చాట్‌జీపీటీ కంటే బెటర్ ఆప్షన్స్.. టాప్-5 AI చాట్‌బాట్లు మీకోసం!
ChatGPT alternatives: చాట్‌జీపీటీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న AI చాట్‌బాట్. ఓపెన్ఏఐ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. కానీ ఒక్కోసారి దీన్ని వాడేవాళ్లు ఎక్కువైపోయి సర్వర్లు బిజీగా ఉండి సరిగ్గా పనిచేయదు. అప్పుడు చిరాకొస్తుంది. అందుకే, మీకు నమ్మకమైన వేరే ఆప్షన్స్ కావాలంటే, చాలా AI చాట్‌బాట్లు ఉన్నాయి. వాటిల్లోంచి టాప్ 5 ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని ఫ్రీగా వాడేసుకోవచ్చు, కొన్నిటికి మాత్రం డబ్బులు కట్టాలి.
* గూగుల్ జెమిని - క్రియేటివిటీకి, రీసెర్చ్‌లకి ఇది బెస్ట్
గూగుల్ జెమిని అనేది చాలా పవర్‌ఫుల్ AI చాట్‌బాట్. దీనికి క్రియేటివ్‌గా ఆలోచించే సామర్థ్యం ఎక్కువుంది. బొమ్మలు కూడా గీయగలదు, అది కూడా మామూలుగా కాదు, ఇమాజెన్ 3 అనే లేటెస్ట్ టెక్నాలజీతో చిత్రాలు రూపొందించి ఇస్తుంది. అంతేకాదు, PDF లు, డాక్యుమెంట్లు, బొమ్మలు ఇలాంటివి ఏవైనా సరే అప్‌లోడ్ చేసుకోవచ్చు.

గూగుల్ సెర్చ్‌తో లింక్ అయి ఉండటం వల్ల, కావాల్సిన తాజా సమాచారం ఇట్టే దొరికేస్తుంది. యూట్యూబ్ వీడియోలు, గూగుల్ డాక్స్, గూగుల్ డ్రైవ్ ఫైల్స్‌తో కూడా మాట్లాడొచ్చు. జెమిని 2.0 ఫ్లాష్, జెమిని-ఎక్స్‌పి-1206 మోడల్స్‌తో ఇది పనిచేస్తుంది. రీసెర్చ్ చేయాలన్నా, ఏదైనా రాయాలన్నా ఇది మీకు ఉపయోగపడుతుంది.
* గ్రోక్ 3 - కోడింగ్, కష్టమైన లాజిక్‌లకి ఇది ఉత్తమం
గ్రోక్ 3 చాట్‌బాట్ కోడింగ్ రాయడానికి, మ్యాథ్స్ లెక్కలు చేయడానికి, లాజికల్‌గా ఆలోచించడానికి, సైన్స్ విషయాలు తెలుసుకోవడానికి బాగా పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది చాలా డీప్‌గా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. డీప్‌సెర్చ్ AI ఏజెంట్ అనే ఫీచర్ దీనికి ఉంది. దీనివల్ల కష్టమైన ప్రశ్నలు అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేస్తుంది.
ఇందులో కూడా ఫైల్స్, డాక్యుమెంట్లు, బొమ్మలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఉచితం. డబ్బులు పెట్టకుండా శక్తివంతమైన AI కావాలంటే ఇది మంచి ఆప్షన్. కానీ ఒక్కోసారి బొమ్మలు గీసేటప్పుడు సేఫ్టీ రూల్స్ అంతగా పాటించకపోవచ్చు. ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలంటే, నెలకు 40 డాలర్లు కట్టి ప్లాన్ తీసుకోవచ్చు.
* డీప్‌సీక్ - ఫ్రీ
డీప్‌సీక్ చాట్‌బాట్ డీప్‌సీక్ R1 మోడల్‌తో పనిచేస్తుంది. ఇది దాదాపు చాట్‌జీపీటీ 4o లాంటిదే. సైన్స్, కోడింగ్, మ్యాథ్స్, లాజిక్ ఇలాంటి కష్టమైన సమస్యలు సాల్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మిగతా AI మోడల్స్‌లా కాకుండా, డీప్‌సీక్ మాత్రం పూర్తిగా ఫ్రీ. వెబ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, బొమ్మలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయొచ్చు.
కానీ ఇందులో కోడ్ ఇంటర్‌ప్రెటర్, వాయిస్ మోడ్, మల్టీమోడల్ ఫీచర్స్ లాంటివి లేవు. కొందరికి ప్రైవసీ గురించి కూడా డౌట్స్ ఉండొచ్చు. అందుకే వ్యక్తిగత వివరాలను ఇందులో ఎంటర్ చేయకూడదు. అలాగే వాయిస్ మోడ్ కోసం వేరే యాప్స్ వాడటం మంచిది.
* మైక్రోసాఫ్ట్ కోపైలట్ - మీ పర్సనల్ AI అసిస్టెంట్!
మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా ఓపెన్ఏఐ GPT-4o మోడల్‌తోనే పనిచేస్తుంది. కోపైలట్ వాయిస్ అనే ఫీచర్ ఉంది, దీంతో వాయిస్‌తో కూడా మాట్లాడొచ్చు. కోపైలట్ విజన్‌తో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు. "థింక్ డీపర్" టూల్ ద్వారా కష్టమైన ప్రశ్నలు అడగొచ్చు. కోపైలట్ డైలీ ద్వారా రోజువారీ న్యూస్ అప్‌డేట్స్ కూడా ఇస్తుంది.
బింగ్‌తో లింక్ అయి ఉండటం వల్ల తాజా సమాచారం వెంటనే దొరుకుతుంది. బొమ్మలు గీయొచ్చు, బొమ్మల్ని అనలైజ్ చేయొచ్చు కానీ ఫైల్స్ మాత్రం అప్‌లోడ్ చేయడానికి లేదు. GPT-4o ఫ్రీగా వాడొచ్చు కానీ, కోపైలట్ ప్రో ప్లాన్ కావాలంటే నెలకు 20 డాలర్లు కట్టాలి.
* హగ్గింగ్‌చాట్ - చాట్‌జీపీటీ లాంటి ఓపెన్-సోర్స్ AI
హగ్గింగ్‌చాట్‌లో చాలా ఓపెన్-సోర్స్ AI మోడల్స్ ఉన్నాయి. లామా 3.3 70B, క్వెన్ 2.5, కోహెర్, హెర్మెస్ ఇలా చాలా రకాలున్నాయి. మీకు కావాల్సిన తాజా సమాచారం ఇస్తుంది. ఇది కూడా పూర్తిగా ఉచితం. చాలా ఫాస్ట్‌గా, వెంటనే ప్రతిస్పందిస్తుంది. మీకు ఏ మోడల్ కావాలంటే అది వాడుకోవచ్చు. కానీ ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు.


Click it and Unblock the Notifications








