ఈ యాప్స్...మీ రూటర్ను కంట్రోల్లో ఉంచుతాయి!

Posted By: Madhavi Lagishetty

ఇంట్లో ఎక్కడ కూర్చున్నా..నిల్చున్నా వై-ఫై ఆన్ చేసుకుని నెట్ వాడుకోవడంలో ఉన్న మజా మరెందులో ఉంటుంది చెప్పండి. వీడియోలు, సినిమాలు, లైవ్ ఛాటింగులు, లైవ్ స్ట్రీమింగ్ సినిమాలు...ఇలా ఎన్నో విధాలుగా ఇంటర్నెట్ను వాడుకోవచ్చు.

ఈ యాప్స్...మీ రూటర్ను కంట్రోల్లో ఉంచుతాయి!

కానీ కొన్ని సందర్భాల్లో వై-ఫై స్లోగా ఉంటే..తరచుగా సమస్యలు తలెత్తినట్లయితే...చిరాకు వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి ఒకే కనెక్షన్ను ఉపయోగించినప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వై-ఫై కొన్ని సందర్భాల్లో స్లో ఎందుకు అవుతుంది. ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఎందుకిలా దీనికి పరిష్కారం ఏంటి?

రూటర్ను ఎక్కడ పెట్టారన్నది కీలకమైన అంశం. రూటర్ను మీ నియంత్రణలో ఏర్పాటు చేసుకుంటే...ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

కొన్ని స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా మీ రూటర్ను కంట్రోల్ చేయవచ్చు. దీనికి సంబంధించిన కొన్ని బ్రాండ్లు కూడా ఉన్నాయి. మీరు యాప్ నిర్వహణ కోసం ఉపయోగించే రూటర్ బ్రాండ్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెట్ గేర్ జెనీ....

మీ ఇంట్లో కానీ..ఆఫీసులో కానీ నెట్ గేర్ రూటర్ ఉన్నట్లయితే...మీ డివైస్ లో నెట్ గేర్ జెనీ అనే యాప్ను ఇన్ స్టాల్ చేయండి. ఇది మీ హోం నెట్ వర్కుకు నిర్వహించడానికి సులభమైన మార్గం. ఈ యాప్ తో వైర్లెస్ సెట్టింగ్స్, నెట్ వర్క్ మ్యాప్, పేరెంట్స్ కంట్రోల్, గెస్ట్ యాక్సెస్ , ట్రాఫింక్ మీటరింగ్, మైమీడియాతోపాటు మరిన్ని రూటర్ సెట్టింగ్స్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ మీ మొబైల్ నుంచి రూట్ మోడ్ లో ఉన్న నెట్ గేర్ రూటర్కు కనెక్ట్ చేసినప్పుబు మాత్రమే పనిచేస్తుంది. యాక్సెస్ పాయింట్ మోడ్లో ఉన్నప్పుడు పనిచేయదు.

లింక్స్ సిస్ స్మార్ట్ వై-ఫై....

మీ స్మార్ట్ ఫోన్ నుంచి రౌటర్ల ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవడానికి యాప్ను అందిస్తాయి. మీ వైఫై టాప్ లో ఉన్న బటన్ను ప్రెస్ చేయండి. తర్వాత కనెక్ట్ చేసిన డివైసులను చెక్ చేయండి. గెస్ట్ యాక్సెస్ను సెటప్ చేయండి లేదా మీ పిల్లలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా హోం వర్క్ చేస్తుంటారు. లింక్ సిస్ యాప్ వెల్పో సిస్టమ్స్ మరియు లినీప్స్ స్మార్ట్ వైఫై రౌటర్లు పనిచేస్తాయి.

ASUS రూటర్....

మీ దగ్గర ఆసుస్ రూటర్ ఉన్నట్లయితే...స్మార్ట్ ఫోన్కు కనెక్ట్ చేయడానికి ఈ యాప్ ఇన్ స్టాల్ చేయవచ్చు. ఈ యాప్ తో మీరు రౌటర్ పర్వవేక్ష, నిర్వహణ క్లయింట్ డివైస్ నిర్వహణతోపాటు ఎన్నో చేయవచ్చు.

100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో విరుచుకుపడుతున్న టెల్కోలు

TP-లింగ్ టీథర్...

ఈ యాప్ మీ మొబైల్ డివైసులతో మీ TP-లింక్ రూటర్/XDLరూటర్ రేంజ్ ఎక్స్ టెండర్ను యాక్సెస్ చేయడానికి సులభమైన మార్గం. సెటప్ SSID , పాస్ వర్డ్ మరియు మీ డివైస్ల యొక్క ఇంటర్నెట్ లేదా VDSL/ADSL సెట్టింగ్స్, అనధికార యూజర్లను బ్లాక్ చేయవచ్చు. షెడ్యూల్ మరియు URL ఆధారిత ఇంటర్నట్ యాక్సెస్ నిర్వహణ వంటి పనులు చేయవచ్చు.

DS-రూటర్....

ఇది మీ స్మార్ట్ ఫోన్లో రిమోట్ గా పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని...ఈ యాప్ తో పేరెంట్స్ కంట్రోల్ సెట్టింగులను అనుచితమైన వెబ్ సైట్ల నుంచి మీ పిల్లలను రక్షించడానికి, మీ నెట్ వర్క్ ఫైర్వాల్ సెట్టింగులను సరిగ్గా ట్యూనింగ్ చేయడానికి పనిచేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These days we get lost easily if we are disconnected from the Internet.So, we have consolidated a list of router brands you can use for app management.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot