ఈ ట్రిక్స్‌తో మీ వాట్సాప్ చాలా సేఫ్‌గా ఉంటుంది

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అందులో వాట్సాప్ అకౌంట్ అనేది ఇంకా కామన్ అయిపోయింది. అయితే ఇంటర్నెట్ తో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల అన్ని ఇప్పుడు ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలా మీ వాట్సాప్ హ్యాక్ అవుతుందో చెప్పలేం. ఏ క్షణంలోనైనా హ్యాకర్లు మీ ఫోన్ సహా వాట్సాప్ హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మొబైల్ ఫోన్లో వాట్సాప్ హ్యాక్ చేసేశారు. ఒక ప్రముఖుడి వాట్సాప్ హ్యాక్ అయినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. ఈ ఏడాదిలో ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ భద్రతపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మరో వాట్సాప్ ఎటాక్ ఇష్యూ ఆందోళన కలిగిస్తోంది. మీరు వాడే వాట్సాప్ అకౌంట్లో ఓ చిన్న సెట్టింగ్‌తో ముడిపడింది. దాన్ని మార్చుకుంటే మీ వాట్సాప్ చాలా సేఫ్ గా ఉండే అవకాశం ఉంది.

SMS లతో జాగ్రత్త : 
 

SMS లతో జాగ్రత్త : 

సైబర్ సెక్యూరిటీ సెల్ ప్రకారం.. వాట్సాప్ హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతిఒక్కరూ తమ వాట్సాప్ అకౌంట్లో ఈ సెట్టింగ్ సెట్ చేసి ఉండాలి. లేదంటే వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటోంది . ఈ సింపుల్ సెట్టింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. వాట్సాప్ తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు సైబర్ మోసగాళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోతాయని హెచ్చరిస్తోంది. స్పైవేర్ తో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లే లక్ష్యంగా సైబర్ దాడులకు ప్రయత్నిస్తున్నారు హ్యాకర్లు. ప్రత్యేకించి వాట్సాప్ లో పంపే media filesతో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇలాంటి ఫైల్స్ పంపడం ద్వారా వాట్సాప్ అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారు.

లూప్ హోల్స్ సాయంతో

లూప్ హోల్స్ సాయంతో

వాట్సాప్ లోని కొన్ని లూప్ హోల్స్ సాయంతో హ్యాకర్లు యూజర్ల అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. మరోవైపు.. వాట్సాప్.. సెక్యూరిటీ ఇష్యూలను ఒక్కొక్కటిగా ఫిక్స్ చేసుకుంటూ వస్తోంది. గ్రూపు చాట్ లేదా పర్సనల్ చాటింగ్ లో ఒక యూజర్ తన అకౌంట్ హ్యాక్ అయినట్టు మెసేజ్ పెట్టింది. ఇలాంటి మెసేజ్ లు ఎవరూ ఓపెన్ చేయొద్దని హెచ్చరించింది. తన వాట్సాప్ అకౌంట్లోని ఫోన్ నెంబర్లు, గ్రూపు సభ్యుల నెంబర్లను హ్యాకర్లు తస్కరించినట్టు తెలిపింది. అయితే తన వాట్సాప్ అకౌంట్లో సెట్టింగ్స్ లో PIN సెట్ చేయలేదని చెప్పింది. అందుకే హ్యాకర్లు ఈజీగా తన వాట్సాప్ హ్యాక్ చేయగలిగినట్టు పేర్కొంది.

PIN సెట్ చేసుకోండి

PIN సెట్ చేసుకోండి

వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా వాట్సాప్ లో ఆరు సంఖ్యల గల PIN సెట్ చేసుకోండి. PIN మర్చిపోయిన మళ్లీ పొందడానికి ఈమెయిల్ అడ్రస్ కూడా సెట్ చేయండి. ఈ ఆరు అంకెల పిన్ కోడ్ ఉంటుంది. దీనిద్వారా ఈజీగా మీ వాట్సాప్ సెక్యూర్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందిల్లా Settingsలో చిన్న ఆప్షన్ సెట్ చేసుకోవడమే. అదే.. Two Factor అథెంటికేషన్ ఫీచర్. యూజర్లకు అదనపు సెక్యూరిటీ ఉంటుంది. ఇంతకీ ఈ సెట్టింగ్ వాట్సాప్ లో ఎక్కడ ఉంటుంది.

ఎలా సెట్ చేసుకోవాలి
 

ఎలా సెట్ చేసుకోవాలి

మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయండి.

వాట్సాప్ టాప్ రైట్ కార్నర్ లో వర్టికల్ డాట్స్ పై క్లిక్ చేయండి.

Setttings ఓపెన్ చేసి.. అందులో Accountపై Tap చేయండి.

Two-step verification అనే ఆప్షన్ పై Tap చేయండి.

Disable, Change PIN, Change email address ఉంటాయి.

ఒకవేళ PIN సెట్ చేసి ఉంటే.. Tick mark కనిపిస్తుంది.

లేదంటే.. వెంటనే 6 అంకెల PIN సెట్ చేసుకోండి.

ఈ PIN మర్చిపోతే ఈమెయిల్ అడ్రస్ ద్వారా మళ్లీ PIN రీసెట్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
This Stupidly Simple New Hack Puts You At Risk Here’s What WhatsApp users do 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X