మిస్ట్ కాల్స్ బాధ తట్టుకోలేక, రాత్రికి రాత్రే బిలియనీర్ కాలేదు !

Written By:

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ ముందుగా ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకునేది వాట్సప్ ఒక్కటే. ప్రపంచంలో వాట్సప్ లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగం ఉండదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ప్రాచుర్యం పొందిన ఈ ఇన్‌స్ట్ంట్ యాప్‌ని ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. మరి ఈ యాప్ ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది. దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ అనే విషయాలను వాట్సప్ సీఈఓ టెక్ దిగ్గజాలతో షేర్ చేసుకున్నారు. ఆ విషయాలు మీకోసం.

షియోమికి శాంసంగ్ సవాల్, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సప్ కనిపెట్టడానికి గల కారణాలను..

కాలిఫోర్నియాలోని మౌంటేన్‌ వ్యూలో వందల కొద్దీ సిలికాన్‌ వ్యాలీ దిగ్గజాలతో నిర్వహించిన ఈవెంట్‌లో వాట్సప్ సీఈవో, సహవ్యవస్థాపకుడు జోన్ కౌమ్ రివీల్‌ వాట్సప్ కనిపెట్టడానికి గల కారణాలను, తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు.

పదేపదే మిస్డ్‌ కాల్స్‌ ..

తాను జిమ్‌లో ఉన్నప్పుడు పదేపదే మిస్డ్‌ కాల్స్‌ వస్తుండేవని, ఇది చాలా కోపానికి అసహనానికి కారణమయ్యేదని, ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఒక యాప్‌ను రూపొందించాలని బ్రియన్ యాక్టన్, తాను 2009లో నిర్ణయించామని తెలిపారు.

ప్రజలకు ఉపయోగపడేందుకు..

అయితే తాము ఓ కంపెనీని ప్రారంభించాలని అనుకోలేదని, ప్రజలకు ఉపయోగపడేందుకు కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే రూపొందించాలని అనుకున్నామని చెప్పారు. 

How to Link Aadhaar with Driving Licence Online in 4 Easy Steps (TELUGU)
ఆపిల్‌ ప్లే స్టోర్‌..

ఆపిల్‌ ప్లే స్టోర్‌..

ఆపిల్‌ ప్లే స్టోర్‌ తమ యాప్‌ను ఆమోదించినప్పటికీ, రాత్రికి రాత్రి ఇది విజయవంతం కాలేదని, ప్రారంభంలో దీన్ని ఎవరూ వాడలేదని పాత అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

ఫేస్‌బుక్‌ ఈ యాప్‌ను..

2014లో 400 మిలియన్‌ మందికి పైగా యూజర్లను సొంతం చేసుకుందని, అదే ఏడాది ఫేస్‌బుక్‌ ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో 19 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిందని తెలిపారు. దీంతో సహ వ్యవస్థాపకులమైన తాము రాత్రికి రాత్రే బిలీనియర్స్‌ అయినట్టు చెప్పారు.

గుర్తుండిపోయే డీల్‌

ఈ డీల్‌ తనకెంతో గుర్తుండిపోయే డీల్‌ అని అయితే గతేడాది బ్రియన్‌ కంపెనీ నుంచి వైదొలిగారని, తనని తాము చాలా మిస్‌ అవుతున్నట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ వాట్సప్ విజయంలో అతని పాత్ర మరువలేనిదని తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This Is How Founders Of WhatsApp Got The Idea To Start The Messaging Service More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot