సీక్రెట్‌గా చాట్ చేయాల‌నుకునే వారికి Telegram లో స‌రికొత్త ఫీచ‌ర్‌!

|

ఇటీవ‌లి కాలంలో ర‌క‌ర‌కాల సోష‌ల్ మీడియా యాప్‌లు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అందులో భాగంగా Telegram సోష‌ల్ మీడియా యాప్ కూడా వినియోగ‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం మ‌న దేశంలోని యువ‌త చాలా వ‌ర‌కు ఈ యాప్ బాగా అట్రాక్ట్ అయ్యార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌ విష‌యాల్ని మిత్రులు, లేదా కుటుంబ‌స‌భ్యుల‌తో పంచుకోవ‌డానికి ఈ Telegram బాగా ఉప‌యోగ‌డుతోంది. ఈ క్ర‌మంలో దీని వినియోగం బాగా పెరిగింది. కాగా, Telegram యాప్ ఇటీవ‌ల స‌రికొత్త సీక్రెట్ మెసేజ్‌ ఫీచర్‌ను యూజ‌ర్ల‌కు ప‌రిచ‌యం చేసింది. అదేంటంటే మీరు ఎవ‌రైనా మీ స‌న్నిహితుల‌తో సీక్రెట్‌గా ఛాట్ చేయాల‌నుకుంటే ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్పుడు ఈ ఫీచ‌ర్‌ను ఎలా ఉప‌యోగించాలి, దాని విశేషాలేమిటో తెలుసుకుందాం.

 

Telegram Secret Message ఫీచ‌ర్ విశేషాలు:

Telegram Secret Message ఫీచ‌ర్ విశేషాలు:

ఎవ‌రైనా యూజ‌ర్లు త‌మ చాట్ విష‌యంలో ప్రైవ‌సీ పాటించాల‌నుకుంటే.. అలాంటి వారికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరు ఎంత మందితో అయితే సీక్రెట్ చాట్ చేయాల‌నుకుంటున్నారో ఆ వ్య‌క్తికి మాత్ర‌మే దీన్ని యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. మిగ‌తా కాంటాక్ట్స్ అంద‌రితో కామ‌న్ చాట్ చేసుకోవ‌చ్చు. మీరు ఎంపిక చేసుకున్న ప్రొఫైల్‌కు సీక్రెట్ చాట్ ఫీచ‌ర్ యాక్టివేట్ చేసుకున్న త‌ర్వాత ఆ వ్య‌క్తికి మీరు పంపిన చాట్ ఎన్ని క్ష‌ణాల్లో(సెకన్ల‌లో) డిస‌ప్పియ‌ర్ లేదా డిస్ట్ర‌క్ట్‌ కావాల‌నే విష‌యంలో మీరే నిర్దిష్ట‌మైన స‌మ‌యాన్ని కూడా అసైన్ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత మీరు అవ‌త‌లి వ్య‌క్తికి చేసిన‌ మెసేజ్‌లు నిర్దేశించిన స‌మ‌యంలో మీతో పాటు ఆ వ్య‌క్తి మాత్ర‌మే చూడ‌గ‌ల‌రు. మీ నిర్దేశిత స‌మ‌యం అనంత‌రం ఆ చాట్ డిస‌ప్పియ‌ర్ అవుతుంది. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ద్వారా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా ఒక‌వేళ్ మీరు మెసేజ్ పంపిన వెంట‌నే స్వ‌యంగా ఆ దాన్ని డిలీట్ చేస్తే ఇద్ద‌రికీ డిలీట్ అవుతుంది.

ఈ సీక్రెట్ చాట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
 

ఈ సీక్రెట్ చాట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

* ముందుగా టెలిగ్రామ్ యాప్ లేని వాళ్లు ఆండ్రాయిడ్ యూజ‌ర్ అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ యూజ‌ర్ అయితే యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* అనంత‌రం యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.
* ఆ త‌ర్వాత మీరు ఎవ‌రితో సీక్రెట్ చాట్ చేయాలి అనుకుంటున్నారో వారి చాట్‌ కాంటాక్ట్ ఎంపిక చేసుకుని, వారి ప్రొఫైల్ లోకి వెళ్లాలి.
* అనంత‌రం వారి ప్రొఫైల్ లో కుడి వైపు పై భాగంలో మూడు డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్‌పై క్లిక్ చేస్తే మ‌న‌కు ప‌లు ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. అందులో సీక్రెట్ చాట్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన వెంట‌నే మీరు ఎంపిక చేసిన ఆ కాంటాక్ట్ తో మీ సీక్రెట్ చాట్ యాక్టివేట్ అవుతుంది.
* అనంత‌రం ఆ వ్య‌క్తికి మీరు పంపే మెసేజ్ ఎంత స‌మ‌యంలో డిస‌ప్పియ‌ర్ లేదా డిస్ట్ర‌క్ట్ కావాలో మీరే స‌మ‌యాన్ని ఎంపిక చేసుకునే ఆప్ష‌న్ ఉంటుంది. అలా మీరు నిర్దిష్ట స‌మ‌యాన్ని ఎంపిక చేసుకున్న త‌ర్వాత మీరు అవ‌త‌లి వ్య‌క్తితో చేసే చాట్ ఆ నిర్దిష్ట స‌మ‌యం త‌ర్వాత ఇక క‌నిపించ‌దు.

టెలిగ్రామ్ ఇటీవ‌లె ప్రీమియం స‌ర్వీసుల‌ను కూడా లాంచ్ చేసింది:

టెలిగ్రామ్ ఇటీవ‌లె ప్రీమియం స‌ర్వీసుల‌ను కూడా లాంచ్ చేసింది:

ఈ Telegram Premium స‌ర్వీసులో భాగంగా Telegram త‌మ యాప్‌లో మ‌రిన్ని అప్‌డేట్స్ తీసుకువ‌చ్చింది. ప్రీమియం పొందిన స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు కొత్త‌ ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాయని కంపెనీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ ప్రీమియం వినియోగ‌దారులు టెలిగ్రామ్ యాప్‌లో 4GB వ‌ర‌కు ఫైల్స్‌ను అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా వాయిస్ మెసేజ్‌ల‌ను టెక్స్ట్ రూపంలోకి మార్పిడి చేసుకోవ‌డానికి వినియోగ‌దారుల‌కు వెసులుబాటు క‌ల‌గ‌నుంది. అదేవిధంగా ఫైల్స్‌ను చాలా వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ ద్వారా యూజ‌ర్ల‌కు మ‌రిన్ని కొత్త‌ ఫీచ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ ప్ర‌కారం ప్రీమియం చెల్లించిన వారికి మాత్ర‌మే ఆ ఫీచ‌ర్లు అంద‌నున్నాయి.

Telegram Premium స‌ర్వీస్‌ ధ‌ర ఎంత‌..

Telegram Premium స‌ర్వీస్‌ ధ‌ర ఎంత‌..

Telegram Premium స‌ర్వీస్ ధ‌ర‌ కు సంబంధించి కంపెనీ వెల్ల‌డించిన ప‌లు వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ యూజ‌ర్ల‌కు టెలిగ్రామ్ ప్రీమియం (Telegram Premium) స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర నెల‌కు రూ.469 గా ఉంది. అదే ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల విష‌యానికి వ‌స్తే కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ధ‌ర‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఆండ్రాయిడ్‌పై ప్రీమియం కు సంబంధించి ధ‌ర‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ టెలిగ్రామ్ కంపెనీ దేశాల వారీగా విడుద‌ల చేయ‌నుంది. ఒక‌సారి వినియోగ‌దారుడు స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న త‌ర్వాత రెన్యూవ‌ల్ స‌దుపాయాన్ని క‌ల్పించారు.

టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న ఇత‌ర ఫీచ‌ర్లు..

టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న ఇత‌ర ఫీచ‌ర్లు..

బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. టెలిగ్రామ్ యాప్ వినియోగ‌దారులు వేగ‌వంత‌మైన డౌన్‌లోడ్ అనుభూతిని పొంద‌వ‌చ్చు. ఎక్కువ డేటా క‌లిగి ఉన్న ఫైల్స్ ను సైతం ఈ యాప్‌లో వేగంగా డౌన్‌లోడ్‌, అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ వినియోగ‌దారులు దాదాపు 1000 ఛానెల్స్ వ‌ర‌కు ఫాలో కావ‌చ్చు. దాంతో పాటు 20 చాట్ ఫోల్డర్స్ (ఒక్కో ఫోల్డ‌ర్‌లో 200 చాట్స్‌) క్రియేట్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ముఖ్య‌మైన 10 చాట్‌ల‌ను పిన్ చాట్ (పిన్ టూ చాట్) చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. వీటితో పాటు ప్రీమియం వినియోగ దారులు త‌మ‌కు న‌చ్చిన ముఖ్య‌మైన 10 స్టిక్క‌ర్ల‌ను సేవ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నారు. అలాగే యూజ‌ర్లు బ‌యోలో లాంగ‌ర్ డిస్క్రిప్ష‌న్‌తో పాటు ముఖ్య‌మైన లింక్‌ల‌ను పేస్ట్ చేసుకోవ‌చ్చు. ఇక GIF ఇమేజ్‌ల విష‌యానికి వ‌స్తే మ‌న‌కు న‌చ్చిన 400 GIF ల‌ను ఉప‌యోగించ వ‌చ్చు.

Best Mobiles in India

English summary
Telegram Secret message feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X