సరికొత్త హంగులతో ట్రూకాలర్!

By: Madhavi Lagishetty

ట్రూకాలర్...స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఒక పాపులర్ కాలర్ ఐడి యాప్. ట్రూకాలర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ రెండు కొత్త ఫీచర్స్ ను యాడ్ చేసింది. రెండు అడిషన్స్ ..ఒక నెంబర్ స్కానర్ మరియు ఫాస్ట్ ట్రాక్ నెంబర్స్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫీచర్లను ఆండ్రాయిడ్ 8.45లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

సరికొత్త హంగులతో ట్రూకాలర్!

గుర్తుతెలియని కాల్స్ గుర్తించడం నుంచి...స్పామ్ కాల్స్, స్పామ్ ఎస్ఎంఎస్ లను నిరోధించడంలో ట్రూకాలర్ యూజర్స్ కు మరింత సహాయం చేస్తుంది. అందువల్ల మొట్టమొదటి ఫీచర్, నంబర్ స్కానర్ వినియోగదారు ఫోన్ కార్డు ద్వారా బిజినెస్ కార్డులు, వెబ్ సైట్లు, స్ట్రీట్ సంకేతాలు, షాప్ ఫ్రంట్స్ నుంచి నేరుగా ఒక నెంబర్ ను స్కాన్ చేయడానికి అనుమతి ఇస్తుంది.

ఇండియాలో ఉన్న వినియోగదారులు ఒక నెంబర్ ను స్కాన్ చేయగలరు మరియు upiచెల్లింపులతో పాటు దానిని ఉపయోగించగలరు. ట్రూకాలర్ వినియోగదారులు కూడా వారి కాంటాక్ట్స్ నుంచి ఏవైనా రిక్వెస్ట్ మనీ, రీఛార్జ్ లేదా ఫ్లాష్ మెసేజ్ పంపవచ్చు లేదా కాంటాక్ట్ చేయవచ్చు.

వాట్సాప్‌లో పొరపాటుగా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు

మీరు ఒక ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్ ను చూసినప్పుడు, నేరుగా దాన్ని మీ ఫోన్లో ట్రూకాలర్ తో సెకన్లలో కనెక్ట్ చేయవచ్చని ట్రూసెల్లర్ ప్రొడక్ట్ మరియు ఇంజనీరింగ్ డైరెక్టర్ నారాయణ్ బాబు తెలిపారు.

న్యూ ఫాస్ట్ ట్రాక్ నెంబర్స్ ఫీచర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ మరియు అవసరమైన కేంద్రాలకు నేరుగా యాప్ కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ ను కలిపిస్తుంది. అంతేకాదు ఈ ఫీచర్ స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యాక్సిస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆఫ్ లైన్ ఉపయోగం కోసం, కాంటాక్ట్ ట్యాబ్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ నెంబర్స్ కూడా సేవ్ చేస్తుంది.

ఈ ఫీచర్స్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Read more about:
English summary
Truecaller, which is a popular caller-ID app among smartphone users is adding two new features to its Android version.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot