Truecaller Premium Gold ఫీచర్ గురించి విన్నారా ?

ట్రూకాలర్'... స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు చిరపరిచితమైన పేరిది.

|

ట్రూకాలర్'... స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు చిరపరిచితమైన పేరిది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్... ఇలా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఈ యాప్ ఉంటే చాలు, యూజర్లు తమకు వచ్చే కాల్స్‌లో ఉండే తెలియని ఫోన్ నంబర్లను, వాటిని వాడుతున్న వారి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. కాగా రాంగ్‌ కాల్స్‌ నుంచి విముక్తి పొందడానికి రూపొందించిన ట్రూకాలర్‌ యాప్‌కు యూజర్లు ఎక్కువగానే ఉన్నారు,కాగా ఈ యాప్ ఇప్పుడు సరికొత్త హంగులతో వచ్చింది. యాడ్స్ కంట్రోల్ చేయడం అలాగే కాల్ రికార్డిం్, వ్యక్తిగత ప్రొఫైల్స్ వ్యూయింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.మీ సమాచారాన్ని ట్రూ కాలర్లో ఎవరు చూశారో తెలుసుకోవడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి.ఇప్పుడు ట్రూ కాలర్ కొత్తగా Truecaller Premium Gold పేరుతోఓ కొత్త సబ్ స్క్రిప్సన్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఓ సారి తెలుసుకుంటే..

ఆధార్ లేకుండా కొత్త సిమ్ కార్డు పొందడం ఎలా ?ఆధార్ లేకుండా కొత్త సిమ్ కార్డు పొందడం ఎలా ?

ట్రూ కాలర్ ప్రీమియం గోల్డ్

ట్రూ కాలర్ ప్రీమియం గోల్డ్

కాగా ట్రూ కాలర్ ప్రీమియం గోల్డ్ అనేది మోస్ట్ అడ్వాన్స్ డ్ subscription plan.సంవత్సరానికి subscription ఛార్జీ రూ.5 వేల వరకు ఉంది. ఈ subscription plan ద్వారా యూజర్లకు అన్ని రకాల ఫీచర్లు అందుతాయి. Truecaller Premium Gold subscription పొందిన యూజర్లకు గోల్డ్ కలర్ ఐడిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టాండర్డ్ బ్లూ కలర్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రూ కాలర్ని స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా యూజర్లు Gold colored caller IDని పొందుతారు.Gold-color caller ID, Premium Gold subscribers పొందిన యూజర్లు కస్టమర్ల సపోర్టుని చాలా త్వరగా పొందుతారు. ఏమైనా సమస్యలుంటే శరవేగంగా వాటిని పరిష్కరిస్తారు. కాగా ఈ ఫీచర్ గోల్డ్ కలర్ ఐడీ ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Truecaller Premium Gold subscription ఎలా ?

Truecaller Premium Gold subscription ఎలా ?

గూగుల్ ప్లే స్టోర్ నుండి మీ ట్రూ కాలర్ ని ఓ సారి అప్ డేట్ చేసుకోండి. అయిన తరువాత యాప ఓపెన్ చేసి మెనూ బటన్ నొక్కండి. అక్కడ యూజర్లు ప్రీమియం గోల్డ్ పేమెంట్ ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు ప్రీమియం గోల్డ్ సబ్ స్క్రైబ్ అందుతుంది.

 

 

టీం ఎక్స్పీరియన్స్
 

టీం ఎక్స్పీరియన్స్

గిజ్‌బాట్ టీం గత 10 రోజుల నుంచి ఈ ఫీచర్ మీద అనేక రకాల టెస్టులను నిర్వహించింది. ఈ టెస్ట్ ల్లో తేలిన ఫలితం ఏంటంటే..ఈ ఫీచర్ ఎటువంటి సమస్యలు లేకుండా చాలా సమర్థవంతంగా పని చేస్తోంది. దీన్ని అప్ డేట్ చేసుకున్న తరువాత గోల్ట్ కాలర్ ఐడి బ్యాడ్జి మీకు లభిస్తుంది. అయితే దీన ధర రూ. 5 వేలు ఉండటం యూజర్లకు కొంచెం నిరాశను కలిగిస్తోంది. అందరూ దీని వైు మొగ్గుచూపుతారా లేదా అన్నది ముందు ముందు చూడాలి.

Best Mobiles in India

English summary
Truecaller Premium Gold: Stand out from the crowd more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X