియాక్ట్ అయ్యేలా కొత్త సదుపాయం తీసుకొచ్చింది. అంటే, ఎవరైనా గ్రూప్‌లో జాయిన్ అయినా, మీకు గిఫ్ట్ పంపినా.. వచ్చే నోటిఫికేషన్స్‌కు మీ ఫీలింగ్స్‌ను ఎమోజీల రూపంలో వ్యక్తపరచవచ్చు. దీంతో చాటింగ్ మరింత సరదాగా, లైవ్‌లీగా ఉంటుంది.
* సెర్చ్ ఫిల్టర్లు, వెరిఫికేషన్ ఐకాన్స్
ఈ అప్‌డేట్‌లో భాగంగా వచ్చే కొత్త సెర్చ్ ఫిల్టర్స్‌తో మీకు కావాల్సిన మెసేజ్‌ను క్షణాల్లో పట్టేయవచ్చు. ఏ రోజు మెసేజ్, ఎవరు పంపారు.. ఇలా రకరకాల ఆప్షన్స్‌తో వెతకడం చాలా ఈజీ అయిపోతుంది.
ఇంకో ఫీచర్ ఏంటంటే.. థర్డ్-పార్టీ సర్వీసులు కూడా యూజర్ల అకౌంట్స్‌కు, చాట్స్‌కు వెరిఫికేషన్ ఐకాన్స్ ఇవ్వొచ్చు. ఎవరికైనా థర్డ్-పార్టీ వెరిఫికేషన్ ఉంటే, వాళ్ల పేరు పక్కన స్పెషల్ లోగో కనిపిస్తుంది. అయితే, టెలిగ్రామ్ ఇచ్చే రెగ్యులర్ వెరిఫైడ్ చెక్‌మార్క్‌కు, దీనికి తేడా ఉంది.
* క్యూఆర్ కోడ్ స్కానర్
టెలిగ్రామ్ తన యాప్‌లో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో యాప్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. అంటే, వేరే క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్ ఓపెన్ చేయకుండానే డైరెక్ట్‌గా టెలిగ్రామ్ యాప్‌లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా, యూజర్లు లింక్స్‌ను డైరెక్ట్‌గా తమకు ఇష్టమైన బ్రౌజర్‌లో ఓపెన్ చేయవచ్చు.
* కస్టమ్ ఎమోజీ ఫోల్డర్లు
అలాగే, టెలిగ్రామ్ ప్రీమియం యూజర్ల కోసం మరో స్పెషల్ ఫీచర్ వచ్చింది. ఇకపై ప్రీమియం యూజర్లు తమ ఫోల్డర్లకు కస్టమ్ ఎమోజీలను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోల్డర్లను పర్సనలైజ్ చేసుకోవచ్చు, వాటికి మరింత ఎక్స్‌ప్రెసివ్, ఫన్ లుక్ ఇవ్వవచ్చు.


Click it and Unblock the Notifications








