అమెరికా కంప్యూటర్లను నాశనం తెలుగు యువకుడు

|

ఉన్నత విద్యాభ్యాసం కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు ఊచలు లుక్కబెడుతున్నాడు అతను చేసిన తుంటరిపనితో మొత్తం కేరీర్ నాశనమైంది. ఆ విద్యార్థి చేసిన పనికి ఏడాది కారాగార శిక్షను అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా- 58, 471 డాలర్ల జరిమానాను చెల్లించాల్సి వస్తోంది. మనదేశ కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ 41 లక్షల రూపాయల పైమాటే. ఆ యువకుడి పేరు విశ్వనాథ్ ఆకుతోట.

Telugu Student Destroy American University computers

న్యూయార్క్ సమీపంలోని అల్బానీలో గల సెయింట్ రోజ్ కాలేజీలో చేరాడు. మధ్యలో ఆయనకు ఏ దుర్బుద్ధి పుట్టిందో గానీ.. ఓ వైరస్ ను కాలేజీ కంప్యూటర్లలోకి ఎక్కించారు. యూఎస్బీ కిల్లర్ పేరుతో ఈ వైరస్ ను కాలేజీకి చెందిన 66 కంప్యూటర్లలో ప్రవేశపెట్టారు. ఈ వైరస్ ను కంప్యూటర్‌లోని యూఎస్బీ పోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే దాని ప్రభావం ఛార్జింగ్ కెపాసిటర్లపై తీవ్రంగా పడుతుందట.

కిల్లర్ యూఎస్ బీ:

కిల్లర్ యూఎస్ బీ:

చిత్తూరుకు చెందిన ఆకుతోట విశ్వనాథ్‌ (27) అనే యువకుడు 2015లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. న్యూయార్క్‌లోని సెయింట్ రోస్ కాలేజీలో విశ్వనాథ్ చదువుకుంటున్నాడు. అయితే కాలేజీలోని కంప్యూటర్లను వాడుతున్నప్పుడు విశ్వనాథ్ వాటికి వైరస్ ఉన్న ‘కిల్లర్ యూఎస్ బీ'ని అనుసంధానించాడు. ఈ 'యుఎస్‌బి కిల్లర్‌'ను యుఎస్‌బి పోర్టులో పెట్టడం ద్వారా కంప్యూటర్ల ఎలక్ట్రానిక్‌ విడిభాగాలకు విద్యుత్తు ప్రవాహం హెచ్చుతగ్గులకు లోనై దెబ్బతినే ప్రమాదం ఉంది.

66 కంప్యూటర్లు:

66 కంప్యూటర్లు:

ఇటీవల విశ్వనాథ్ కాలేజీలోని దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేశాడు. కంప్యూటర్లు పాడుచేయాలనే ఉద్దేశంతో 66 కంప్యూటర్లలో యూఎస్బీ కిల్లర్ డివైజ్ ని ఇన్సర్ట్ చేశాడు. ఈ డివైజ్ ని కంప్యూటర్ లోని యూఎస్బీ పోర్టులో చేర్చినప్పుడడు కంప్యూటర్ లోని ఆన్ బోర్డ్ కెపాసిటర్లు వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా పదే పదే డిశ్చార్జ్ అయ్యలే ఆదేశాన్ని పంపతుతుంది. దాని వల్ల యూఎస్బీ పోర్టు, ఎలక్ట్రికల్ సిస్టమమ్ ఓవర్ లోడ్ అయ్యి అవి పాడౌతాయి.

ఫిబ్రవరి 22న అరెస్ట్:

ఫిబ్రవరి 22న అరెస్ట్:

దీన్ని గుర్తించిన నిర్వాహకులు గతేడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విశ్వనాథ్ ను ఫిబ్రవరి 22న అరెస్ట్ చేశారు. ఈ కేసును ఏడాదికి పైగా విచారించిన అమెరికా కోర్టు విశ్వనాథ్ ఉద్దేశపూర్వకంగానే కిల్లర్ యూఎస్ బీ పోర్టుతో కంప్యూటర్లను నాశనం చేశాడని నిర్ధారించింది. ఈ నేరానికి గానూ ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41.68 లక్షల జరిమానా విధించింది.

నేను దీన్ని చంపేస్తున్నాను

నేను దీన్ని చంపేస్తున్నాను

ఈ దృశ్యాలను అతగాడు తన వద్ద ఉన్న ఐ ఫోన్‌లో చిత్రీకరించారు.బగ్‌ను కంప్యూటర్‌లో ప్రవేశపెట్టేప్పుడు ‘నేను దీన్ని చంపేస్తున్నాను' అని పెద్ద పెద్దగా అరిచాడు. కొన్నింటిని ధ్వంసం చేస్తూ ‘చచ్చింది.. దీని పని అయిపోయింది‘ అంటూ కేకలు పెట్టాడు. దీంతో రూ.35.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.

Best Mobiles in India

English summary
Telugu Student Destroy American University computers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X