వావ్ అనిపించేలా వాట్సాప్ కొత్త ఫీచర్లు

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం ఈ మధ్య ఐదు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ నేపధ్యంలో వచ్చిన ఐదు ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

 

Swipe to Reply

Swipe to Reply

ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలంటే దానిపై లాంగ్ ప్రెస్ చేసి ప‌ట్టుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇక‌పై అలా కాదు. రిప్లై ఇవ్వాల‌నుకున్న మెసేజ్‌పై కుడి వైపున‌కు స్వైప్ చేస్తే చాలు. వెంట‌నే మ‌నం కావాల‌నుకున్న మెసేజ్‌కు రిప్లై ఇవ్వ‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ఐఫోన్ లో వాట్సాప్ ను వాడుతున్న యూజ‌ర్ల‌కు ఇప్ప‌టికే అందుబాటులో ఉండ‌గా, ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్‌పై వాట్సాప్ బీటా వెర్ష‌న్‌ను వాడుతున్న వారికి అందుబాటులోకి వ‌చ్చింది. త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ ఈ Swipe to Reply ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

Picture in Picture Mode
 

Picture in Picture Mode

సుదీర్ఘకాలంగా Android Beta వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉన్న పిక్చర్ ఇన్ పిక్చర్ సదుపాయం తాజాగా వాట్సప్ ఫైనల్ వెర్షన్ వాడుతున్న వారికి ప్రవేశపెట్టబడింది. ఆండ్రాయిడ్ 4.4 తర్వాతి వెర్షన్లు వాడుతున్న వారికి ఇది లభిస్తుంది.ఈ సదుపాయం ద్వారా మీకు ఎవరైనా యూట్యూబ్ వీడియోలు పంపినప్పుడు వాటిని ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేయాల్సిన పనిలేకుండా ఒకపక్క చాట్ కన్వర్జేషన్ చేస్తుంది మరోపక్క చిన్న విండోలో వీడియోలను ప్లే చేసుకోవటానికి సాధ్యపడుతుంది.అయితే ఇక్కడ ఒక చిన్న అసౌకర్యం ఉంది. మీకు ఏ కాంటాక్ట్ నుండైతే వీడియో షేర్ చేయబడిందో ఆ ఛాట్ కన్వర్‌జేషన్‌లో ఉన్నంత సేపు మాత్రమే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌లో వీడియో చిన్నదిగా ప్లే అవుతుంది. ఒకవేళ మీరు బయటకు వచ్చి వేరే చాట్ విండోలోకి వెళ్ళినట్లయితే దాంతో ఆ వీడియో ప్లే అవ్వటం నిలిచిపోతుంది. అయితే Apple iOSలో ఇలాంటి ఇబ్బంది ఉండదు.కొంతమంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు వాట్సప్ తాజా వెర్షన్ వాడుతున్నప్పటికీ ఈ ఫీచర్ లభించడం లేదు. అలాంటప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న వాట్సాప్ చాట్ బ్యాక్ అప్ తీసుకుని ఆ తర్వాత దాన్ని తొలగించి తాజాగా మళ్లీ ఇన్స్టాల్ చేస్తే సమస్య తొలగిపోతుంది.

Ads for Status

Ads for Status

వాట్సప్ లోనూ ఇకపై యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. కానీ ఇవి కేవలం మీరు అప్ డేట్ చేసే వాట్సాప్‌ ‘స్టేటస్‌'లో కనిపించనున్నాయి. వీటిని మొదటగా ఐవోఎస్‌ మొబైల్స్ లో ప్రయోగించనున్నారు. ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌తో అసోసియేట్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్‌ను బట్టి ఈ యాడ్స్‌ను పొస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఫేస్‌బుక్ తన వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను యాడ్ బేసిడ్ ఫార్మాట్‌లోకి తీసుకువచ్చేందుకు ఆగష్టు నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ స్టేటస్‌లలో పోస్ట్ అయ్యే యాడ్స్‌ను ఫేస్‌బుక్ అడ్వర్టైజింగ్ సిస్టం మానిటర్ చేస్తుంది .

Stickers For Whatsapp

Stickers For Whatsapp

ఇక వాట్సాప్ బీటా వెర్ష‌న్‌లో కొత్త‌గా వ‌చ్చిన మ‌రో ఫీచ‌ర్ Stickers download. వాట్సాప్ యూజ‌ర్లు థ‌ర్డ్‌పార్టీ యాప్స్ నుంచి కూడా స్టిక్క‌ర్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Inline Image Notification

Inline Image Notification

నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్‌లైన్‌ ఇమేజ్‌ స్టయిల్‌ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సప్‌కు మెసేజ్‌ వచ్చినట్టు నోటిఫికేషన్‌లో ఇమేజ్‌ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకుముందు కూడా వాట్సప్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌లైన్‌ ఇమేజస్‌ను వాడింది. కానీ తాజాగా కొత్త మెసేజింగ్‌స్టయిల్‌ నోటిఫికేషన్‌ ఫార్మాట్‌లో దీన్ని తీసుకొస్తోంది.అయితే ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ 9 పై డివైజ్‌లకు మాత్రమే పనిచేయనుంది.నోటిఫికేషన్‌ల కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ జీఐఎఫ్‌లకు, వీడియోలకు పనిచేయదు. కేవలం చిన్న ఐకాన్‌ మాత్రమే ఇమేజ్‌ రూపంలో వస్తుంది. కేవలం ఆండ్రాయిడ్‌ పైలకు మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
Top 5 New and Upcoming Features on WhatsApp: Swipe to Reply, Ads for Status and More.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X