ట్రూకాలర్ యాప్ లో సరికొత్త గ్రూప్ చాట్ ఫీచర్‌ అదుర్స్......

|

ట్రూకాలర్ యాప్ గత కొన్ని నెలలుగా ఇంటిగ్రేటెడ్ కాల్ వెయిటింగ్ మరియు VoIP కాలింగ్ వంటి కొన్ని ఉపయోగకరమైన ఫీచర్ లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ యాప్ క్రొత్తగా గోప్యతా-కేంద్రీకృత గ్రూప్ చాట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఫోటోలు మరియు వీడియోలు వంటి మీడియా కంటెంట్‌ను షేర్ చేయడానికి మరియు చాటింగ్ చేయడానికి అనుమతిస్తుంది.

గ్రూప్ చాట్ ఫీచర్
 

గ్రూప్ చాట్ ఫీచర్ ఇన్విటేషన్ ఆధారిత-యంత్రాంగంపై ఆధారపడుతుంది. అంటే గ్రూప్ లో పాల్గొనేవారు ముందుగా అందులో చేర్చబడటానికి మరొకరు పంపిన ఆహ్వానాన్ని అంగీకరించాలి. గ్రూప్ చాట్ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS కోసం ట్రూకాలర్ యాప్ లో అందుబాటులో ఉంటుంది.

దీపావళి సీజన్‌లో STB ధరలను మళ్ళి రూ.300 తగ్గించిన టాటా స్కైదీపావళి సీజన్‌లో STB ధరలను మళ్ళి రూ.300 తగ్గించిన టాటా స్కై

ట్రూకాలర్ యాప్

ట్రూకాలర్ వెనుక ఉన్న సంస్థ గ్రూప్ చాట్ ఫీచర్‌ను రూపొందించడానికి యాప్ యొక్క స్పామ్-ఫ్రీ ఆవరణలో బ్యాంకింగ్ చేసిందని పత్రిక ప్రకటనలో తెలిపింది. అందుకే ఇన్విటేషన్ వ్యవస్థ ఉందని చెప్పారు. ట్రూకాలర్ యాప్ వినియోగదారుడు తాను ఎంచుకొనే గ్రూప్ చాట్‌లో సభ్యులు కావడానికి ముందే ఆహ్వానాన్ని అంగీకరించడం లేదా తిరస్కరించడం వంటి వాటిలో ఎదో ఒకదానిని ఎంచుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే గ్రూప్ నిర్వాహకుడు మీ యొక్క అనుమతి లేకుండా గ్రూప్ సంభాషణకు మరొక వ్యక్తులను చేర్చలేరు.

ఆపిల్ నుంచి త్వరలో స్మార్ట్ రింగ్...ఆపిల్ నుంచి త్వరలో స్మార్ట్ రింగ్...

ట్రూకాలర్

ట్రూకాలర్ యొక్క కొత్త గ్రూప్ చాట్ ఫీచర్‌లో ప్రైవసి అనేది అధికంగా ఉంటుంది. గ్రూప్ లోని సభ్యుడు వారి యొక్క ఫోన్ కాంటాక్ట్ లలో మీ నంబర్‌ను సేవ్ చేయకపోతే వారు మీ మొబైల్ నంబర్‌ను చూడలేరు. ఒకవేళ ఒక గ్రూప్ సభ్యుడు గ్రూప్ లోని మరొక సభ్యుడి మొబైల్ నంబర్‌ను చూడాలనుకుంటే మాత్రం వారు అలా చేయడానికి ఒక అభ్యర్థనను పంపవలసి ఉంటుంది. అలాగే ఇతర సభ్యులు కూడా ఎవరితో సంభాషిస్తున్నారో తెలుసుకోవడానికి గ్రూప్ సభ్యులు ట్రూకాలర్ ప్రొఫైల్‌ను చూడగలరు.

వాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడంవాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడం

గ్రూప్ చాట్ ఫీచర్
 

ట్రూకాలర్ యొక్క గ్రూప్ చాట్ ఫీచర్ మిగిలిన వారితో పోలిస్తే మూడు రెట్లు అధిక ప్రైవసీని కలిగి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ప్రైవేట్‌గా ఉంచడానికి, గ్రూప్ ఆహ్వానాలను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఎంచుకోవచ్చు మరియు వారి ట్రూకాలర్ ప్రొఫైల్‌ను చూడటం ద్వారా గ్రూప్ సంభాషణలో వ్యక్తులతో పరిచయం కలిగి ఉంటారు.

వివో దీపావళి ఆఫర్.... వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 101లకే కొనవచ్చువివో దీపావళి ఆఫర్.... వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 101లకే కొనవచ్చు

ఆండ్రాయిడ్

ఆండ్రాయిడ్ కోసం ట్రూకాలర్ యాప్ ను మేము పరీక్షించాము (వెర్షన్ 10.52.7). ఈ వెర్షన్ లో ట్రూకాలర్ యాప్ యొక్క క్రొత్త గ్రూప్ చాట్ ఫీచర్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉందని నిర్ధారించవచ్చు. ఈ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులకు కూడా ప్రత్యక్షంగా ఉందని బ్లాగ్ పోస్ట్‌లో ట్రూకాలర్ తెలిపారు. క్రొత్త ఫీచర్ కోసం అధికారిక మద్దతు పేజీలో మీరు ట్రూకాలర్ గ్రూప్ చాట్ ఫీచర్ గురించి మరింత తెలుసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Truecaller Introduces New Group Chat Feature For Android And iPhone Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X