చైనా కంపెనీలకు దిమ్మతిరిగింది, టిక్‌టాక్ నుంచి అదిరే మొబైల్

ఇండియా మార్కెట్ ని శాసిస్తున్న చైనా కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇది. ఇండియాలో ఇప్పటికే పాతుకుపోయిన ఈ కంపెనీలకు షాక్ ఇస్తోంది ఎవరో కాదు. టిక్ టాక్ యాప్. అదేంటి యాప్ మొబైల్ కంపెనీలకు షాక్ ఇవ్వడమేంది అను

|

ఇండియా మార్కెట్ ని శాసిస్తున్న చైనా కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇది. ఇండియాలో ఇప్పటికే పాతుకుపోయిన ఈ కంపెనీలకు షాక్ ఇస్తోంది ఎవరో కాదు. టిక్ టాక్ యాప్. అదేంటి యాప్ మొబైల్ కంపెనీలకు షాక్ ఇవ్వడమేంది అనుకుంటున్నారా.. ఆ యాప్ త్వరలో ఓ మొబైల్ మార్కెట్లోకి తీసుకురానుంది. చైనా ఫోన్లను సవాల్ చేస్తూ టిక్ టాక్ పేరంట్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.

 
చైనా కంపెనీలకు దిమ్మతిరిగింది, టిక్‌టాక్ నుంచి అదిరే మొబైల్

టిక్ టాక్ యాప్ కు ఇండియాలో అతిపెద్ద మార్కెట్ తో పాటు ఎంతో క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. యూజర్లను ఎంతో ఆకట్టుకున్న ఈ టిక్ టాక్.. పేరంట్ కంపెనీ బైటెడాన్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

 స్మార్ట్ ఫోన్లపై ప్రీ ఇన్ స్టాల్డ్ (pre-installed) యాప్స్

స్మార్ట్ ఫోన్లపై ప్రీ ఇన్ స్టాల్డ్ (pre-installed) యాప్స్

ఇండియాలో సేల్స్ సునామీ సృష్టిస్తోన్న చైనీ కంపెనీలు షియోమీ, ఒప్పో, వివో స్మార్ట్ ఫోన్ మేకర్లకు టిక్ టాక్ కంపెనీ గట్టి పోటీ ఇవ్వనుంది. బైటెడాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యామింగ్ స్మార్ట్ స్మార్ట్ ఫోన్లపై ప్రీ ఇన్ స్టాల్డ్ (pre-installed) యాప్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టాలనే తన కలను సాకారం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 2019 జనవరిలో..

2019 జనవరిలో..

చాలావరకూ చైనీస్ కంపెనీలు తమ యాప్స్ కోసం స్మార్ట్ ఫోన్లలో ప్రీ ఇన్ స్టాల్డ్ మోడల్ ను వినియోగిస్తున్నాయి. టిక్ టాక్ యాప్ మాత్రమే కాదు.. బైటెడాన్స్ కంపెనీ నుంచి కొలబరేషన్ టూల్ లార్క్, Felilao (ఫెలిలాయో) ఇన్ స్టంట్ మెసేంజర్, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ సర్వీసులు కూడా ఉన్నాయి. 2019 జనవరిలో బైటెడాన్స్ కంపెనీ ఫోన్ మేకర్ స్మార్టిసాన్ నుంచి ఉద్యోగులు, పేటెంట్ రైట్స్ ను కొనుగోలు

చైనా ఫోన్లకు షాక్ తప్పదా..
 

చైనా ఫోన్లకు షాక్ తప్పదా..

తమ కంపెనీ నుంచి త్వరలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుందనే టిక్ టాక్ కంపెనీ సంకేతాలను ఇచ్చింది. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాదిలో తొలిసారి బైటెడాన్స్ కంపెనీ తమ రెవెన్యూ టార్గెట్ ను చేరుకోవడంలో విఫలం అయినట్టు రివీల్ చేసింది. కాగా బైటెడాన్స్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రానుందనే వార్తతో ఇతర పోటీదారులైన షియోమీ, ఒప్పో, వివో స్మార్ట్ ఫోన్ మేకర్లలో కలవరం మొదలైనట్టు కనిపిస్తోంది.

అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు

అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు

స్మార్ట్ ఫోన్ బిజినెస్ లో అడుగుపెడుతుందనే వార్తపై టిక్ టాక్ కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు టిక్ టాక్ యాప్.. ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ పై మోస్ట్ పాపులర్ యాప్ గా నిలిచినట్టు సెన్సార్ టవర్ రిపోర్ట్ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చి నెల త్రైమాసికంలో టిక్ టాక్ యాప్ ను 33 మిలియన్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.

వివాదాలతో ముందుకు

వివాదాలతో ముందుకు

గూగుల్ ప్లే స్టోర్ పై మోస్ట్ పాపులర్ యాప్ కాకపోయిన అప్పటికీ 88.2 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ అయినట్టు నివేదిక వెల్లడించింది. ఇండియాలో టిక్ టాక్ యాప్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. టిక్ టిక్ వీడియోలను అసభ్యకరమైన రీతిలో పోస్టులను ప్రమోట్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇండియాలో టిక్ టాక్ యాప్ ను తాత్కాలికంగా బ్యాన్ చేశారు. ఆ తర్వాత దేశంలో టిక్ టాక్ యాప్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఎప్పటిలానే ఇప్పుడు టిక్ టాక్ యాప్.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది

Best Mobiles in India

English summary
TikTok maker's next move may bring bad news for Xiaomi, Oppo, Vivo and others

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X