భారత్‌లో దూసుకుపోతున్న Truecaller యాప్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటోన్న నాలుగవ అతిపెద్దగా యాప్‌గా ట్రు‌కాలర్ అవతరించింది.

|

భారత్‌లో Truecaller యాప్ దూసుకుపోతోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటోన్న నాలుగవ అతిపెద్దగా యాప్‌గా ట్రు‌కాలర్ అవతరించింది. ఫేస్‌బుక్ లైట్ యాప్‌ను కూడా ట్రు‌కాలర్ బీట్ చేయటం విశేషం. మ్యారీ మీకర్ ఇంటర్నెట్ ట్రెండ్స్ 2017 రిపోర్ట్స్ ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకుంటోన్న యాప్స్ జాబితాలో మొదటి ప్లేస్ ను వాట్సాప్ కైవసం చేసుకుంది. రెంవ స్థానంలో మెసెంజర్ మూడవ స్థానంలో షేరిట్ యాప్స్ నిలిచాయి.

Truecaller గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ అంటు ఉండరు

Truecaller గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ అంటు ఉండరు

Truecaller, ఈ యాప్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ అంటు ఉండరు. గుర్తుతెలియని నెంబర్‌ల నుంచి వచ్చే మొబైల్ కాల్స్‌ను ట్రేస్ చేయటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాప్ ద్వారా గుర్తు తెలియని కాంటాక్ట్ నెంబర్‌కు సంబంధించి అడ్రస్‌తో సహా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

కొత్త నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్

కొత్త నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్

కొత్త నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్ కొన్నికొన్ని సార్లు మనల్ని తికమక పెట్టేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ల తాకిడి తట్టుకోలేక ఫోన్ లిఫ్ట్ చేయటమే మానేస్తుంటాం. కొత్త నెంబర్ల విషయంలో ఏ మాత్రం కంగారుపడకుండా అవి ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు Truecaller యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఉపయోగించుకోవటం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం...

True Callerకు  కోట్లాది మంది యూజర్లు

True Callerకు కోట్లాది మంది యూజర్లు

మొబైల్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకునేందుకు True Caller యాప్ ఉపయోగపడుతుంది. స్విడెన్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఈ యాప్‌ను తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఈ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు.

లక్షల మొబైల్ నెంబర్లకు సంబంధించిన డేటా బేస్‌..

లక్షల మొబైల్ నెంబర్లకు సంబంధించిన డేటా బేస్‌..

ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్, గతంలోనే గుర్తించబడిన లక్షల మొబైల్ నెంబర్లకు సంబంధించిన డేటా బేస్‌ను కలిగి ఉంది. కాబట్టి, ఈ యాప్ ద్వారా కొత్త మొబైల్ నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్ ను దాదాపుగా ట్రేస్ చేయవచ్చు.

True Caller యాప్‌నే ఎందుకు సూచిస్తున్నామంటే..?,

True Caller యాప్‌నే ఎందుకు సూచిస్తున్నామంటే..?,

ఇక్కడ మీకు True Caller యాప్‌నే ఎందుకు సూచిస్తున్నామంటే..?, మొబైల్ నెంబర్లను ట్రేస్ చేస్తామంటూ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న చాలా వరకు వెబ్‌సైట్స్ నకిలీవే. ఇంకొన్ని వెబ్‌సైట్‌లు కేవలం నెట్‌వర్క్ ఆపరేటర్‌ను మాత్రమే సూచించటం జరుగుతోంది. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం మనకుండదు.

యాప్‌లోకి లాగిన్ అయ్యే వారు

యాప్‌లోకి లాగిన్ అయ్యే వారు

ట్రు కాలర్ యాప్‌లోకి లాగిన్ అయ్యే వారు తప్పనసరిగా తమ పేరు అలానే చిరునామాను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. True Callerను ఉపయోగించుకుని గుర్తు తెలియని మొబైల్ నెంబర్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు సింపుల్ ప్రొసీజర్...

కంప్యూటర్‌లో True Caller ఉపయోగించుకోవటం ఎలా..?

కంప్యూటర్‌లో True Caller ఉపయోగించుకోవటం ఎలా..?

స్టెప్ 1

ముందుగా మీ కంప్యూటర్‌లోకి వెళ్లి True Caller అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2

True Caller ప్రధాన పేజీలో కనిపించే డ్రాప్ డౌన్ మెనూలో India (+91) కోడ్‌ను సెలక్ట్ చేసుకుని మీరు అడ్రస్ ట్రేస్ చేయాలనుకుంటున్న మొబైల్ నెంబర్‌ను సెర్చ్ బాక్సులో ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

ఇప్పుడు స్ర్కీన్ పై ఓ పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు sign in అవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించి జీమెయిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ లేదా యాహూ అకౌంట్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వొచ్చు.

స్టెప్ 4

sign in ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు సంబంధించి 90% ఖచ్చితమైన సమాచారం స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

 

స్మార్ట్‌ఫోన్ యూజర్లు True Caller యాప్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

స్మార్ట్‌ఫోన్ యూజర్లు True Caller యాప్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Truecaller యాప్‌ను, మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ లాంచ్ చేసిన వెంటనే యాప్‌కు సంబంధించిన కాలర్ ఐడీ డీఫాల్ట్‌గా ఎనేబుల్ కాబడుతుంది.

"Got it" ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా..

దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ పాపప్ మెసేజ్ రూపంలో ఫోన్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. ఈ పాపప్ మెసేజ్ పై కనిపించే "Got it" ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా యాప్ విజయవంతంగా మీ ఫోన్‌లో లాంచ్ కాబడుతుంది. ఇక, ఏ విధమైన signup ప్రాసెస్ ఉండదు. యాప్ హోమ్ పేజీలో కనిపించే సెర్చ్ ఆప్షన్‌లో మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఆ నెంబర్ తాలుకా హిస్టరీని తెలుసుకోచర్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు కూడా ఇదే ప్రొసీజర్‌ను ఫాలో అయి Truecaller యాప్‌ను విజయవంతంగా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Truecaller is the fourth most downloaded app in India; surpasses Facebook. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X