Threads లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న కీలక ఫీచర్ రానుంది.. దీని వల్ల ఉపయోగాలు తెలుసా?
మెటా సంస్థ గత సంవత్సరం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ (X) పోటీగా థ్రెడ్స్ యాప్‌ను (Threads App) లాంచ్ చేసింది. ప్రారంభంలో అత్యధిక డౌన్‌లోడ్‌లు కలిగిన యాప్‌గా రికార్డు సృష్టించిన Threads ప్లాట్‌ఫాం.. కొన్ని రోజుల్లోనే వినియోగదారులను క్రమంగా కోల్పోయింది. దాంతో మెటా సంస్థ కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం మెటా సంస్థ థ్రెడ్స్‌లో అనేక కీలక ఫీచర్లను లాంచ్ చేస్తోంది. తాజాగా థ్రెడ్స్ యాప్ కొత్త ఫీచర్ (Threads App New Feature) గురించి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కీలక పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లోని ట్రెండింగ్ ఫీచర్ తరహాలో థ్రెడ్‌లోనూ కొత్త ఫీచర్‌ను త్వరలో టెస్టింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. థ్రెడ్స్ యూజర్లు ఎక్కువగా సెర్చ్ లేదా పోస్టు చేసిన టాపిక్‌లు అందులో కనిపిస్తాయని చెప్పారు.

థ్రెడ్స్‌లో "Today's Top Topics" పేరుతో సెర్చ్ పేజీ మరియు ఫర్ యూ ఫీడ్‌లో కనిపిస్తుందని తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా థ్రెడ్స్ యూజర్లు ప్రస్తుతం ఏ విషయంపై చర్చించుకుంటున్నారనేది తెలుస్తుంది. తొలుత థ్రెడ్స్ కొత్త ఫీచర్‌ను అమెరికాలో త్వరలో టెస్టింగ్ చేయనున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. వినియోగదారులకు ట్రెండింగ్ అంశాలతో కనెక్ట్ అయ్యే ఈ 'Today's Top Topics' ఫీచర్‌ను తొలిదశలో చిన్న స్థాయిలో టెస్టింగ్ చేస్తామన్నారు.
ఈ థ్రెడ్స్ కొత్త ఫీచర్‌పై ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడస్ మోస్సేరీ కీలక వివరాలు వెల్లడించారు. యూజర్ల ఎంగేజ్‌మెంట్ ను తెలుసుకొనేందుకు లెర్నింగ్ ఆల్గారిథమ్‌ను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ ఆల్గారిథమ్ ద్వారా ఒక ప్రత్యేకమైన అంశంపై ఎంత మంది యూజర్లు మాట్లాడుకుంటున్నారు. మరియు ఎంతమంది ఆయా పోస్టులపై స్పందిస్తున్నారనేది తెలుసుకుంటామన్నారు.

ఈ కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు మెటాలో ప్రత్యేక బృందం పనిచేస్తుందని తెలిపారు. ఆ బృందం సదరు అంశాలు కంటెంట్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయా లేదా నకిలీ వార్తలకు సంబంధించిన అంశాలా లేదా తప్పుదోవ పట్టించే అంశాలా అనే దానిని నిర్ధారిస్తాయి. దీంతోపాటు యూజర్లు కూడా సమస్యాత్మాక కంటెంట్‌పై ఫిర్యాదు చేయవచ్చని ఆడమ్ మోస్సేరి తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రాజకీయలకు సంబంధించిన వార్తలను సిఫార్సు చేయకున్నా.. థ్రెడ్స్‌లో ఈ కొత్త ఫీచర్‌లో రాజకీయాలకు సంబంధించిన వార్తలు కనిపిస్తాయని మెటా అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే వ్యక్తిగత సిఫార్సులు కాదని చెప్పారు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘన లేదా ఇతర సమస్యాత్మక కంటెంట్ మినహా రాజకీయ కంటెంట్‌ను థ్రెడ్స్‌లో అనుమతిస్తామని పేర్కొన్నారు.
థ్రెడ్స్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'Today's Top Topics" ఫీచర్‌ను త్వరలో అమెరికాలో చిన్న స్థాయిలో పరీక్షిస్తారు. వచ్చిన ఫలితాల ఆధారంగా ఇతర దేశాల్లోనూ భవిష్యత్‌లో టెస్టింగ్ చేసే అవకాశం ఉంది. భారత్‌లోనూ తర్వాత దశలో టెస్టింగ్ చేసే అవకాశం ఉంది.
కొంత మంది యూజర్ల రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ గురించి వెతుకుతారని, మరికొంతమని అందుకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారని తెలిపారు. మెటా తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌తో వారి అభిరుచులను గౌరవిస్తామని పేర్కొన్నారు. ఫీడ్‌ను ఫిల్టర్ చేయడం సహా అవసరమయ్యే వారికి ఎంగేజ్ చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వం, ఎన్నికల సమాచారం లేదా ఇతర సమస్యలకు గురించి తెలుసుకోవాలని భావించే వారు తమ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. మరియు పబ్లిక్ అకౌంట్ల నుంచి కంటెంట్‌ను పొందవచ్చు. ఇప్పటికే ఫాలో అవుతున్న ఖాతాల ను కంటెంట్‌ను ఈ కొత్త అప్‌డేట్ ప్రభావితం చేయదని తెలిపారు.
వార్తలు, రాజకీయ వివాదాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను దూరంగా ఉంచే ఉద్దేశంతోనే మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ సోషల్ మీడియా వేదికల్లో రాజకీయాలకు సంబందించిన కంటెంట్ పరిమితం చేయడం మరియు వ్యతిరేక కంటెంట్‌పైన పరిమితులను విధించనుంది.


Click it and Unblock the Notifications