Just In
- 1 hr ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 3 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 6 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 23 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- News
YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Movies
సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
టాప్ బిజినెస్ పీపుల్ ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ ఇవే !
మారుతున్న ప్రపంచంలో వేగం చాలా ప్రధానమైనది. ముఖ్యంగా వ్యాపార రంగంలో వస్తున్న ట్రెండ్ ను ఫాలో కాకపోతే అంతే వెనుక బడిపోవడం ఖాయం. ముఖ్యంగా ఈ టెక్నాలజీ యుగంలో కాలం కన్నా విలువైనది లేదు. ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారం చేయడం మీదనే ఎక్కువగా తమ దృష్టిని నిలుపుతుంటారు. మరి వారికి వ్యాపారంలో సహకరించేందుకు సోషల్ మీడియాలో ఏమైనా యాప్స్ ఉన్నాయా అని తెగ వెతికేస్తుంటారు కూడా. అలాంటి వారి కోసం కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిని వ్యాపార వేత్తలు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు కూడా. అందుకే టైం వేస్ట్ కాకుండా ప్రపంచంలో మేటి వ్యాపార వేత్తలు ఉపయోగించే ఓ పది స్మార్ట్ యాప్స్ మీ కోసం.

కాంటాక్చువల్లీ :
బిజినెస్ పీపుల్ కి అత్యంత కీలకమైనవి కాంటాక్ట్స్. మరి ఆ కాంటాక్ట్స్ ను అనేవి ఇప్పుడు పలు రూపాలుగా మారిపోయాయి. కొందరు ప్రత్యక్షంగా ఫోన్ నెంబర్ల రూపంలో ఉంటే, కొందరు సోషల్ నెట్ వర్క్ రూపంలో కాంటాక్ట్ లో ఉంటున్నారు. అయితే ఈ కాంటాక్చువల్లీ అటు కాల్ లాగ్స్, ఫోన్ కాంటాక్ట్స్, కాల్స్ అండ్ ఫాలో అప్స్, మెసేజింగ్ వంటి ఆప్షన్స్ తో పాటు ఫేస్ బుక్, మెయిల్ చింప్, ట్విట్టర్, జీమెయిల్, ఔట్ లుక్ లాంటి అనేక మార్గాలను ఒకే వేదికపైకి తెచ్చే వినూత్నమైన యాప్ ఇది. ముఖ్యంగా ఎప్పుడు ఏ సమయంలో ఎవరితో మాట్లాడాలి. మెసేజ్ పెట్టాలి అనే విషయంలో ఈ యాప్ అందించే రిమైండర్స్ చాలా కీలకమైనవి.

ఫీడ్లీ :
బిజినెస్ ప్రపంచంలోని లేటెస్ట్ హాపెనింగ్స్, ఇండస్ట్రీలలో మార్పులు, వ్యాపార ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంచే యాప్ ఫీడ్లీ. ఈ యాప్ ప్రతీ ఒక్క వ్యాపారవేత్త స్మార్ట్ ఫోన్ లో ఫీడ్ చేసుకోవాల్సిన యాప్.

బిజినెస్ కార్డ్ రీడర్ :
బిజినెస్ ప్రపంచంలో పబ్లిక్ రిలేషన్స్ అనేవి అత్యంత కీలకం అందుకే ప్రతీ ఒక్కరు తమ హోదాను, పేరును విజిటింగ్ కార్డుతో పరిచయం చేసుకుంటారు. అయితే ఎక్కువ మొత్తంలో కార్డులను క్యారీ చేయడం కష్టం. అలాంటి సమయంలోనే బిజినెస్ కార్డ్ రీడర్ ఉపయోగపడుతుంది. కార్డును స్కాన్ చేసి సమాచారమంతా స్టోర్ చేసుకొని డేటాబేస్ లా పనిచేస్తుంది.

ట్రిపిట్ :
బిజినెస్ ప్రపంచంలో ట్రావెలింగ్ అనేది చాలా అవసరం. అయితే ట్రిపిట్ యాప్ ఒక రకంగా మీ ట్రావెల్ మేనేజర్, ఇందులో సమస్త ప్రయాణ సమాచారం దొరుకుతుంది. అంతేకాదు, కార్ రెంటల్స్, క్యాబ్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ రూమ్స్ ఇలా సమస్త సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.

బేస్ కాంప్ :
మీరు ఒక వేళ పలు ప్రాజెక్టులకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు అనుకుంటే అప్పుడు ఈ బేస్ కాంప్ యాప్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా వేర్వేరు ప్రాజెక్టుల వివరాలను ఒకే దగ్గర స్టోర్ చేసుకొని మానిటర్ చేయవచ్చు. ప్రాజెక్టు ఎంత వరకూ వచ్చింది లేనిది ఇట్టే కనిపెట్టవచ్చు.

ఎక్స్ పెన్సిఫై :
మీ కంపెనీ ఆర్థిక నిర్వహణపై ఓ కన్నేసి ఉంచే యాప్ ఇది. దీని ద్వారా కంపెనీలో ఉద్యోగులు దుబారాగా చేసే ఖర్చులను అరికడుతుంది. అంతేకాదు ఉద్యోగుల సమయాన్ని వేస్ట్ చేయకుండా కాపాడటమే ఈ యాప్ ఉద్దేశ్యం.
పీ క్లౌడ్ :
మీ ఫైల్స్ డేటాను భద్ర పరిచే అద్భుతం పీ క్లౌడ్, ఈ యాప్ ద్వారా ఎలాంటి హాకింగ్ సమస్య దరిచేరకుండా మీ డేటాను భద్రపరుచుకోవచ్చు. ఈ యాప్ వాడకం కూడా చాలా సులభం.
ఫ్రెష్ బుక్స్ :
ఇది వన్ టైం అకౌంటింగ్ యాప్, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు ఆడిటింగ్ చేసుకొనే వీలుంది.

ది స్ట్రీట్ :
ఇక బిజినెస్ పీపుల్ ఎక్కవగా ఇష్టపడే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే, అది ట్రేడింగ్ అనే చెప్పవచ్చు, అది ఈక్విటీ అయినా కావచ్చు. లేదా కమోడిటీస్, కరెన్సీ ఇలా ఏదైనా ట్రేడింగ్ ప్లాట్ ఫారం మీద బిజినెస్ పీపుల్ కన్నేసి ఉంచుతారు. మరి అలాంటి వారి కోసమే ది స్ట్రీట్ యాప్ ముందుకు వచ్చింది. ఈ యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ సరళిని తెలుసుకోవచ్చు.
ఉబెర్ :
ఫైనల్ గా చివరిగా ఉబెర్.. ఇది బిజినెస్ పీపుల్ కి ఎలా ఉపయోగపడుతుంది అని ఆశ్చర్య పోవచ్చు. కానీ అయితే ఉబెర్ ఇప్పుడు సరికొత్త ఆప్షన్ తో ముందుకు వచ్చింది. అదే ఉబెర్ ఫర్ బిజినెస్ ఈ ఆప్షన్ ద్వారా పలు కంపెనీలు వారి ఎంప్లాయీస్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఈ సేవలను వాడుకుంటున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470