Truecaller యాప్ ద్వారా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు!

ప్రముఖ కాలర్‌ఐడీ యాప్ ‘ట్రుకాలర్’ (Truecaller) మరో విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

|

ప్రముఖ కాలర్‌ఐడీ యాప్ 'ట్రుకాలర్’ (Truecaller) మరో విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలో తీసుకురానున్న అప్‌డేట్‌తో ట్రుకాలర్ యూజర్లు వాయిస్ కాల్స్‌ను కూడా రికార్డ్ చేసుకునే వీలుంటుంది.

వాయిస్ కాల్స్‌కు పూర్తి సెక్యూరిటీ...

వాయిస్ కాల్స్‌కు పూర్తి సెక్యూరిటీ...

ఈ అప్‌కమ్మింగ్ ఫీచర్ గురించిన పలు డిటెయిల్స్‌ను తన సపోర్ట్ పేజీలో ట్రుకాలర్ ప్రస్తావించింది. రికార్డ్ చేయబడిన వాయిస్ కాల్స్ తొలత డివైస్‌లో సేవ్ కాబడి ఆ తరువాత ట్రుకాలర్ సర్వర్స్‌లోకి అప్‌లోడ్ కాబడతాయట. సర్వర్‌లో స్టోర్ కాబడిన వాయిస్ కాల్స్‌కు పూర్తి సెక్యూరిటీ ఉంటుందని, వీటిని వేరొకరు వినేందుకు ఎంత మాత్రం ఆస్కారం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

14 రోజుల పాటు ఉచిత ట్రెయిల్ పిరియడ్

14 రోజుల పాటు ఉచిత ట్రెయిల్ పిరియడ్

ప్రస్తుతానికి ఈ ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లను సపోర్ట్ చెబుతోంది. ఆండ్రాయిడ్ 5.0, ఆ తరువాత వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుదట. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ డివైస్‌లను కూడా ఈ ఫీచర్ ప్రస్తుతానికి సపోర్ట్ చేయలేదట. అంటే నెక్సుస్, పిక్సల్ డివైస్‌లతో పాటు మోటో జీ4లో ఈ ఫీచర్ వర్క్ అవ్వదు. ఈ పెయిడ్ ఫీచర్‌ను 14 రోజుల పాటు ఉచితంగా వినియోగించుకుని ఆ తరువాత కొనుగోలు చేయచ్చని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్ హెడ్‌సెట్‌తో మాట్లాడే కాల్స్ కంటే నేరుగా మాట్లడే కాల్స్‌ను ఈ ఫీచర్ మరింత క్వాలిటీతో రికార్డ్ చేయగలుగుతుందని కంపెనీ చెబుతోంది.

 

 

గుర్తుతెలియని ఫోన్ కాల్స్‌ని ఇట్టే కనిపెట్టవచ్చు...
 

గుర్తుతెలియని ఫోన్ కాల్స్‌ని ఇట్టే కనిపెట్టవచ్చు...

ట్రుకాలర్ అప్లికేషన్‌ను స్విస్ దేశానికి చెందిన True Software Scandinavia AB అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ట్రూకాలర్ ద్వారా అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ని ఇట్టే కనిపెట్టవచ్చు. ఈ యాప్‌లో ఇంకా ఎన్నో రకాలైన ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ట్రూ కాలర్ ద్వారా అపరిచితుల నుంచి వచ్చే కాల్స్‌ని అలాగే ఆ నంబర్లని బ్లాక్ చేయవచ్చు. ఇదే సమయంలో డిఫాల్ట్ డయలర్‌ను కూడా ట్రూకాలర్ ఆఫర్ చేస్తోంది.

వారి పేరు మీకు ముందే తెలిసిపోతుంది..

వారి పేరు మీకు ముందే తెలిసిపోతుంది..

మీకు ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తున్నట్లయితే దాన్ని వెంటనే ట్రూ కాలర్ సెర్చ్ ద్వారా కనుక్కోవచ్చు. ట్రూకాలర్ సెర్చ్‌లో ఆ నంబర్‌ని టైప్ చేయడం ద్వారా ఆ అపరిచిత వ్యక్తుల వివరాలు మీకు కనిపిస్తాయి. అయితే అతను ట్రూకాలర్‌లో ఉంటేనే వివరాలు కనిపించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Truecaller, the callerID app made by the Swedish firm is now giving users the option to record voice calls using the app.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X