మళ్లీ షాకిచ్చిన గూగుల్, ముఖ్యమైన 10 యాప్స్‌ తొలగింపు, ఆ యాప్స్ ఇవే !

Written By:

సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ పలు ప్రముఖ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించి వేసింది. తన పాలసీలను ఉల్లంఘించే బ్యాడ్‌ యాప్స్‌కు వ్యతిరేకంగా గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈ మధ్య బాగా పాపులర్ అయిన సరహ్ మెసేజ్ కూడా ఉంది. సరహ్‌తో పాటు ఇతర పాపులర్‌ యాప్స్‌ అమెజాన్‌ అండర్‌గ్రౌండ్‌,గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో స్థానం కోల్పోయాయి. సరహ్ అనేది తామెవరో తెలిసే అవకాశం లేకుండానే ఎదుటి వారికి సందేశాలు పంపుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీంతో వేధింపులకు ఇదో మాధ్యమంగా మారిపోయింది. దీనిపై యూజర్ల నుంచి కూడా భారీగానే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేయాలని నిర్ణయించింది.

శాంసంగ్ కార్నివాల్, అమెజాన్‌లో రూ.8 వేలు నగదు వెనక్కి, దూసుకొస్తున్న గెలాక్సీ ఎస్9

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

TubeMate

ట్యూబ్ మేట్ అనే యాప్‌పై కూడా గూగుల్‌ వేటు వేసింది. ఈ యాప్ యూట్యూబ్ నుంచి వీడియోలను నేరుగా యూజర్ల ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇదే గూగుల్‌కు నచ్చలేదు. యూట్యూబ్ వీడియోలను నచ్చినప్పుడు చూసుకోవడానికే మాత్రమే అవకాశం ఉంది. డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు లేదు

CM Installer

సీఎం ఇన్ స్టాలర్ కూడా గూగుల్‌ ప్లే స్టేర్‌లో స్థానం కోల్పోయింది. నచ్చిన టీవీ షోను చూసుకునేందుకు వీలు కల్పించే టీవీ పోర్టల్ యాప్‌ను కాపీరైట్ ఉల్లంఘనల అంశం కింద గూగుల్ నిషేధించింది.

Popcorn Time

ఇదొక టీవీ పోర్టల్ యాప్. దీని ద్వారా టీవీషోలు అలాగే సినిమాలు చూసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా సినిమాలు, టీవీషోలు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇలా డౌన్ లోడ్ చేయడం ఇల్లీగల్ కావడంతో ఈ యాప్‌ని గూగుల్ తన ప్లే స్టోర్ నుండి నిషేధించింది

AdAway, Lucky Patcher

యాడ్ బ్లాకర్‌ అనే మరో యాప్‌ను కూడా గూగుల్ తన వ్యాపార కోణాల రీత్యా నిషేధించింది. ఈ యాప్ ప్రకటనలను బ్లాక్ చేసేస్తుంది. అయితే ఇలా బ్లాక్ చేయడం వల్ల గూగుల్ తన వ్యాపారానికి మంచిది కాదనే ఉద్దేశంతో దీన్ని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.

Grooveshark, PSX4Droid

గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్, అమేజాన్ అండర్ గ్రౌండ్ తదితర యాప్ లు కూడా ప్లే స్టోర్ నుంచి స్థానం కోల్పోయాయి. PSX4Droid ద్వారా ప్లే స్టేషన్ గేమ్స్ ఆడుకునే అవకాశం ఉంది. అయితే ఇది కాఫీరైట్ అలాగే లీగల్ ఇష్యూ కావడంతో దీన్ని కూడా గూగుల్ నిషేధించింది.

Amazon UnderGround

ఈ యాప్ ద్వారా గేమ్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది గూగుల్ పాలసీలకు విరుద్ధంగా ఉండటంతో గూగుల్ ప్లే స్టోర్ నుండి దీన్ని తొలగించింది. అయితే దీన్ని కావాల్సిన వారు కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These 10 apps have been "banned" by Google More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot