ఆపిల్,స్పాటిఫై లకు పోటీగా టిక్‌టాక్ మ్యూజిక్ స్ట్రీమ్ యాప్

|

ప్రముఖ చైనా ఇంటర్నెట్ సంస్థ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ యజమాని బైట్‌డాన్స్ వచ్చే నెలలోనే కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవతో స్పాటిఫై మరియు ఆపిల్ మ్యూజిక్ వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వడానికి సిద్దంగా ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. మొదటగా యుఎస్‌లో కంటే ముందు భారతదేశం, ఇండోనేషియా మరియు బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

బైట్‌డాన్స్ స్మార్ట్‌ఫోన్‌
 

బైట్‌డాన్స్ స్మార్ట్‌ఫోన్‌

ఈ నెల ప్రారంభంలో టిక్‌టాక్ యొక్క మాతృ సంస్థ బైట్‌డాన్స్ తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 8 జీబీ ర్యామ్ + 64GB స్టోరేజ్, 6.39-ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ SOC, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి మరిన్ని స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉన్నాయి. ఇప్పుడు బైట్‌డాన్స్ వచ్చే నెల నాటికి మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవను ప్రారంభించటం కోసం గ్లోబల్ లైసెన్సింగ్ ఒప్పందాల కోసం సంస్థ యూనివర్సల్ మ్యూజిక్, సోనీ మ్యూజిక్ మరియు వార్నర్ మ్యూజిక్‌లతో చర్చలు జరుపుతోంది.

తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలు

ఆన్-డిమాండ్ మ్యూజిక్

ఆన్-డిమాండ్ మ్యూజిక్ తో పాటు రాబోయే కొత్త మ్యూజిక్ కోసం యాప్ లో సెర్చ్ విభాగంలో చిన్న వీడియో క్లిప్‌ల లైబ్రరీ ఉంటుంది. అంతేకాకుండా మీరు సంగీతం వింటున్నప్పుడు పాటలను సమకాలీకరించవచ్చు అని రాయిటర్స్ నివేదించింది.

వాట్సాప్‌లో MP4 ఫైల్ వచ్చిందా.. జరభధ్రం మిత్రమా

టిక్‌టాక్

ఇంకా టిక్‌టాక్ యొక్క మ్యూజిక్ స్ట్రీమ్ అప్ కోసం ఇంకా పేరు పెట్టలేదు. దాని ధర వివరాలు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. ధర విషయానికి వస్తే US లో స్పాటిఫై, ఆపిల్ వంటి వారు వసులు చేస్తున్న దాని కంటే తక్కువగా ఉండవచ్చు.

ఆన్‌లైన్‌ పేమెంట్ రంగంలోకి ఫేస్‌బుక్ గ్రాండ్ ఎంట్రీ

ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ధర
 

ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ధర

ఇండియాలో ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ధర నెలకు 99 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఫ్యామిలీ ప్లాన్ నెలకు రూ.149ల నుండి మొదలవుతుంది. ఇందులో విద్యార్థుల కోసం రాయితీ ప్రణాళిక కూడా ఉంది దీని ధర నెలకు రూ.49లు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్ లు ఉంటే వెంటనే డెలిట్ చేయండి

స్పాటిఫై సబ్స్క్రిప్షన్ ధర

స్పాటిఫై సబ్స్క్రిప్షన్ ధర

స్పాటిఫై యొక్క ప్రీమియం వార్షిక ప్రణాళిక ధర రూ.1,189. అలాగే నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర రూ.119. ఇతర ప్రణాళికల విషయంలో రూ.13 ధర వద్ద ఒక రోజు ప్లాన్, రూ.39 ధర వద్ద ఏడు రోజుల ప్లాన్, రూ.389 ధర వద్ద మూడు నెలల ప్లాన్ మరియు రూ.719 ధర వద్ద ఆరు నెలల ప్రీమియం ప్లాన్ ను అందిస్తుంది.

హాట్‌స్టార్‌లో హాల్ చల్ చేయనున్న Avengers: Endgame

టిక్‌టాక్ డౌన్‌లోడ్ సంఖ్య

టిక్‌టాక్ డౌన్‌లోడ్ సంఖ్య

టిక్‌టాక్ ఇప్పుడు యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. టిక్‌టాక్ డౌన్‌లోడ్ సంఖ్యల విషయంలో ఇండియా 466.8 మిలియన్లతో చార్టులో అందరి కంటే ముందంజలో ఉంది. ఇది అన్ని ప్రత్యేకమైన ఇన్‌స్టాల్‌లలో 31 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019 లో టిక్‌టాక్ డౌన్‌లోడ్‌లు 614 మిలియన్లను దాటాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆరు శాతం ఎక్కువ.

Most Read Articles
Best Mobiles in India

English summary
TikTok Owner ByteDance To Launch Its Own Music Streaming App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X