టిక్‌టాక్ నుంచి కొత్త ఫోటో షేరింగ్ యాప్.. ఇన్‌స్టాగ్రామ్‌కు గట్టి పోటీ ఇవ్వనుందా??
టిక్‌టాక్ (Tiktok App) ఈ పేరు విననివారు లేరు అనేంతగా ఈ యాప్ పాపులర్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల భారత్‌లో ఈ టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ టిక్‌టాక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫోటో షేరింగ్ యాప్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
టిక్‌టాక్ ఫోటో షేరింగ్ (Tiktok Photos App) యాప్ ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మరియు ఇన్‌స్టాకు పోటీనిచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టిక్‌టాక్, ఇన్‌స్టా షార్ట్ వీడియో మార్కెట్‌లో పోటీగా ఉన్నాయి.

అయితే టిక్‌టాక్ ప్రధానంగా వీడియోలపైనే దృష్టిసారించగా.. తాజాగా ఫోటో షేరింగ్‌కు అనుకూలంగా ఉండేలా మరో యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. కొందరికి ఈ యాప్ టెస్టింగ్‌కు అందుబాటులో ఉందని తెలుస్తోంది. దీంతోపాటు టిక్‌టాప్ యాప్ నుంచి సమాచారాన్ని టిక్‌టాక్ ఫోటోస్ యాప్‌కు బదిలీ చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రత్యేకంగా ఫోటో ఫోస్టులను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ యాప్ మంచి అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. అయితే సుమారుగా ఈ టిక్‌టాక్ ఫోటోస్ యాప్ ఇన్‌స్టా తరహా ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యాప్ కోసం సంస్థ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.
* ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను మెరుగుపరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెటాకు చెందిన యాప్ ఇంజినీర్ గత నెలలో ఇందుకు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. దీని ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఏఐ ఫీచర్లతో ఇంటిగ్రేట్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్క్రీన్‌షాట్ ఆధారంగా త్వరలో రానున్న AI ఆధారిత ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు టెస్ట్ రాసుకొనేందుకు సాయం చేస్తుంది. "Write with AI" పేరుతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ల తమ DM (డెరెక్ట్ మెసెజ్) లో ఆప్షన్‌లో ఏదైనా రాసినప్పుడు కాపీ, కట్ వంటి పాప్ అప్ విండోగా ఇది కూడా కనిపిస్తుంది. మెటా సొంత లాంగ్వేజ్ మోడల్ Liama 2 Large ఆధారంగా 'Write with AI' పనిచేస్తుంది.
ఈ ఫీచర్ యూజర్లు తమ ఇన్‌స్టా ఖాతాల్లో రాసుకొనేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి స్క్రీన్‌షాట్ ఆధారంగా DM ఆప్షన్‌లోనే ఈ ఫీచర్ కనిపిస్తుండగా.. భవిష్యత్‌తో స్టోరీస్, రీల్స్, పోస్టుల్లో కూడా రాసుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఏ దశలో ఉంది, టెస్టింగ్ ఎంత వరకు వచ్చింది, ఎప్పటి నుంచి ఈ ఫీచర్ ఇన్‌స్టాలో అందుబాటులోకి వస్తుందనేది తెలియలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








