Home
Apps

ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని టాప్ 10 ప్రసిద్ధ యాప్‌లు!కానీ ఐఫోన్‌లలో స్థానం లేదు

ప్రపంచం మొత్తం మీద స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజు రోజుకి అధికమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్న వారు ఖచ్చితంగా కొన్ని రకాల యాప్ లను డౌన్‌లోడ్‌ చేసుకోవలసి ఉంటుంది. అక్టోబర్ 2021 నాటికి అధికంగా డౌన్‌లోడ్‌లు చేసుకున్న 'టాప్ యాప్స్ వరల్డ్‌వైడ్'ని సెన్సార్ టవర్ ఇటీవల విడుదల చేసింది. ఈ నెలలో అధిక డౌన్‌లోడ్‌లలో ప్రపంచవ్యాప్తంగా నాన్-గేమింగ్ యాప్‌లు టాప్ 10 ర్యాంకింగ్‌ల జాబితాలో కలిగి ఉన్నాయి.

యాప్‌లు

ఈ ర్యాంకింగ్‌లో Android మరియు iOS యాప్‌లు రెండూ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుండి కూడా ఈ డౌన్‌లోడ్‌లను కవర్ చేస్తుంది. ఈ రెండు లిస్ట్‌లలో చాలా యాప్‌లు ఒకేలా ఉండగా కొన్ని వేర్వేరుగా ఉన్నాయి. టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్‌ల లిస్ట్‌లో మిస్ అయిన ప్రముఖ iPhone యాప్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

YouTube

YouTube

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో యాప్ డౌన్‌లోడ్‌లలో YouTube యాప్ నంబర్ 2 స్థానంలో ఉంది కానీ Apple యాప్ స్టోర్ యొక్క టాప్ 10 జాబితాలో ఇది లేదు. దీని యొక్క స్థానం టాప్ 10 తరువాత ఉండడం గమనార్హం.

నేషనల్ యాంటీ ఫ్రాడ్ సెంటర్

నేషనల్ యాంటీ ఫ్రాడ్ సెంటర్

నేషనల్ యాంటీ ఫ్రాడ్ సెంటర్ అనేది మోసాన్ని గుర్తించడానికి ఉపయోగించే చైనీస్ యాంటీ-ఫ్రాడ్ యాప్. ఫోన్ కాల్‌లు, టెక్స్ట్ మెసేజ్లు లేదా సందేహాస్పద యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లతో సహా వివిధ రూపాల్లో అనుమానిత మోసపూరిత కార్యకలాపాలను వినియోగదారులకు గుర్తు చేయడానికి ఈ యాప్ ప్రత్యేకంగా రూపొందించబడింది.

CapCut

CapCut

క్యాప్‌కట్ అనేది ఉచిత ఆల్ ఇన్ వన్ వీడియో ఎడిటింగ్ యాప్. ఇది వినియోగదారులకు వీడియోలను రూపొందించడంలో సహాయపడుతుంది.

గూగుల్ మ్యాప్స్

గూగుల్ మ్యాప్స్

తెలియని ప్రదేశాలలో ఎంచుకున్న ప్రాంతానికి చేరుకోవడానికి ప్రస్తుతం ప్రతి ఒక్కరు వినియోగించడానికి ఇష్టపడే ప్రముఖ నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్ కూడా iPhoneలలో టాప్ 10లో చేరడంలో విఫలమైంది.

Taobao

Taobao

చైనీస్ షాపింగ్ యాప్ Taobao కూడా Apple App Store జాబితా నుండి టాప్ 10లో చేరడంలో విఫలమైంది. ఈ యాప్ వినియోగదారులను చైనా నుండి నేరుగా విక్రేతల నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది.

WeChat

WeChat

ప్రముఖ చైనీస్ మెసేజింగ్ మరియు సోషల్ మీడియా యాప్ WeChat కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో ఒకటి. కానీ iPhoneలలో అధిక మంది దీనిని వినియోగించడానికి ఎక్కువ ఆసక్తిని చూపడం లేదు కావున ఇది కూడా అంతగా కనిపించడం లేదు. యాదృచ్ఛికంగా అనేక ఇతర చైనీస్ యాప్‌ల మాదిరిగానే ఈ యాప్ భారతదేశంలో నిషేధించబడింది.

Best Mobiles in India

English summary
Top 10 Most Popular Apps on Android Phones! But There is no Place in iPhones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X