ఈ వాట్సప్ ట్రిక్ ట్రై చేయండి, మీ సమయాన్ని ఆదా చేయండి
మీరు వాట్సప్ వాడుతున్నారా..అయితే మీ వాట్సప్ లో సందేశాలను ఓ సారి చూస్తే గుండె బేజారయిపోతూ ఉంటుంది.
మీరు వాట్సప్ వాడుతున్నారా..అయితే మీ వాట్సప్ లో సందేశాలను ఓ సారి చూస్తే గుండె బేజారయిపోతూ ఉంటుంది. ఓ రెండు రోజుల పాటు డేటా ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే సందేశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి మనకి చికాకును తెప్పిస్తూ ఉంటాయి. ఇంకొందరు అయితే మెసేజ్ కి రిప్లయి ఇవ్వలేదేం అంటూ నానా యాగీ చేస్తుంటారు. ఇలాంటి సమస్యల నుంచి కొంచెం ఉపశమనం పొందేందుకు మీకు వాట్సప్ ఓ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి అదేంటో ఓ సారి చూద్దాం.

పిన్ చాట్
ఈ ఫీచర్ గురించి చాలామందికి అంతగా అవగాహన ఉండదు. మరికొందరికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు కూడా. అయితే ఈ ఫీచర్ ద్వారా మనకిష్టమైన లేదా మనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన చాట్‌ను పిన్ చేయొచ్చు.

ముగ్గురి చాట్స్‌ను మాత్రమే
గరిష్ఠంగా ముగ్గురి చాట్స్‌ను మాత్రమే పిన్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఎన్ని కొత్త సందేశాలు వచ్చినా పిన్ చేసిన ఆ మూడు చాట్స్ అలానే ఉంటాయి. వందల సంఖ్యలో సందేశాలు ఉన్నా.. మీరు వాటిని ఈ మూడింటిని ముందుగా చూసే అవకాశం ఉంటుంది.

హోల్డ్ చేసి ఉంచితే..
మీరు ఏదైతే చాట్‌ను పిన్ చేయాలని అనుకుంటారో ఆ చాట్‌పై కొన్ని సెకన్ల పాటు హోల్డ్ చేసి ఉంచితే ‘పిన్ చాట్' ఆప్షన్ వస్తుంది. దీని ద్వారా ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను వాట్సప్ తెరిచిన వెంటనే చూసుకోవచ్చు.

మరొక ట్రిక్
ముఖ్యమైన సందేశాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇంకో ట్రిక్ కూడా ఉంది. మనకు ముఖ్యమైన వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు ప్రత్యేక రింగ్‌టోన్ పెట్టుకుంటే మీరు ఆ టోన్ వినగానే మీకు మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవచ్చు.

కస్టమ్ నోటిఫికేషన్
అందుకోసం చాట్‌ను క్లిక్ చేసి ‘కస్టమ్ నోటిఫికేషన్'లోకి వెళ్లి మనకు నచ్చిన రింగ్‌టోన్ పెట్టుకోవడం ద్వారా ఆయా వ్యక్తుల నుంచో, గ్రూపుల నుంచో సందేశాలు వచ్చేటప్పుడు ఇట్టే తెలుసుకోవచ్చు.

ఎలాంటి లిమిట్ లేదు
దీనికి మాత్రం ఎలాంటి లిమిట్ లేదు. ఎన్ని చాట్‌లకు కావాలంటే అన్ని ప్రత్యేక రింగ్‌టోన్లను పెట్టుకునే సదుపాయం వాట్సాప్ కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications








