Just In
- 3 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 5 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 22 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- News
3 kidneys: ఏమీ విచిత్రం ఇదీ, వ్యాపారికి 3 కిడ్నీలు, అయినా హెల్తీగా..
- Sports
పంత్ బాబు, ఊర్వశి పాప మధ్య తగ్గని రగడ.. ఇన్‌స్టా స్టోరీతో మళ్లీ చిచ్చు రాజేసిన పంత్..!
- Finance
Rocket Stock: రాకెట్ లాగా దూసుకెళ్తున్న షేర్.. దుస్తుల వ్యాపారంలో సంచలనం.. టార్గెట్ ధర ఎంతంటే..
- Lifestyle
ఆర్ద్ర నక్షత్రం అంటే ఏమిటి? ఈ నక్షత్రం ప్రత్యేకత ఏంటనేది పూర్తి సమాచారం ఇక్కడ ఉంది..
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
ఇలా చేయడం ద్వారా Youtubeలో సబ్స్క్రైబర్స్ ను పెంచుకోవచ్చు!
ఇటీవలి కాలంలో ప్రజలు తమ నిత్య కృత్యాలను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు చూపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే Youtube వినియోగం కూడా భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరూ తాము ఎప్పుడు, ఎక్కడ, ఏం చేస్తున్నాం అనే విషయాల్ని వీడియోలుగా చిత్రీకరించి Youtubeలో అప్లోడ్ చేయడం పరిపాటిగా మారింది. ఒక వ్యక్తిగత విషయాలే కాకుండా తమకు నచ్చిన ఇతరత్రా ఆసక్తికర అంశాలను కూడా వీడియోలుగా చిత్రీకరణ చేయడం మొదలైంది. ఈ క్రమంలో కొందరు తమ వీడియోలను, ఛానెల్‌ను వ్యూస్ పరంగా సబ్స్క్రైబర్స్ పరంగా ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం వారి ఛానెల్ ప్రమోట్ చేయడం కోసం మేం మీ ముందుకు కొన్ని ట్రిక్స్‌ను తీసుకువచ్చాం. ఈ ట్రిక్స్ ఫాలో అవడం ద్వారా మన Youtube ఛానెల్‌ను మనమే ప్రమోట్ చేసుకోగలం.

1. ఇతర యూట్యూబర్ల వీడియోలకు కామెంట్ చేయడం:
మన Youtube ఛానెల్ ప్రమోట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇతర యూట్యూబర్ల వీడియోలకు కామెంట్ చేయడం అనేది ఒక సులభమైన పద్దతి. మనం ఇతర యూట్యూబర్ల వీడియోలకు మంచి అర్థవంతమైన, క్రియేటివ్‌గా కామెంట్ చేయడం ద్వారా మన ఛానెల్ పేరు అనేది ఆ యూట్యూబర్ సబ్స్క్రైబర్లకు కనిపిస్తుంది. తద్వారా కొందరు వ్యక్తులు మీ కామెంట్ నచ్చి మీ ఛానెల్ లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అప్పుడు వారికి మీ ఛానెల్ నచ్చినట్లయితే.. వారు మీ ఛానెల్‌ను కూడా సబ్స్క్రయిబ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

2. యూట్యూబ్ కమ్యూనిటీ ఫీచర్ (Youtube Community Feature) :
మీకు యూట్యూబ్ లాంగ్ ఫామ్ మరియు షార్ట్ ఫాం వీడియోల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే మీరు యూట్యూబ్ కమ్యూనిటీ ఫీచర్ (Youtube Community Feature) పై కూడా అవగాహన కలిగి ఉండాలి. ఇది మీ ఛానెల్ ప్రమోషన్ కు బాగానే పని చేస్తుంది. ఫేస్బుక్ మరియు లింక్డ్ఇన్ల మాదిరిగానే కనిపించే స్టేటస్‌లతో సహా అనేక రకాల పోస్ట్‌లను సృష్టించడానికి మీరు ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఈ కమ్యూనిటీ ఫీచర్‌ను ఉపయోగించి మీరు మీ ఛానెల్ వేదికగా పలు రకాల పోల్‌లను సృష్టించడం మరియు GIFలు మరియు స్టిల్ చిత్రాలను జోడించవచ్చు. మీరు YouTube కమ్యూనిటీ ట్యాబ్‌ను ఉపయోగించడానికి కనీసం 500 మంది సబ్స్క్రైబర్లను కూడబెట్టుకోవాలి. మీరు ఒకసారి 500 మంది సబ్స్క్రైబర్లను సాధించారంటే, మీరు ఒక వారంలోపు ఈ ఫీచర్‌కి యాక్సెస్‌ని అందుకుంటారు.

3. గెస్ట్ అప్పియరెన్స్:
మీరు చిన్న యూట్యూబరా లేదా అత్యధిక ఫాలోవర్స్ కలిగిన యూట్యూబరా అనేది విషయం కాదు. మీ ఛానెల్లో గెస్ట్ అప్పియరెన్స్ పాడ్ క్యాస్ట్ చేయడం అనేది చాలా కీలకం. ఇలా గెస్ట్ అప్పియరెన్స్ పెంచడం ద్వారా మీ ఛానెల్‌కు చేరుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పోడ్‌క్యాస్ట్‌లో కనిపించే ముందు, అర్ధమయ్యే అంశాన్ని సిద్ధం చేసి ఎంచుకోండి. ఇన్స్పైరింగ్గా, మీరు గణనీయమైన శ్రోతలను కలిగి ఉన్న ఒక అంశాన్ని కూడా ఎంచుకోవాలి.

4. Twitter లో వీడియోలను షేర్ చేయడం:
Twitter ప్లాట్‌ఫాం ఆన్లైన్ క్రియేటర్లకు మంచి వేదిక. యూట్యూబ్‌లో మీరు క్రియేట్ చేసిన వీడియోలను Twitter లో ట్వీట్ రూపంలో షేర్ చేయడం ద్వారా మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యమైన, మీ వీడియో కంటెంట్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు, కీ వర్డ్‌లను ఉపయోగించి ట్విటర్లో మీ వీడియో లింక్ పోస్ట్ చేయడం ద్వారా భారీగా వ్యూస్ లభిస్తాయి.

5. Redditవంటి సోషల్ మీడియాలనూ వినియోగించుకోవచ్చు:
చాలా మంది యూట్యూబర్లు మరియు ఆన్లైన్ క్రియేటర్లు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు మాత్రమే కనెక్ట్ అయి ఉన్నారు. కానీ మీరు బాగా గమనిస్తే భారీ ఫాలోవర్స్ కలిగిన అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను గుర్తించగలరు. వాటిలో Reddit ఒకటి. ఇది ప్రతి నెలా ఒక బిలియన్ సైట్ విజిట్స్ ను చేరుతుందనే విషయాన్ని గుర్తించాలి. ఈ ప్లాట్ ఫాం పై మీరు మీ లింక్‌లను పోస్ట్ చేయడం ద్వారా మంచి స్పందనను అందుకోగలరు.

అదేవిధంగా ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ద్వారా తెలుసుకుందాం.
* యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవడం చాలా సులువైన ప్రక్రియ. మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Gmail లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ Gmail సహాయంతో తో యూట్యూబ్ లో Sign in అవ్వాలి.
* యూట్యూబ్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు పలు రకాల ఆప్షన్స్ కనబడతాయి. వాటిలోనే రెండో ఆప్షన్ "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.
* "Create a New Channel" ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో(బాక్స్) ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ ఛానల్ కి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చెయ్యండి. దాంతో పాటు ఛానెల్ ప్రొఫైల్ పిక్చర్ ను అక్కడే అప్లోడ్ చేయండి. అంతే ఇక్కడితో మీ YouTube Channel క్రియేషన్ అయిపోతుంది.
* ఆ తర్వాత మీ ఛానెల్లో పూర్తి వివరాలు, ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనే వివరాల్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం Customize Channel ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీ ఛానల్ కి ఒక Logo ఇవ్వండి. అక్కడే మీరు Channel Description ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ గురించి వివరిస్తూ అంటే మీ ఛానల్ లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యబోతున్నారు వంటి వివరాలు అన్నితెలియచేయండి.
అలాగే మీ Gmail, Facebook , Twitter వంటి సోషల్ మీడియా పేజీలకు సంబందించిన లింక్స్ ని కూడా Add చేసుకోవచ్చు.
* ఇక మీరు మీ యూట్యూబ్ ఛానెల్లో వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. ఇందుకోసం ఛానెల్లో కుడి వైపు పై భాగంలో + సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086