గేమింగ్ ప్రియులను కట్టిపడేస్తున్న టాప్ టెన్ గేమ్స్
టెక్నాలజీ గెయింట్ దిగ్గజం ఆపిల్ ఎప్పుడూ తన వినియోగదారుల కోసం కొత్త కొత్తగా గేమ్స్ ని ప్రవేశపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
టెక్నాలజీ గెయింట్ దిగ్గజం ఆపిల్ ఎప్పుడూ తన వినియోగదారుల కోసం కొత్త కొత్తగా గేమ్స్ ని ప్రవేశపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్లో గేమింగ్ పై ఆసక్తి ఉన్న యూజర్ల కోసం దాదాపు 8 లక్షల గేమ్ లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ కంపెనీ ప్రతి వారం కొన్ని కొత్త గేమ్స్ ని అందులో పెడుతూనే ఉంటుంది.యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించేందుకు గేమ్స్ లో అధునాతన మార్పులు చేసి ఆపిల్ స్టోర్ లోకి తీసుకొస్తోంది. ఈ శీర్షికలో భాగంగా గత వారం ఆపిల్ ప్రవేశపెట్టిన టాప్ టెన్ గేమ్స్ ని ఇవ్వడం జరుగుతోంది. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Pokemon Go
ఈ గేమ్ ప్రపంచాన్ని ఓ ఊపు ఉపిన సంగతి అందరికీ తెలిసిందే. దీని మీద ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఈ గేమ్ మీద ఆదరణ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు ఈ గేమ్ ఆడేవారి సంఖ్య పెరగిపోతుందే కాని తగ్గడం లేదు. ట్రావెల్ చేస్తూ పోకెమాన్ లను పట్టుకోవడం ఈ గేమ్ ప్రత్యేకత.

Candy Crush Saga
ఈ గేమ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరి మొబైల్ లో ఈ గేమ్ ఉండి తీరాల్సిందే. పజిల్స్ ని పూర్తి చేయడమే ఈ గేమ్ ప్రత్యేకత. ఈ గేమ్ ద్వారా మెదడు చురుకుగా పనిచేసే అవకాశం ఉంది.

Temple Run
ఎండ్ అంటూ లేని గేమ్ ఏదైనా ఉందంటే అది ఈ గేమ్ మాత్రమే. ఈ గేమ్ లోకి ఎంటరయితే పరిగెడుతతూనే ఉండాలి.

Temple Run 2
పై నున్న గేమ్ కి మరో వర్షన్ గా ఈ గేమ్ ని తీసుకువచ్చారు. ఇది కూడా పరిగెడుతూనే ఉండాలి. ఏ మాత్రం ఆపినా గేమ్ ఫెయిల్ అయిపోతుంది.

8 Ball Pool
మినిక్తిప్ కంపెనీ డెవలప్ చేసిన ఈ గేమ్ అత్యంత ప్రజాదరణ పొందిన గేమింగ్ లో ఒకటిగా నిలిచింది. కేవలం మొబైల్ ఫ్లాట్ ఫాం మీద మాత్రమే ఇది రన్ అవుతుంది.

Super Mario Run
Nintendo's నుంచి వచ్చిన మోస్ట్ పాపులర్ గేమ్స్ లో ఈ గేమ్ ఒకటి. మొబైల్ ఫ్లాట్ ఫాం మీద పాత వర్షన్ గేమ్ మాదిరిగానే ఇది అందుబాటులో ఉంటుంది. వన్ ఫింగర్ ప్రింట్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఆడే గేమ్ ఇది.

Clash of Clans
మొత్తం ఫ్యామిలి ఆడుకోదగ్గ గేమ్ ఇది. కింగ్ డమ్ తో మొదలయ్యే ఈ గేమ్ లో ఆటగాళ్లు అనేక రకాలైన కింగ్ డమ్ లను నిర్మిస్తూ ముందుకెళ్లాలి.

Trivia Check
ఇదొక పజిల్ గేమ్. అనేక రకాలై ప్రశ్నలు మీకు అందులో కనిపిస్తుంటాయి. వాటికి సమాధాన మిస్తూ ముందుకెళ్లాలి.మొత్తం ఆరు రకాల కేటగిరీలు ఇందులో ఉంటాయి.

Solitaire
కార్డు గేమ్ మీద ఆసక్తి ఉన్నవారికి ఇదొక అందమైన గేమ్.

Fruit Ninja
ఫ్రూట్లను కట్ చేస్తూ సాగే గేమ్ ఇది. ఇందులో అనేక రకాలైన అప్ డేట్లను పొందుపరిచారు. చాలా సరదాగా ఈ గేమ్ సాగిపోతూ ఉంటుంది.


Click it and Unblock the Notifications