మొబైల్ వాలెట్ సేవలను ప్రారంభించిన True Balance
జీవనశైలి (లైఫ్‌స్టైల్) విభాగానికిగాను అత్యుత్తమ సర్వీసులను అందిస్తోన్న ఆండ్రాయిడ్ యాప్‌లలో 'ట్రు బ్యాలన్స్’ (True Balance) ఒకటి. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ఈ మొబైల్ బ్యాలన్స్ చెకింగ్ యాప్ తాజాగా మొబైల్ వాలెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

మొబైల్ వాలెట్ సేవలను నిర్వహించుకునేందుకుగాను ట్రు బ్యాలన్స్ సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొద్ది నెలల ముందే అనుమతి లభించింది.
నెక్స్ట్ జనరేషన్ పేమెంట్ ఫీచర్ సిస్టంతో లాంచ్ అయిన ఈ వాలట్ ఫీచర్ ద్వారా ట్రు బ్యాలన్స్ యూజర్లు తమ వాలెట్‌లోకి నగదును యాడ్ చేసుకోవటంతో పాటు ఆ నగదుతో వేగవంతమైన రీఛార్జులతో పాటు పీర్ టు పీర్ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ను నిర్వహించుకోవచ్చు.
ప్రీపెయిడ్ యూజర్లకు మొబైల్ మేనేజ్‌మెంట్ సర్వీసులను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ట్రు-బ్యాలన్స్ యాప్‌ను ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫోన్ బిల్స్, డేటా వినియోగం, మొబైల్ బ్యాలన్స్, తదుపరి రీఛార్జ్ తేదీ వంటి వివరాలను ఈ యాప్ అందిస్తోంది.
ట్రు-బ్యాలన్స్ అప్లికేషన్‌లోని 'వన్ క్లిక్ - రీఛార్జ్’ ఫీచర్ ద్వారా ఒక్క క్లిక్‌తో మొబైల్ నెంబర్‌లను రీఛార్జ్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన మొబైల్ వాలెట్ యాప్ ద్వారా యూజర్లు తమ వాలెట్‌లోకి సులువుగా నగదును డిపాజిట్ చేసుకుని ఫోన్ రీఛార్జెస్ నిర్వహించుకునే వీలుంటుంది.


Click it and Unblock the Notifications








