దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ప్రభుత్వ యాప్స్‌..!

కేంద్ర ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ ఇండియా' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే.

|

కేంద్ర ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ ఇండియా' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో వెనక పడిన అనేక గ్రామాల్లో ప్రజలు ఇంటర్నెట్ వినియోగించుకునేలా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. ఇందులో భాగంగా అనేక గవర్నమెంట్ యాప్స్ ని కేంద్రప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ శీర్షిక లో భాగంగా ప్రభుత్వ సేవల కోసం ఉపయోగపడే కొన్ని యాప్స్ లిస్ట్ ను మీకు అందిస్తున్నాం.ఒక సారి చెక్ చేసుకోండి

My Gov :

My Gov :

ఈ యాప్ భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది. కేంద్ర మంత్రివర్గాలు మరియు సంబంధిత ప్రభుత్వ సంస్థలతో ప్రజలను ఈ యాప్ ద్వారా కనెక్ట్ చేసి వారి ఆలోచనలు ,సలహాలను మార్గదర్శకత్వం చేయడానికి కృషి చేస్తుంది.

Online RTI :

Online RTI :

ఒక సమాచార హక్కును ఫైల్ చేయడానికి చూస్తున్న వ్యక్తులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసి, ఉపయోగించగలరు. ఇక్కడ, ఆర్టీఐ విభాగానికి మీ కోసం ఒక దరఖాస్తును రూపొందిస్తారు మరియు దానిని పంపే నిపుణులైన న్యాయవాదుల మరియు నిపుణుల సహాయంతో RTI ను ఫైల్ చేయవచ్చు.అలాగే దరఖాస్తు సమర్పించే ముందు డ్రాఫ్ట్ లో మార్పులను చేయవచ్చు.

BHIM :
 

BHIM :

Bharat Interface for Money (BHIM) డిజిటల్ లావాదేవీలకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వినియోగదారులు UPI చెల్లింపు అడ్రస్, ఫోన్ నంబర్లు లేదా QR కోడ్ ను ఉపయోగించి డబ్బును పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.

Swachh Bharat Abhiyaan :

Swachh Bharat Abhiyaan :

మీ నగరం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ యాప్ ద్వారా, వారి సమస్యలకు సంబంధించిన చిత్రాలను క్లిక్ చేసి ఇందులో పోస్ట్ చేయవచ్చు లేదా మునిసిపల్ అధికారులకు పంపవచ్చు . అన్ని పట్టణ స్థానిక సంస్థలు ఈ యాప్ ను లింక్ చేయబడింది.

UMANG :

UMANG :

UMANG (Unified Mobile Application for New-age Governance) ఈ యాప్ అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్‌మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది . ఆధార్‌, డిజిలాకర్‌, పే గవర్న్‌మెంట్‌ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది.

mPassport Seva :

mPassport Seva :

ఈ యాప్ ద్వారా పాస్ పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ ను ట్రక్క్ చేయవచ్చు అలాగే దగ్గర లో ఉన్న పాస్ పోర్ట్ సేవ కేంద్రాలను తెలుసుకోవడానికి యాప్ చాలా ఉపయోగపడుతుంది.

mAadhaar :

mAadhaar :

ఆధార్ వినియోగాన్ని మరింత సులభతరం చేస్తూ యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ), సరికొత్త మొబైల్ అప్లికేషన్ ను అభివృద్ధి చేసింది. mAadhaar పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా యూజర్లు తన ఆధార్ సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ లలోనే యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. దీంతో ఫిజికల్ గా ఆధార్ కార్డును క్యారీ చేయవల్సిన అవసరం ఉండదు.

IRCTC :

IRCTC :

ప్రయాణికులు రైల్వే టికెట్ బుకింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Postinfo :

Postinfo :

ఈ Postinfo యాప్ ను డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్ డెవలప్ చేయబడింది. ఈ యాప్ ద్వారా పార్సెల్ ను ట్రాక్ చేయవచ్చు అలాగే మీకు దగ్గర లో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందొ అని సెర్చ్ చేయవచ్చు,అలాగే భీమా ప్రీమియం క్యాలిక్యులేటర్ మరియు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకోవచ్చు.

GST Rate Finder:

GST Rate Finder:

GST గురించి తెలియని వారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది .పలు ఉత్పత్తులు, సర్వీసులు వాటి సంబంధిత జీఎస్టీ రేట్లను తెలుసుకోవడం కోసం జీఎస్టీ రేటు ఫైండర్‌ యాప్‌ ఉపయోగపడుతుంది.

Best Mobiles in India

English summary
Top 10 Government of India Mobile Apps.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X