Home
Apps

ట్రూకాలర్ లో కొత్త AI ఫీచర్ ! ఎలా పనిచేస్తుంది? వివరాలు తెలుసుకోండి

By Maheswara

ట్రూకాలర్ తన కొత్త ఫీచర్ అయిన ట్రూకాలర్ అసిస్టెంట్‌ను భారతదేశంలో లాంచ్ చేసినట్లు ప్రకటించింది. మెషిన్ లెర్నింగ్ (ML) మరియు క్లౌడ్ టెలిఫోనీ యొక్క శక్తిని పెంచుతూ, ఈ యాప్ అసిస్టెంట్ కాల్ స్క్రీనింగ్‌ను విప్లవాత్మకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పామ్ మరియు మోసపూరిత కాల్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వినియోగదారులకు సమర్థవంతమైన టూల్ ని అందిస్తుంది అని ట్రూ కాలర్ చెప్పింది.

ట్రూ కాలర్ అసిస్టెంట్, ఇప్పుడు ఆండ్రాయిడ్ పరికరాల్లో ట్రూ కాలర్ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంది. ఇది, ఆప్టిమైజ్ చేయగల మరియు ఇంటరాక్టివ్ డిజిటల్ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. దీని ప్రాథమిక విధి వినియోగదారు తరపున కాల్‌లకు సమాధానం ఇవ్వడం, అనవసరమైన కాలర్‌లను నివారించడానికి కూడా మీకు అవకాశమిస్తుంది.

Truecaller Launched Truecaller Assistant. Now You Can Identify Spam Calls And Fraud Calls Easily.

ఈ ట్రూకాలర్ అసిస్టెంట్ ఇన్‌కమింగ్ కాల్‌లకు కచ్చితత్వంతో త్వరగా స్పందిస్తుందని మరియు కాలర్ ప్రసంగం యొక్క లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్‌లను కూడా అందజేస్తుందని, వినియోగదారులు కాలర్‌ను గుర్తించడానికి మరియు కాల్ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా, వినియోగదారులు కాల్‌ని రిసీవ్ చేసుకోవాలా, అదనపు సమాచారాన్ని అభ్యర్థించాలా లేదా స్పామ్‌గా గుర్తించాలా అని నిర్ణయించుకోవచ్చు.

ట్రూకాలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్‌జున్‌వాలా ఈ కొత్త ఫీచర్ గురించి సంతోషాన్ని వ్యక్తం చేశారు: "ఇప్పటి వరకు, ఎవరు కాల్ చేస్తున్నారో మాత్రమే ట్రూకాలర్ మీకు చూపుతుంది, కానీ ఇప్పుడు మీరు మీ తరపున కాలర్‌తో ట్రూకాలర్ అసిస్టెంట్‌తో సంభాషణను అనుమతించవచ్చు. ఇది చాలా అద్భుతమైన పని. స్పామ్ మరియు ఫ్రాడ్ కాలర్‌లను పూర్తిగా నివారించడంలో వ్యక్తులకు సహాయం చేయడంలో ఇది మరో ముందడుగు. మేము ఈ ఫీచర్ ను ఇంతకు ముందు కొన్ని మార్కెట్‌లలో లాంచ్ చేసాము. మరియు భారతదేశంలోని ట్రూకాలర్ అభిమానులకు దీన్ని అందించడం మాకు నిజంగా సంతోషంగా ఉంది." అని తెలిపారు

మీకు తగిన విధంగా పర్సనలైజ్ వినియోగదారు అనుభవాన్ని మీకు అందిస్తుంది.
ఈ యాప్ ఫీచర్ ప్రస్తుతం 14 రోజుల ఉచిత ట్రయల్‌లో భాగంగా ట్రూకాలర్ అసిస్టెంట్ భారతీయ వినియోగదారులకు లాంచ్ చేయబడింది. తొలుత ఉచిత ట్రయల్‌ ప్రారంభ వ్యవధి తర్వాత, చందాదారులు నెలకు రూ. 149 నుండి లభించే ట్రూకాలర్ ప్రీమియం అసిస్టెంట్ ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు (ప్రస్తుతం ప్రమోషనల్ ధర రూ. 99తో అందించబడుతుంది ఇది పరిమిత కాలం ఆఫర్ మాత్రమే అని గుర్తించాలి).

ఈ ట్రూకాలర్ ఫీచర్ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో లాంచ్ చేయబడింది. సమీప భవిష్యత్తులో త్వరలోనే ఇతర మార్కెట్‌లలో మరియు భాషలకు విస్తరించే యోచనలో ట్రూకాలర్ యాజమాన్యం ఉంది. భారతీయ వినియోగదారుల కోసం,ఈ యాప్ అసిస్టెంట్ మొదట్లో ఇంగ్లీష్, హిందీ మరియు 'హింగ్లీష్' భాషలకి మద్దతు ఇస్తుంది,

ఈ ట్రూకాలర్ యాప్ ఫీచర్ సంస్థకు విస్తృతమైన ప్రేక్షకులను అందిస్తుంది మరియు వినియోగదారునికి స్నేహపూర్వక అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ప్రొఫెషనల్, స్నేహపూర్వక లేదా మర్యాదపూర్వకమైన స్టైల్స్‌తో సహా వివిధ వాయిస్ లను మీకు తగినట్లుగా సహాయకులను ఎంచుకోవచ్చని ట్రూకాలర్ తెలియచేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Truecaller Launched Truecaller Assistant. Now You Can Identify Spam Calls And Fraud Calls Easily.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X