వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసే బెస్ట్ యాప్స్ మీకోసం

మారుతున్న కాలం మరియు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిరంతరం వాతావరణ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి ప్రజలకు.

|

మారుతున్న కాలం మరియు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిరంతరం వాతావరణ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి ప్రజలకు. ఒకప్పుడు రేడియో, తర్వాత టీవీ వరకు పరిమితమైన వాతావరణ వివరాలు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు తెలుసుకునేలా మొబైల్ ఫోన్లు తయారయ్యాయి. ఇంటర్నెట్, GPS సర్వీసు ఉన్న మొబైల్ ఉంటేచాలు, ఉన్నచోటు నుండే ప్రపంచంలో ఎక్కడి వాతావరణ పరిస్థితులనైనా తెలుసుకునే వెసులుబాటు ఉంది. వీటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన అప్లికేషన్లు , విడ్జెట్లు గురించి పొందుపరుస్తున్నాము.

ఐడియా దూకుడు,రూ. 2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్, పేమెంట్ బ్యాంకు షురూ..ఐడియా దూకుడు,రూ. 2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్, పేమెంట్ బ్యాంకు షురూ..

The weather Channel:

The weather Channel:

అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ weather application ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు ఇవ్వడంతో పాటు 36 గంటలనుండి 10 రోజుల వాతావరణ వివరాలను చూపెడుతుంది. weather maps ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. రాడార్ సహకారంతో బ్రేకింగ్ న్యూస్, lightening, rain, hurricane అలర్ట్స్ ను నోటిఫికేషన్ బార్ లో సమయానుసారం చూపెడుతుంది. sunrise, SunSet, wind speed, humidity, UVIndex, visibility వివరాలను కూడా అందిస్తుంది.

ఈ అప్లికేషన్ ను https://play.google.com/store/apps/details?id=com.weather.Weather లింకు ద్వారా పొందవచ్చు.

 

 

ACCUweather:

ACCUweather:

ఎక్కువమంది వినియోగదారులను కలిగి ఉన్న జాబితాలో ఇది ఒకటి. ఇందులో MinuteCast ఫీచర్ చెప్పుకోదగినది. ప్రయాణసమయాల్లో ప్రతినిమిషం 2గంటల వరకు మీరు ఉన్న పరిసరాలను అనుసరించి వాతావరణ వివరాలను అలర్ట్స్ రూపంలో అందించడంలో సహాయం చేస్తుంది. weatherMapsను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రియల్ టైం వివరాలను ఇవ్వడం దీని ప్రత్యేకత. రాడార్ వివరాలను ఆనిమేషన్ ప్రక్రియలో చూపుతూ తుఫానుల సమయంలో ప్రజలను అప్రమత్తం చెయ్యడంలో సహాయం చేస్తుంది.33 భాషలను సపోర్ట్ చేస్తుంది. దీనికారణంగా కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందింది అని చెప్పవచ్చు.
ఈ అప్లికేషన్ ను https://play.google.com/store/apps/details?id=com.accuweather.android లింకు ద్వారా పొందవచ్చు.

 Today weather :

Today weather :

అందమైన ఇంటర్ఫేస్ తో వాతావరణ వివరాలను అందిస్తూ ఈమధ్యకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన weather అప్లికేషన్ ఇది. నచ్చిన ప్రదేశాలను యాడ్ చేసుకోవడం ద్వారా ఆయా ప్రదేశాలలోని వాతావరణ పరిస్థితులను తెలియజేస్తుంది. 24గంటల వాతావరణ వివరాలను, SunRise, SunSet, humidity, pressure వివరాలను రియల్ టైం యానిమేషన్ లో అందిస్తుంది. ఈ అప్లికేషన్ విడ్జెట్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ అప్లికేషన్ ను https://play.google.com/store/apps/details?id=mobi.lockdown.weather లింకు ద్వారా పొందవచ్చు.

YahooWeather:

YahooWeather:

ఆండ్రాయిడ్ వినియోగదారులకు పరిచయం అవసరం లేని weather అప్లికేషన్ అని చెప్పవచ్చు. wind, pressure, rain, snow వివరాలతో పాటు sunrise,sunset, పీడన వివరాలు సైతం యానిమేషన్ తో చూపెట్టడం వలన ప్రజల ఆదరణకు నోచుకుంది. మనకు నచ్చిన ప్రదేశాలను ఫేవరెట్స్ గా ఉంచడం ద్వారా ఎప్పటికప్పుడు ఆయా ప్రదేశాలలోని వివరాలను తెలుసుకునే వీలు ఉంది. దీని విడ్జెట్స్ చాలా అందంగా డిజైన్ చెయ్యబడి ఉంటాయి.

దీనిని https://play.google.com/store/apps/details?id=com.yahoo.mobile.client.android.weather లింకు ద్వారా పొందవచ్చు.

WeatherTimelineForecast:

WeatherTimelineForecast:

ఈ అప్లికేషన్ 85రూపాయలకు ప్లేస్టోర్లో లభ్యమవుతుంది. సింపుల్ ఇంటర్ఫేస్ తో మెమరీ తక్కువ తీసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ అప్లికేషన్ మరికొన్ని weather ప్రొవైడర్స్ నుండి సమాచారాన్ని సేకరించి రియల్ టైం సమాచారాన్ని అలర్ట్స్ రూపంలో తెలియజేస్తుంది. తోచిన థీం ను సెట్ చేసుకునే వెసులుబాటుతో సహా ఇతర భాషలను, ఆండ్రాయిడ్ వేర్ డివైజులను సపోర్ట్ చేసే విధంగా దీనిని రూపొందించారు.
దీనిని https://play.google.com/store/apps/details?id=com.samruston.weather ఈలింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

WeatherUnderground :

WeatherUnderground :

ఇది ప్రస్తుతం ఎడిటర్స్ చాయిస్ గా కూడా ఉంది. National weather serviceRadioని అందించే అప్లికేషన్స్ లో చెప్పుకోదగినది. వాతావరణ వివరాలు అన్నిటిని ఒకే అప్లికేషన్ లో పొందాలి అనుకునేవారికి ఇది ఏంతో ఉపయుక్తం గా ఉంటుంది. ఎంచుకున్న ప్రదేశాల వాతావరణ వివరాలు,weatherMaps,రియల్ టైం సమాచారంతో పాటు పదిరోజుల వాతావరణ పరిస్థితులను చూపెడుతుంది.
దీనిని https://play.google.com/store/apps/details?id=com.wunderground.android.weather లింక్ ద్వారా పొందవచ్చు.

 

 

వీటితోపాటు

వీటితోపాటు

వీటితోపాటు WeatherBug, Morecast, Darksky వంటి ప్రాచుర్యంపొందిన అప్లికేషన్లు ప్లేస్టోర్లో లభ్యమవుతున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Here write TOP best weather applications and widgets. more news check in Gizbot telugu.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X