టిక్‌టాక్ మరో సంచలనం, మ్యూజిక్ యాప్ వస్తోంది

By Gizbot Bureau
|

ప్రముఖ సోషల్ యాప్ టిక్‌టాక్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఊహించన రీతిలో దూసుకుపోతున్న టిక్ టాక్ నుంచి త్వరలో ఓ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. దానికి రెస్సో (Resso)గా నామకరణం చేయగా.. ప్రస్తుతం టిక్‌టాక్ ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం ఈ యాప్‌ను టిక్‌టాక్ భారత్, ఇండోనేషియాలలో టెస్ట్ చేస్తున్నది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంచారు. ఇక త్వరలోనే పూర్తి స్థాయి వెర్షన్‌ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు. కాగా ఈ యాప్‌ను నెలకు రూ.119 సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన భారత్‌లో అందివ్వనున్నట్లు తెలిసింది.

కాలిఫోర్నియాలో దావా

ఇదిలా ఉంటే అమెరికా నుంచి యూజర్ల వ్యక్తిగత డేటాను పెద్దయెత్తున చైనాకు పంపించిందనే ఆరోపణలతో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ 'టిక్‌టాక్‌'‌పై కాలిఫోర్నియాలోని ఓ న్యాయస్థానంలో దావా దాఖలైంది. యూజర్ అనుమతి లేకుండా టిక్‌టాక్‌ రహస్యంగా ఈ డేటాను సేకరించిందని ఈ దావాలో ఆరోపించారు.

మిస్టీ హాంగ్ పేరుతో దావా

కాలిఫోర్నియాలోని ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిని మిస్టీ హాంగ్ పేరుతో గత వారం ఈ దావా దాఖలైంది. టిక్‌టాక్‌ యాప్‌ను తాను ఈ ఏడాది డౌన్‌లోడ్ చేసుకున్నానని, కానీ ఖాతా ఏర్పాటు చేసుకోలేదని ఆమె చెప్పారు. అయితే కొన్ని నెలల తర్వాత టిక్‌టాక్‌ తనకు ఒక ఖాతాను సృష్టించిందని, పబ్లిష్ చేయాలని తాను ఎన్నడూ అనుకోని తన డ్రాఫ్ట్ వీడియోలను యాప్ రహస్యంగా తీసేసుకుందని ఆరోపించారు.

20 ఏళ్ల లోపు వారే ఎక్కువ

ఇటీవలి కాలంలో టిక్‌టాక్ ప్రాచుర్యం అంతకంతకూ పెరిగిపోయింది. ఇది అత్యధికంగా 20 ఏళ్లలోపు వారిలో ఎక్కువ ఆదరణ పొందుతోంది. పాటలు, హాస్యసన్నివేశాలకు అనుగుణంగా పెదవులను ఆడిస్తూ పెట్టే 15 సెకన్ల వీడియోలు, అసాధారణమైన ఎడిటింగ్ ట్రిక్కులతో కూడిన వీడియోలను వీరు ఎక్కువగా షేర్ చేస్తుంటారు. 

వ్యక్తిగత గోప్యత భద్రతపై ఆందోళనలూ 

ఒకవైపు యాప్ విపరీతంగా విస్తరిస్తుండగా, మరోవైపు యూజర్ల వ్యక్తిగత గోప్యత భద్రతపై ఆందోళనలూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఆందోళనలు ప్రధానంగా అమెరికాలో ఎక్కువవుతున్నాయి. చైనా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటూ, ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు టిక్‌టాక్‌పై ఉన్నాయి. ఈ ఆరోపణల విషయంలో అమెరికా శాసనకర్తల నుంచి కంపెనీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Best Mobiles in India

English summary
TikTok owner is testing music app in bid for next global hit

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X