టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్‌లు.. కొత్త నంబర్‌లతో మెసేజ్‌లు వచ్చినా టెన్షన్ ఉండదు..!
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం టెలిగ్రామ్ యాప్‌ను (Telegram) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. భారీ సంఖ్యలో ఉన్న యాజర్ల కోసం అనేక ఫీచర్‌లను విడుదల చేస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో విడుదల చేసిన కొత్త అప్‌డేట్‌తో అనేక ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎమోజీ రియాక్షన్, అడ్వాన్సడ్ సెర్చ్ ఫిల్టర్‌లు, ఇన్ యాప్ క్యూఆర్ కోడ్, కస్టమ్ ఎమోజీ వంటి అనేక ఫీచర్‌లను లాంచ్ చేసింది.
అయితే తాజాగా టెలిగ్రామ్ కొత్త ఫీచర్‌లతో మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్‌లు యాప్‌లో అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయని సంస్థ చెబుతోంది. ప్రీమియం యూజర్‌లకు ఉపయోగపడే ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

కాంటాక్ట్ కన్ఫర్మేషన్ :
టెలిగ్రామ్ యూజర్లకు కాంటాక్ట్ కన్ఫర్మేషన్ ఫీచర్ (Telegram Contact Confirmation) ఉపయోగపడుతుంది. యూజర్లకు వేర్వేరు నంబర్‌లతో మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే వచ్చిన నంబర్ వివరాలు తెలిసేవి కాదు. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ద్వారా.. కొత్త నంబర్ నుంచి ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే.. ఆ కాంటాక్ట్‌కు సంబంధించిన వివరాలు మీకు తెలుస్తాయి.
ఆ నంబర్ టెలికామ్ అకౌంట్ ఏ సంవత్సరంలో ఓపెన్ అయింది. ఆ నంబర్ ఏ దేశానికి చెందినది, మీరు ఇద్దరు ఏదైనా గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారా.. వంటి వివరాలు మీకు తెలియనున్నాయి. వెరిఫైడ్ ఖాతా లేదా రెగ్యులర్ ఖాతా అనే వివరాలు వెల్లడిస్తుంది.
ప్రస్తుతం స్పామ్ కాల్స్, స్పామ్ మెసెజ్‌ల నుంచి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కాంటాక్ట్ కన్ఫర్మేషన్ ఫీచర్ మీకు రక్షణ కల్పిస్తుంది. దీంతోపాటు ప్రీమియం యూజర్‌లకు మరో సూపర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ప్రీమియం యూజర్ల కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న యూజర్లకు కొత్త నంబర్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లతో ఇబ్బందులు లేకుండా ఈ ఫీచర్ రక్షణ కల్పిస్తుంది. దీని వల్ల స్పామ్ కాల్స్, మెసేజ్‌లు తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రొఫైల్ కవర్ కు గిఫ్ట్ యాప్ చేసుకొనే అవకాశం ఉంది.
గతంలో ఎమోజీ రియాక్షన్, సెర్చ్ ఫిల్టర్, వెరిఫికేషన్ ఐకాన్స్, క్యూఆర్ కోడ్ స్కానర్, కస్టమ్ ఎమోజీ ఫోల్డర్లు ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. సర్వీస్ మెసేజ్‌లకు కూడా ఎమోజీతో రియాక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. అంటే ఎవరైనా గ్రూప్‌లో జాయిన్, గిఫ్ట్ పంపితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.
ఈ నోటిఫికేషన్‌కు మీరు ఎమోజీ రూపంలో స్పందించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు సెర్చ్ ఫిల్టర్ ఫీచర్ ఉపయోగపడుతుంది. పాత మెసేజ్‌లను సులభంగా సెర్చ్ చేయవచ్చు. రోజు, కాంటాక్ట్ పేరుతో సెర్చ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ సర్వీసులు, యూజర్ అకౌంట్, చాట్‌కు వెరిఫికేషన్ ఐకాన్స్ ఇవ్వొచ్చు.
వీటితోపాటు యాప్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్ ఫీచర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లోనే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇతర యాప్‌ల అవసరం ఉండదు. తమ డివైజ్‌ను ఇతర బ్రౌజర్‌లో సులభంగా లాగిన్ చేసేందుకు ఈ ఫీచర్ అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








