Threads యాప్‌కు ఏమైంది.. రెండు వారాల్లోనే ఎందుకంత మార్పు వచ్చింది..?
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌కు పోటీగా మెటా Threads యాప్‌ను ఈ నెల 6న విడుదల చేసింది. అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ డౌన్‌లోడ్‌లు కలిగిన యాప్‌గా రికార్డు సృష్టించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 మిలియన్ అకౌంట్లను పొందింది. అయితే చాలా మంది నిపుణులు సహా ఇతరులు థ్రెడ్స్ యాప్ .. ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని, మెరుగైన పరితీరు కనబరుస్తుంది భావించారు.
కానీ ఇదంతా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. థ్రెడ్స్ యాప్ ప్రారంభించిన తొలి వారంలో యాక్టివ్ యూజర్ల సంఖ్య గణనీయంగా ఉండేది. సుమారు 49 మిలియన్ రోజువారీ వినియోగదారులను కలిగి ఉండేది. అయితే ప్రారంభించిన రెండు వారాల్లోనే ఈ సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ వినియోగదారుల సంఖ్య సుమారుగా 23 మిలియన్‌లకు పడిపోయింది. అంటే కేవలం రెండు వారాల్లోనే థ్రెడ్స్ యాప్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది.

సాధారణంగా కొత్త యాప్‌లు టెక్నాలజీ రంగంలో కొత్త ఆసక్తిని కలిగిస్తాయి. థ్రెడ్స్ కూడా అటువంటి ఆసక్తిని రేకెత్తించింది. థ్రెడ్స్ ప్రచారంలో ఇన్‌స్టాగ్రాం కూడా కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌తోనే థ్రెడ్‌లోనూ అకౌంట్ తెరిచే సదుపాయం కూడా కల్పించింది.
అయితే ట్విట్టర్, థ్రెడ్స్ యాప్ కంటెంట్ క్రియేషన్, పోస్టింగ్ విషయాల్లో చాలా పోలికలున్నాయి. అయితే ఇన్‌స్టాగ్రాం సీఈవో ఆడమ్ మెస్సేరి కీలక ప్రకటన చేశారు. థ్రెడ్స్ యాప్ న్యూస్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వదని స్పష్టం చేశారు. అంటే వినియోగదారులు తమ నెట్‌వర్క్‌లోని ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మాత్రమే పరిమితం చేయబడతారు.
కానీ ట్విట్టర్ మాత్రం వార్తల ద్వారా తన ప్రాముఖ్యతను నిరూపించుకుంది. రాజకీయ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సహా ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తన ద్వారా లక్షలాది మందికి చేరే వేదికగా మారింది. కానీ థ్రెడ్స్ యాప్‌కు మాత్రం ఇటువంటి వ్యవస్థ లేదు.
దీంతోపాటు ట్విట్టర్ అకౌంట్‌ను మిగిలిన యాప్‌లతో సంబంధం లేకుండా వినియోగించుకోవచ్చు. అదే థ్రెడ్స్ వినియోగించేందుకు తప్పనిసరిగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కలిగి ఉండాలి. అయితే ట్విటర్‌లోని న్యూస్ సహా ఇతర సమాచారం కోసం రోజువారీగా కచ్చితంగా వినియోగదారులను కలిగి ఉంటుంది. అదే అటువంటి వినియోగదారులను థ్రెడ్స్ యాప్ కోల్పోనుంది.
స్పామ్ అకౌంట్లను నియంత్రించడంలో భాగంగా థ్రెడ్స్ యాప్ తాజాగా రేట్ లిమిట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మెస్సేరి ప్రకటన చేశారు. అయితే ఇదే తరహా ఫీచర్‌ను ట్విట్టర్ ఇదివరకే తీసుకొచ్చింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ప్రకటనపై ట్విట్టర్ సీఈవో స్పందించారు. Lmaooo copy అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేశారు.
థ్రెడ్స్ యాప్‌లో రోజువారీ వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కీలక ఫీచర్లను తీసుకొచ్చేందుకు మెటా సంస్థ ప్రయత్నం చేస్తోంది. ట్విట్టర్ తరహాలో డైరెక్ట్ మెసేజ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా సంస్థ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్‌లో కేవలం 280 అక్షరాలు మాత్రమే పోస్ట్ చేయవచ్చు. థ్రెడ్స్ యాప్‌లో 500 అక్షరాల వరకు పోస్ట్ చేయవచ్చు. థ్రెడ్స్‌లో 5 నిమిషాల నిడివితో వీడియోలను కూడా పోస్ట్ చేయవచ్చు. అదే ట్విట్టర్‌లో కేవలం 2 నిమిషాల 20 సెకన్ల వీడియోలను మాత్రమే పోస్టు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








