ట్విట్టర్‌కు పోటీగా Threads యాప్ లాంచ్.. కేవలం 4 గంటల్లో ఐదు మిలియన్ల అకౌంట్లు..!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన యాప్ Threads వినియోగదారులకు ఈ ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు అందుబాటులోకి వస్తుందని తొలుత ప్రకటించినా.. ఆ సమయం కంటే ముందుగానే వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గత కొన్ని రోజుల నుంచి ఈ యాప్‌పై అనేక కథనాలు వెలువడ్డాయి. దీంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. యాప్‌తో పాటు వెబ్‌లోనూ థ్రెడ్స్ అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా సుమారు 100 దేశాల్లో థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

థ్రెడ్స్ యాప్‌లో చాలా వరకు ట్విట్టర్ తరహా ఫీచర్లను ఉన్నాయి. కానీ థ్రెడ్స్ యాప్‌లో 500 అక్షరాల లిమిట్ ఉంది. అదే ట్విట్టర్‌లో కేవలం 280 అక్షరాలు మాత్రమే పోస్ట్ చేయవచ్చు. ఇక ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌తోనే థ్రెడ్స్ యాప్‌లోనూ లాగిన్ కావచ్చు. ఇన్‌స్టాలో ఫాలో అయిన వారిని థ్రెడ్స్‌లో కూడా ఫాలో కావచ్చు. మరియు 5 నిమిషాల నిడివితో వీడియోలను కూడా పోస్ట్ చేయవచ్చు.
థ్రెడ్స్ యాప్‌కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. కేవలం విడుదల అయిన తొలి రెండు గంటల్లో 2 మిలియన్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరియు నాలుగు గంటలకు ఏకంగా 5 మిలియన్లు మంది థ్రెడ్స్ యాప్‌లో అకౌంట్లు తెరిచారు. మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్‌లో తొలి పోస్ట్ చేశారు. ఫైర్ ఎమోజీతో పాటు తొలి నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల సైన్ ఆప్‌లు (అకౌంట్‌లు) నమోదుచేసినట్లు పోస్ట్ చేశారు.

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక.. అనూహ్య మార్పులు చేశారు. సీఈవో సహా ట్విట్టర్ ఉద్యోగుల్లో అనేక మందిని తొలగించారు. పనివేళల్లోనూ మార్పులు చేశారు. సెలబ్రిటీ, ప్రముఖులు మాత్రమే ఉన్న వెరిఫైడ్ అకౌంట్‌లు సాధారణ ప్రజలు కూడా పొందేలా ప్రత్యేక ప్లాన్లను తీసుకొచ్చారు.
కొంత డబ్బు చెల్లించి అర్హులైన వినియోగదారులు వెరిఫైడ్ ఖాతా (బ్లూటిక్) పొందేలా మార్పులు చేశారు. మరియు ఓసారి ఏకంగా ట్విట్టర్ లోగోను మార్చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే పాత లోగోను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ట్విట్‌లకు పరిమితిని కూడా విధించి షాక్ ఇచ్చారు.
అంటే వెరిఫైడ్ వినియోగదారులు (బ్లూటిక్) రోజుకు 10 వేల ట్వీట్‌లు మాత్రమే వీక్షించగలరు. అదే బ్లూటిక్ లేనివారు రోజుకు కేవలం 1000 ట్వీట్‌లు మాత్రమే చూడగలరు. అదే కొత్తగా ట్వీట్టర్ ఖాతా తెరిచి బ్లూటిక్ లేనివారు కేవలం 500 ట్విట్‌లు మాత్రమే చూసేలా నిబంధనలు తీసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు మెటా పక్కా ప్లాన్ చేసింది. తన మైక్రో బ్లాగింగ్ సైట్ థ్రెడ్స్‌ను లాంచ్ చేసింది. అయితే ట్విట్టర్‌ను ఏ స్థాయిలో పోటీ ఇస్తుందో వేచిచూడాల్సి ఉంది. వాస్తవానికి ట్విట్టర్‌పై పైచేయి సాధించేందుకు థ్రెడ్స్‌కు.. ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగోవంతు వినియోగదారులు మాత్రమే అవసరం అవుతారు.


Click it and Unblock the Notifications








