ఈ యాప్స్‌తో ఫోన్‌లోనే సినిమాలు తీయవచ్చు!

ఒకప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది అదిపెద్ద టాస్క్. హై కాన్ఫిగరేషన్‌‌ను కలిగి ఉన్న కంప్యూటర్లలో మాత్రమే వీడియో ఎడిటింగ్ సాధ్యమయ్యేది. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. మినిమమ్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో సైతం వీడియో ఎడిటింగ్ సాధ్యమవుతోంది. బేసిక్ ఎడిటింగ్ టూల్స్‌తో అనేక యాప్స్ ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. వాటిలో 5 బెస్ట్ యాప్స్‌‌ను మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Adobe Premier Clip

అడోబ్ ప్రీమియర్ క్లిప్

అడోబ్ ప్రీమియర్ క్లిప్ యాప్ ద్వారా వీడియోలతో పాటు ఫోటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. యాప్‌లోని ఆటో-జెనరేట్ వీడియోస్ ఆప్షన్ ద్వారా ఫోటోలతోనే వీడియోలును తయారు చేసుకునే వీలుంటుంది. ట్రిమ్ ఇట్ అవుట్, ట్రాన్సిషన్స్, స్లో మోషన్ ఎఫెక్ట్స్ వంటి ప్రత్యేక ఫిల్టర్లు ఈ యాప్ లో ఉన్నాయి. 

 

Funimate Video Effects Editor

ఫన్ ఇమేట్ వీడియో ఎఫెక్ట్స్ ఎడిటర్

ఈ యాప్ 15 కంటే వీడియో ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తుంది. మీ ఫోన్‌కు అవసరమైన సింపుల్ వీడియోలతో పాటు మ్యూజిక్ వీడియోలను ఈ యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. 

Movie Maker Filmmaker

మూవీ మేకర్ ఫిల్మ్ మేకర్

ఈ యాప్‌లో వీడియో ఎడిటింగ్‌కు అవసరమైన అనేక ఫిల్టర్స్‌తో పాటు యానిమేషన్ VFX ఎఫెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లోని మోషన్ ట్రాకర్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ద్వారా ఎఫెక్ట్స్ screen మొత్తం మూవ్ అయ్యేలా చూసుకోవచ్చు. మూవింగ్ ఎఫెక్ట్స్‌కు అనేక లేయర్స్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. 

 

Video Editor

వీడియో ఎడిటర్

ఈ సింపుల్ వీడియో ఎడిటర్ యాప్ ద్వారా వీడియోలను ట్రిమ్ చేయటం, చిన్ని చిన్న వీడియోను క్లిప్స్ ను ఒకేచోట ఆర్గనైజ్ చేసుకోవటం వాటికి మ్యూజిక్ ను యాడ్ చేయటం వంటి పనులను నిర్వహించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎడిట్ చేసే వీడియోలను సోషల్ సైట్లలో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. 

 

VideoShow

వీడియోషో

ఈ యాప్ లో మీ వీడియోలకు అటాచ్ చేసుకునేందుకు 1000కు పైగా మ్యూజిక్ క్లిప్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో మీ వీడియోకు తగిన మ్యూజిక్ ఫైల్‌ను సెలక్ట్ చేసుకునే వీలుంటుంది. వాయిస్ డబ్బింగ్, డూడుల్ ఆన్ వీడియో, స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 Best film making apps that you can try on mobile. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot