Home
Apps

ఇకపై ఈజీగా లవర్‌ను వెతుక్కోవచ్చు.. కాలేజీ స్టూడెంట్స్ కోసం ఇండియాలో "టిండర్ యూ" ఫీచర్ విడుదల!

Tinder U: ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్, కాలేజీ విద్యార్థుల కోసం ఇండియాలో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. "టిండర్ యూ" అని పిలిచే ఇది కాలేజీలో చదివే స్టూడెంట్స్ కోసమే స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఈ ఫీచర్ ద్వారా స్టూడెంట్స్ డేటింగ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్‌ని చేసుకోవచ్చు, అంతేకాదు కెరీర్ కోసం నెట్‌వర్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వాళ్లిద్దరికీ కామన్‌గా ఉండే ఇంట్రెస్ట్స్‌ని బట్టి జరుగుతాయి.

ఇండియాలో యూత్‌ని బాగా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో టిండర్ ఈ ఫీచర్‌ని లాంచ్ చేసింది. అంతేకాదు, ఇది యంగ్ జనరేషన్‌కి సురక్షితమైన చాలా విశ్వాసనీయమైన అనుభూతిని కల్పిస్తుందని కంపెనీ చెబుతోంది. మరి ఇది ఎలా పని చేస్తుంది, ఇందులో జాయిన్ అవ్వడానికి వెరిఫికేషన్ ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం.

Tinder U A Special Platform for Students to Date

* టిండర్ యూ అంటే..
టిండర్ యూ అనేది టిండర్ యాప్‌లోనే ఒక స్పెషల్ ఫీచర్. ఇది 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న స్టూడెంట్స్ కోసం మాత్రమే. అది కూడా రెగ్యులర్ కాలేజీకి వెళ్లేవాళ్లకి, ఏదో ఒక డిగ్రీ చదివేవాళ్లకి మాత్రమే. ఈ ఫీచర్ ద్వారా స్టూడెంట్స్ వాళ్ల కాలేజీలో లేదా దగ్గర్లోని కాలేజీల్లో చదివేవాళ్లతో పరిచయం ఏర్పరచుకోవచ్చు.

టిండర్ యూ ఫీచర్‌లో జాయిన్ అవ్వాలంటే, స్టూడెంట్స్ వాళ్ల కాలేజీ ఈమెయిల్ ఐడీతో ప్రొఫైల్ వెరిఫై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిజమైన స్టూడెంట్స్ మాత్రమే ఈ యాప్‌ని ఉపయోగిస్తారు. దాంతో ఇది డేటింగ్ కోసం అత్యంత సురక్షితమైన వేదికగా మారుతుంది.

* టిండర్ యూ ఎలా పనిచేస్తుంది.
టిండర్ యూ ఉపయోగించడానికి ముందుగా టిండర్ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ మీద నొక్కాలి. "ఎడిట్ ఇన్ఫో" ఆప్షన్‌ను ఎంచుకుని వివరాలు అప్‌డేట్ చేయాలి. స్కూల్/కాలేజ్ సెక్షన్ కిందకి స్క్రోల్ చేసి, వాళ్ల కాలేజ్ పేరు యాడ్ చేయాలి. "అప్లై ఫర్ టిండర్ యూ" మీద నొక్కి స్టూడెంట్ ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలి.

* ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాసెస్..

ఒకసారి వెరిఫికేషన్ అయిపోయాక, యూజర్స్ తమ ప్రొఫైల్ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అవుతారు, ఏ బ్రాంచ్ చదువుతున్నారు, కాలేజీలో ఏమేం యాక్టివిటీస్‌లో పాల్గొంటారు అనే వివరాలు చేర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కామన్ ఇంట్రెస్ట్స్ ఉన్న స్టూడెంట్స్ సులభంగా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.

* టిండర్ యూలో స్పెషల్ ఫీచర్స్
టిండర్ యూ కాలేజీ స్టూడెంట్స్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో స్టూడెంట్స్ వాళ్లలాగే ఆలోచించే వాళ్లని కలవడం చాలా సులభమవుతుంది. కాలేజీ క్లబ్స్‌లో కానీ, సొసైటీల్లో కానీ ఉన్నవాళ్లు, ఆ వివరాలు ప్రొఫైల్‌లో పెట్టుకోవచ్చు. ఇది ఇద్దరి మధ్య మంచి టాపిక్ స్టార్ట్ చేయడానికి సహాయపడుతుంది.

అంతేకాదు, దగ్గర్లో ఉన్న వాళ్లని చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ శ్రమతో వెతుక్కోవచ్చు. కాలేజీ క్యాంపస్ దాటకుండానే సోషల్ సర్కిల్‌ని పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందని చెప్పడానికి మెసేజ్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ గా "సూపర్ లైక్" కొడితే చాలు అని కంపెనీ చెబుతోంది.

* ఇండియాలో టిండర్ యూ నడుస్తుందా..
వన్ పోల్ అనే సర్వే ప్రకారం, ఇండియాలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 57% మంది డేటింగ్ యాప్స్ ద్వారా భాగస్వాములను వెతుక్కున్నారట. వాళ్లలో 67% మంది ఆన్‌లైన్‌లో కలిసిన వాళ్లతో డేటింగ్ చేశారట. ఇంకా 55% మంది ఇలాంటి యాప్స్ ద్వారా కొత్త ఫ్రెండ్స్‌ని కూడా చేసుకున్నారట.

టిండర్ యూ ఫీచర్‌తో, కాలేజీ నెట్‌వర్కింగ్‌ని మరింత ఈజీగా, ఫన్‌గా, సురక్షితంగా మార్చాలని టిండర్ చూస్తోంది. దీనివల్ల స్టూడెంట్స్ రొమాంటిక్ సంబంధాలు మాత్రమే కాదు, స్నేహాలు కూడా పెంచుకోవచ్చని టిండర్ భావిస్తోంది.

FAQs
మొబైల్ ఫోన్ హీటింగ్ సమస్యను ఎలా తగ్గించాలి?

ఎక్కువ సమయం వరకు గేమింగ్ లేదా హెవీ యాప్స్ ఉపయోగించకండి.
మొబైల్‌ను సూర్యరశ్మిలో ఉంచకండి.
అధిక హీటింగ్ అనిపిస్తే, కవర్లను తొలగించండి.
అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండేందుకు ఏం చేయాలి?

* అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేయండి.
* స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి.
* బ్యాటరీ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయండి.
* అనవసరంగా ఉన్న నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు ఏ విషయాలు గమనించాలి?

* ప్రాసెసర్, RAM, స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ లైఫ్, మరియు డిస్ప్లే రిజల్యూషన్‌లను పరిశీలించాలి.
* మీ అవసరాలకు తగ్గ రేంజ్‌లో ఉన్న మొబైల్‌ను ఎంపిక చేసుకోవాలి.
* బ్యాండ్ సపోర్ట్ (5G/4G), ఫాస్ట్ చార్జింగ్, మరియు ఇతర ఫీచర్లు కూడా చూడండి.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Tinder U A Special Platform for Students to Date, Network, and Make Friends
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X