ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా టిక్‌టాక్ ఫోటో షేరింగ్ యాప్.. పేరు ఇదేనా.. ఎప్పుడు లాంచ్ కానుంది?
టిక్ టాక్.. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌లలో ఒకటిగా ఉంది. ఇప్పటికే టిక్‌టాక్.. ఫోటో షేరింగ్ యాప్‌ను కూడా త్వరలో లాంచ్ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ కొత్త యాప్.. మెటా నేతృత్వంలోని ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీనిచ్చే విధంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్‌పై తాజాగా ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
టిక్‌టాక్ ఫోటో షేరింగ్ యాప్ పేరు ఇదేనా ? :
ఓ పోస్టు ఆధారంగా ఈ టిక్‌టాక్ ఫోటో షేరింగ్ యాప్‌నకు టిక్‌టాక్ నోట్స్ (TikTok Notes) అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే టిక్‌టాక్ యూజర్లకు కొత్త యాప్‌నకు సంబంధించిన పాప్‌అప్ నోటిఫికేషన్లు వస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా యాప్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎటువంటి ప్రకటన చేయని టిక్‌టాక్ :
అయితే సంస్థ ప్రకారం ప్రస్తుతం వినియోగానికి ఈ యాప్ అందుబాటులో లేదు. అయితే ఈ పేరుపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాము మరింత మెరుగైన అన్వేషణల కోసం ఎల్లప్పుడు ప్రయత్నం చేస్తుంటామని టిక్‌టాక్ ప్రతినిధి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ (instagram rival tiktok app) అవుతోంది.
అయితే మెటా నేతృత్వంలోని ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీనిచ్చేందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఫేస్‌బుక్ కూడా టిక్‌టాక్ తరహా పుల్ స్క్రీన్ వీడియో ప్లేయర్‌ను లాంచ్ చేనున్నట్లు తెలిపింది. దీంతోపాటు టిక్‌టాక్ కూడా X మరియు థ్రెడ్స్ తరహా టెక్ట్స్ పోస్టింగ్‌లు, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను పోస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

ఇన్‌స్టా తరహా ఫీచర్లను కలిగి ఉండనుందా?
టిక్‌టాప్ యాప్ నుంచి సమాచారాన్ని టిక్‌టాక్ ఫోటో షేరింగ్ యాప్‌నకు బదిలీ చేసుకొనే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా ఫోటో ఫోస్టులను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ యాప్ మంచి అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. అయితే చాలావరకు ఇన్‌స్టా తరహా ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనిపై టిక్‌టాక్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఈ టిక్ టాక్ నోట్స్ యాప్ ఎప్పుడు లాంచ్ కానుందనే సమాచారం వెల్లడి కాలేదు. దీంతోపాటు ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంటుందనే సమాచారం కూడా వెల్లడి కాలేదు. డిజైన్ సహా ఇతర వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం నేపథ్యంలో కొత్త నోట్స్ యాప్ లాంచ్ కానుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications