ఈ ఏడాది వాట్సాప్ విడుదల చేసిన 5 బెస్ట్ ఫీచర్లు ఏంటో చూడండి
ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లను యూజర్లను కట్టిపడేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లను యూజర్లను కట్టిపడేస్తోంది.ఫేస్‌బుక్ సొంతమైన ఈ యాప్ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఉండి తీరాల్సిందే. కాగా ఈ ఏడాది వాట్సాప్ 5 బెస్ట్ ఫీచర్లను విడుదల చేసింది.మరి ఆ ఫీచర్లు ఏంటి వాటితో ఉపయోగాలు ఏంటి ఓ స్మార్ట్ లుక్కేయండి.

WhatsApp Stickers
వాట్సాప్‌లో యాడ్ అయిన స్టిక్కర్స్‌లో చాలా వరకు స్టిక్కర్స్ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఉన్నవే కావటం విశేషం. వాట్సాప్‌ను ఉద్దేశించి ఎవరైనా సరే థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయవచ్చు. వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్లు ముందుగా తమ డివైస్‌లోని యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. యాప్ అప్‌డేట్ అయిన వెంటనే చాట్ విండోలో స్టిక్కర్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ పై టాప్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న అనేక స్టిక్కర్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

Swipe to Reply
ఇప్పటి వరకు వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లకు రిైప్లె ఇవ్వాలంటే ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి రిైప్లె ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా వాట్సప్‌లో స్వైప్ టు రిైప్లె ఫీచర్ అందుబాటులోకి వచ్చింది . దీని వల్ల మెసేజ్‌పై కుడివైపుకు స్వైప్ చేస్తే చాలు సులభంగా ఆ మెసేజ్‌కు రిైప్లె పంపుకోవచ్చు.

Picture-in-Picture Mode
ఇప్పటివరకు మీకు వాట్సప్‌లో వచ్చిన వీడియో లింక్స్ క్లిక్ చేస్తే వేరే విండోలో ప్లే అయ్యేవి. ఇకపై మరో యాప్‌కి రీడైరెక్ట్ కాకుండా వాట్సప్‌లోనే ఆ వీడియోలు ప్లే అవుతాయి. థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్‌బుక్, టంబ్లర్ లాంటి వీడియో లింక్స్ అన్నీ ఇక వాట్సప్‌లో ప్లే చేసుకోవచ్చు. మొదట హాఫ్ విండోలో ఓపెన్ అయ్యే వీడియోను ఫుల్ స్క్రీన్‌లోనూ చూడొచ్చు.

Mute Notifications
మీరు అనేక వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్నారా అయితే ఈ ఫీచర్ ద్వారా మీకు గ్రూప్స్ లో లో మ్యూట్ పెట్టేసుకోవచ్చు.ఈ మ్యూట్ నోటిఫికేషన్లు 8 గంటలు, 1 వారం లేదా 1 సంవత్సరానికి పెట్టుకోవచ్చు.

Request Account Info
ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా కొత్తగా మిమ్మల్ని గ్రూప్ యాడ్ చేయాలి అనుకుంటే మీ పర్మిషన్ లేకుండా చేయలేరు.ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే ముందుగా సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అనంతరం అకౌంట్ సెట్టింగ్స్, అండ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లి ఒక రిక్వెస్ట్ రిపోర్ట్ చేయండి. అప్పుడు మూడు రోజుల అనంతరం ఒక రిపోర్ట్ వస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిని తిరిగి రివోక్ కూడా చేసుకునే అవకాశాన్ని కూడా వాట్సాప్ కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications








