గూగుల్‌తో ట్రూకాలర్ ఒప్పందం..యూజర్లకు వీడియో కాలింగ్!

Posted By: Madhavi Lagishetty

లీడిండ్ కమ్యూనికేషన్ యాప్ ట్రూకాలర్..వీడియో కాలింగ్ కోసం గూగుల్ డ్యుయోను అనుసంధానం చేసుకుంది. దీంతో యూజర్లు డైరెక్ట్‌‌గా ట్రూకాలర్ నుంచి వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయం లభించింది.

గూగుల్ తో ట్రూకాలర్ ఒప్పందం..యూజర్లకు వీడియో కాలింగ్!

ఈ కొత్త ఫీచర్ ద్వారా 250 మిలియన్ల యూజర్లకు హై క్వాలీటి వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్‌తో వినియోగదారులు ట్రూకాలర్ యాప్‌లో వీడియోకాల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నిరంతరాయంగా వైఫై, సెల్యూలర్ డేటా మధ్య మారుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

అక్టోబర్ 16న మేట్ 10, కొత్త ఫీచర్‌తో..

వాయిస్, టెక్స్ట్ అనేవి కొన్నిసార్లు మాత్రమే కమ్యూనికేట్ చేసేందుకు వీలుంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యూజర్లు వన్‌స్టాప్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం ద్వారా సరికొత్త అనుభవాన్ని పొందనున్నారు. లక్షలాది మంది యూజర్లకు క్వాలిటీ వీడియోను అందించగలమని...గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని ట్రూకాలర్ వైస్‌ ప్రెసెడెంట్ రిషిత్ ఝంఝున్వాలా తెలిపారు.

వీడియో కాలింగ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఏ ఫ్లాట్‌ఫాం అయినా సరే మా లక్ష్యం అందరికీ సులభంగా, వేగంగా వీడియో కాలింగ్ అందిచడమేనని గూగుల్ హెడ్ తెలిపారు. ఈ ట్రూకాలర్ అనుసంధానంతో లక్షలాది మంది కొత్త వినియోగదారులకు మెరుగైన వీడియో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించలగమని ఆశిస్తున్నామన్నారు.

English summary
Now users will to make video calls directly through the Truecaller app on both Android and iOS platforms.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot