Home
Apps

వాట్సాప్‌లో ఇటీవల వచ్చిన టాప్‌ 6 ఫీచర్‌లు.. మీకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి..!

ప్రపంచంలోనే ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ తన యూజర్ల భద్రత, సౌకర్యం కోసం అనేక కీలక ఫీచర్‌లను విడుదల చేస్తోంది. దీంతోపాటు మరిన్ని ఫీచర్‌లను టెస్టింగ్‌ చేస్తోంది. ప్రత్యేకంగా ఇటీవల యూజర్లకు ఎంతో ఉపయోగపడే ఫీచర్‌ను విడుదల చేయనుంది. ఇందులో మెటా AI వాయిస్‌ మోడ్‌, డిఫాల్ట్‌ థీమ్‌, స్టేటస్‌ అప్‌డేట్‌ రియాక్షన్‌, పిన్‌ వెరిఫికేషన్‌, బ్యాగ్రౌండ్‌ ఎఫెక్ట్‌ మరియు ఫిల్టర్స్‌, మెన్షన్‌ వంటి అనేక ఫీచర్‌లను ఇటీవల ప్రస్తావించింది. ఇందులో కొన్ని ఫీచర్‌లు యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

వాట్సాప్‌ స్టేటస్ మె‌న్షన్‌ : ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో (Whatsapp Status Mention) అందుబాటులో ఉంది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్‌ చేసినప్పుడు మనకు నచ్చిన వ్యక్తులు లేదా స్టోరీకి సంబంధించిన వ్యక్తులను ట్యా్గ్‌ చేస్తాం. ఫలితంగా వారికి మన స్టోరీ వివరాలు నోటిఫికేషన్‌ రూపంలో అందుతాయి. ఇదే తరహా ఫీచర్‌ వాట్సాప్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Top 6 New and Upcoming Whatsapp feature

దీనిపై వాట్సాప్ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo వివరాలు వెల్లడించింది. వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.24.20.3 లో ఈ ఫీచర్‌ను గుర్తించినట్లు పేర్కొంది. వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికి స్టేటస్‌ పోస్ట్‌లో మెన్షన్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌ దశలో ఉంది.

వాట్సాప్‌ ఫిల్టర్స్, బ్యాగ్రౌండ్‌ : ఇటీవలే ఈ ఫీచర్‌ను యూజర్లకు (Whatsapp Filters and Background) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ వీడియో కాల్‌ మరింత ఉల్లాసభరితమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుందని మెటా తెలిపింది. కూల్‌, వార్మ్‌, వైట్‌ మరియు బ్లాక్‌, ప్రిజం లైట్‌, వింటేజ్‌ టీవీ, లైట్‌, డ్రీమీ, ప్రొస్టెడ్‌ గ్లాస్‌, డ్యూయో టోన్‌ వంటి 10 ఫిల్టర్‌లు అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్‌ వీడియో కాల్ సమయంలో బ్యాగ్రౌండ్‌ థీమ్‌ను మార్చుకోవచ్చు. లివింగ్ రూం, ఆఫీస్‌, సన్‌సెట్‌, బీచ్‌, కేఫ్‌ వంటి సుమారు 10 బ్యాగ్రౌండ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్‌ ద్వారా మరో ఉపయోగం కూడా ఉంది. మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో ఇతరులు తెలుసుకొనే అవకాశం లేదు. ఈ ఫీచర్‌ విడుదల ఇప్పటికే ప్రారంభం కాగా.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

స్టేటస్‌ అప్‌డేట్‌ రియాక్షన్‌ : ఈ ఫీచర్‌ (Whatsapp Status Reaction) అందుబాటులోకి వచ్చాక.. వాట్సాప్‌ స్టేటస్‌ వద్ద హార్ట్ రియాక్షన్‌ను గుర్తించవచ్చు. దానితో సింగిల్‌ క్లిక్‌తో వాట్సాప్‌ స్టేటస్‌ పై స్పందించవచ్చు. దీంతో సదరు యూజర్‌కు మీరు స్టేటస్‌ను లైక్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

పిన్‌ వెరిఫికేషన్‌ : వాట్సాప్‌లో అనవసర సంభాషణలకు చెక్ పెట్టేందుకు ఈ ఫీచర్‌ను (Whatsapp PIN Verification)అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం పిన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక.. 4 అంకెల పిన్‌కోడ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్‌ లేదా తెలియని నంబర్‌ల నుంచి వచ్చే మెసెజ్‌లను ఈ ఫీచర్‌ నియంత్రిస్తుంది.

ఈ పిన్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌ దశలో ఉంది. వాట్సాప్‌ పిన్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక.. కొత్త యూజర్‌ మీకు మెసెజ్‌ చేసేందుకు ఆ 4 అంకెల పిన్‌ కోడ్‌ ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఫీచర్‌ యూజర్లకు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో వాట్సాప్‌ వెల్లడించలేదు.

వాయిస్‌ చాట్‌ మోడ్‌ మెటా AI : యూజర్ల కోసం గతంలో మెటా సంస్థ Meta AI ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లామా3 ద్వారా LLM ఆధారిత అసిస్టెంట్‌తో పనిచేస్తుంది. ప్రస్తుతం Meta AI వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. గత నెలలోనే ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో కనిపించింది. వాయిస్‌ ద్వారా మెటా ఏఐను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి text ఆధారంగా మాత్రమే మెటా ఏఐని వినియోగిస్తున్నాం.

వాట్సాప్‌ థీమ్‌ చాట్‌ : ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ యూజర్లు (Whatsapp Theme Chat) అనేక రకాల థీమ్స్‌ను చాట్‌కు జోడించవచ్చు. వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చిన రంగులతో చాట్‌పేజీని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. దీనిపై వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo పేర్కొంది. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Top 6 New and Upcoming Whatsapp features in india you must know in October 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X