TSCOPతో అరచేతిలో స్మార్ట్ పోలీసింగ్!
'టీఎస్‌కాప్’(TSCOP) పేరుతో సరికొత్త మొబల్ యాప్‌ను తెలంగాణ పోలీస్ శాఖ లాంచ్ చేసింది. పోలీసులందరిని ఒకే గొడుకు క్రిందకు తీసుకువచ్చే లక్ష్యంతో రూపకల్పన కాబడిన ఈ అప్లికేషన్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతోంది.

TSCOP యాప్ ఆవిష్కరణ సందర్భంగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతు స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రస్తుతానికి 54 రకాల సేవలను పోలీసులు పొందే వీలుంటుంది. త్వరలోనే మరిన్ని సేవలు ఈ యాప్‌లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నేర పరిశోధనలకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని ఈ యాప్‌లో పొందపరచనున్నారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకునేలోపే ఆ ఘటనకు సంబంధించిన చాలా వరకు డేటా యాప్‌లో అప్‌లోడ్ కాబడి ఉంటుంది. దీంతో దర్యాప్తు వేగంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
ఈ యాప్ సేవలను తొలత సైబరాబాద్, రాచకొండ పోసీలు కమీషనరేట్ పరిధిలలో ప్రారంభంకానున్నాయి. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు ఇంకా మిగిలిన కమీషనరేట్లకు టీఎస్‌కాప్ సేవలు విస్తరిస్తాయి. టీఎస్‌కాప్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఆధారిత డివైస్ లలో వర్క్ అవతుందని డీజీపీ తెలిపారు.
ముఖ్యంగా ఫ్రంట్ లైన్ పోలీస్ అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా మరింత వేగంగా దూసుకెళ్లేందుకు టీఎస్‌కాప్ ఉపయోగపడుతుందని డీజీజీ తెలిపారు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ చుట్టుపక్కల చోటుచేసుకునే నేరాలు అలానే సంఘవ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి సమాచారమిచ్చే వీలుంటుందని డీజీపీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications








