175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లకు చేరుకున్న Threads యాప్.. ట్రెండింగ్ ట్యాగ్స్‌లో కల్కి2898AD..!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ X (ట్విట్టర్) కు పోటీగా తీసుకొచ్చిన మెటాకు చెందిన థ్రెడ్స్ (Threads) ప్లాట్‌ఫాంపై కీలక ప్రకటన వెలువడింది. థ్రెడ్స్ యాప్ (Threads App Monthly Active Users) కీలక మైలురాయిని చేరుకున్నట్లు మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్ ప్లాట్‌ఫాం 175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లకు చేరుకుందని ప్రకటన చేశారు. అందులో భారత యూజర్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు.
గత సంవత్సరం థ్రెడ్స్ ప్లాట్‌ఫాంను మెటా (Meta) అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ అందులో అనేక మార్పులు చేశారు. దీంతో అనేక మంది యూజర్లలో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు మెటా ఈ ప్లాట్‌ఫాంను పోటీగా లాంచ్ చేసింది. అయితే ప్రారంభంలో రికార్డు స్థాయిలో యూజర్లను సంపాందించుకుంది. అయితే కొన్ని కారణాలతో కొద్దికాలంలోనే యూజర్లు థ్రెడ్స్‌ను పక్కన పెట్టేశారు.

మెటా మాత్రం ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ వచ్చింది. యూజర్ల సౌకర్యం కోసం అనేక కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా కీలక మైలురాయిని చేరుకోగలిగింది. దీంతోపాటు జుకర్‌బర్గ్ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్ యూజర్లు 50 మిలియన్ల ట్యాగ్స్ రూపొందించినట్లు చెప్పారు.
అయితే భారత్‌లో సినిమాలు, టీవీ, OTT సహా సెలబ్రిటీలు మరియు క్రీడల కోసం ఎక్కువగా ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. థ్రెడ్స్ కమ్యూనిటీలు.. స్నేహపూర్వక సంభాషణలకు వేదికగా మారినట్లు తెలిపారు. థ్రెడ్స్ ట్యాగ్స్ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన అంశాలను ట్యాగ్ చేస్తున్నారు.
భారత్‌కు సంబంధించి థ్రెడ్స్ యాప్ లో #Gunturkaaram, #Kalki2898AD, #HouseofDragon, #KotafactoryS3, #BTS11thanniversary మరియు #AditiRaoHydari సహా మరిన్ని ట్యాగ్ లు ట్రెండింగ్ లు ఉన్నట్లు చెప్పారు. దీంతోపాటు క్రెకెట్ పైనా భారీగా ట్యాగ్స్ క్రియేట్ అయినట్లు మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు.
T20 ప్రపంచ కప్, IPL, మహిళా ప్రీమియర్ లీక్ 2024 వంటి అంశాలపై భారీగా చర్చ జరిగినట్లు తెలిపారు. దీంతోపాటు భారత్ క్రికెటర్లు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సహా ఆకాస్ చోప్రా, సురేష్ రైనా వంటి స్టార్ క్రికెటర్లపైనా పెద్ద ఎత్తున చర్చలు జరిగేవన్నారు. తాజాగా జరిగిన IPL గురించి 200 మంది కంటెంట్ క్రియేటర్లు సమాచారాన్ని పంచుకొనేవారని తెలిపారు.
దీంతోపాటు సాధారణ యూజర్లు ఫోటోలు, వీడియోలను ఎక్కువగా అప్‌లోడ్ చేసినట్లు చెప్పారు. కంటెంట్ క్రియేటర్లకు థ్రెడ్స్ కీలకమైన వేదికగా మారినట్లు తెలిపారు. దీంతోపాటు జుకర్‌బర్గ్ కీలక ప్రకటన చేశారు. చర్చలకు థ్రెడ్స్‌ను మరింత మెరుగైన వేదికగా మారుస్తామని చెప్పారు. మరియు మరిన్ని ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications