మీ మొబైల్ స్లో అవుతుందా వెంటనే ఈ 5 యాప్స్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

మీ మొబైల్ మొదట్లో ఫాస్ట్ గా పని చేసి తరువాత వేగం తగ్గిందా...అయితే దానికి కారణం ర్యామ్.ర్యామ్ మెమరీ పై ఒత్తిడి పడటం వలన ఫోన్ స్లో అవుతుంటుంది.

By Anil
|

మీ మొబైల్ మొదట్లో ఫాస్ట్ గా పని చేసి తరువాత వేగం తగ్గిందా...అయితే దానికి కారణం ర్యామ్.ర్యామ్ మెమరీ పై ఒత్తిడి పడటం వలన ఫోన్ స్లో అవుతుంటుంది. ముక్యంగా ఆండ్రాయిడ్ యాప్స్ వల్ల ర్యామ్ మెమరీ పై ప్రభావం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలన్నా మీ ఫోన్ వేగంగా పని చేయాలన్న మీ మొబైల్ లో ఉండకూడని యాప్స్ వివరాలను ఈ శీర్షిక ద్వారా మీకు తెలుపుతున్నాము. ఓ సారి చెక్ చేసుకోండి.

 

Amazon యాప్...

Amazon యాప్...

ఈ మధ్య కాలంలో అమెజాన్ ఇస్తున్న ఆఫర్ల వళ్ళ చాలా మంది అమెజాన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటారు. ఒక వేళా మీ మొబైల్ లో అమెజాన్ యాప్ ను తరుచుగా వాడకపోతే వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి ఎందుకంటే మీ మొబైల్ లోని బ్యాటరీ ను ఎక్కువ శాతం ఈ యాప్ కన్జ్యూమ్ చేస్తుంది.మీకు అమెజాన్ లో తప్పనిసరి కొనుగోలు చేయడానికి ఆల్టర్నేటివ్ గా వెబ్ బ్రౌజర్ లో అమెజాన్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

Parallel Space యాప్....

Parallel Space యాప్....

ముక్యంగా ఈ యాప్ ను రెండు వాట్సాప్ అకౌంట్లను వాడడానికి ఉపయోగిస్తుంటారు . మీ మొబైల్ లో గనుక ఈ Parallel Space యాప్ ఉంటె వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి ఎందుకంటే మీ మొబైల్ లోని బ్యాటరీ ను ఎక్కువ శాతం ఈ యాప్ కన్జ్యూమ్ చేస్తుంది.ఒక వేళా మీకు పార్లల్ గా యాప్స్ వాడాలనుకుంటే ఆండ్రాయిడ్ oreo అప్ డేట్ ఉన్నవారికి పార్లల్ యాప్స్ అనే ఆప్షన్ ఉంది దాన్ని ఎనేబుల్ చేసుకొని మీకు కావలసిన యాప్ ను వాడుకోండి.

Facebook,Facebook Messenger యాప్స్ ...
 

Facebook,Facebook Messenger యాప్స్ ...

ఈ రెండు యాప్స్ కూడా బాటరీ ను ఎక్కువుగా కన్జ్యూమ్ చేస్తుంది. ఒక వేళా మీకు ఈ యాప్స్ వాడాలనుకుంటే Facebook Lite ,Facebook Messenger Lite యాప్స్ ను ఇన్‌స్టాల్ చేసుకోండి. దీని వాళ్ళ మీ మొబైల్ బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా ఉంటుంది.

CC Cleaners  యాప్స్....

CC Cleaners యాప్స్....

మొబైల్ లో ఉన్న జంక్ ను క్లీన్ చేయడానికి CC Cleaners యాప్స్ ను ఇన్‌స్టాల్ చేస్తుంటారు.అటువంటి యాప్స్ ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా బ్యాటరీ డ్రై అవుతుంటుంది. అందువల్ల మీ మొబైల్ లో ఉన్న సీసీ క్లీనర్స్ యాప్స్ ను అన్-ఇన్‌స్టాల్ చేయండి.

Battery Savers యాప్స్....

Battery Savers యాప్స్....

ఇప్పుడు వస్తున్న మొబైల్స్ లో Battery Saver అనే ఆప్షన్ డైరెక్ట్ గా వస్తుంది అయినా కూడా చాలా మంది బ్యాటరీ సేవర్స్ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాటరీ సేవర్స్ యాప్ లు బ్యాటరీ ని సేవ్ చేయకపోగా ఈ యాప్స్ ఏ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ మొబైల్ లోని ఎక్కువ శాతము బ్యాటరీ ని కన్జ్యూమ్ చేస్తుంది. అందువల్ల ఇటు వంటి యాప్స్ మీ మొబైల్ లో గనుక ఉంటె వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి.

Best Mobiles in India

English summary
These 5 apps are killing your battery.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X