Twitter కొత్త ఫీచర్!! రికార్డ్ వాయిస్ నోట్లను DM లుగా పంపే గొప్ప అవకాశం...

|

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ భారతదేశంలోని యూజర్ల కోసం ఇప్పుడు కొత్తగా మరొక ఫీచర్ ను తీసుకువచ్చింది. ట్విట్టర్ యొక్క డైరెక్ట్ మెసేజ్‌(DM)ల కోసం వాయిస్ మెసేజ్ ఫీచర్లను విడుదల చేయడం ప్రారంభించింది. ఒక ప్రయోగంలో భాగంగా అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ప్రస్తుతం బ్రెజిల్, జపాన్ మరియు భారతదేశంతో సహా ఎంపిక చేసిన దేశాలలో ట్విట్టర్ వినియోగదారుల కోసం దశలవారీగా రూపొందించబడింది. ఈ ఫీచర్ ట్విట్టర్ వినియోగదారులకు వాయిస్ నోట్లను DM లుగా పంపడానికి అనుమతిస్తుంది. అయితే ప్రతి వాయిస్ మెసేజ్ 140 సెకన్ల కంటే ఎక్కువ ఉండకూడదు అని గుర్తుంచుకోవాలి. ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులు ఇరువురికి కూడా ఈ DM ల కోసం వాయిస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

ట్విట్టర్‌ కొత్త ఫీచర్‌

ట్విట్టర్‌ కొత్త ఫీచర్‌

భారతదేశంలో ట్విట్టర్‌కు అధిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇండియా యొక్క సోషల్ మీడియా మార్కెట్ లో ట్విట్టర్ అధిక శాతం వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగం తగ్గిన తరువాత ట్విట్టర్ వినియోగం అధికమవుతున్నది. కావున సంస్థ నిరంతరం కొత్త ఫీచర్లను విడుదల చేయడానికి ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాము కొత్త ఫీచర్‌ను ప్రకటించిన శుభసందర్భంగా ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి మాట్లాడుతూ తెలిపారు.

ట్విట్టర్ డైరెక్ట్ మెసేజ్ లలో వాయిస్ ఫీచర్

ట్విట్టర్ డైరెక్ట్ మెసేజ్ లలో వాయిస్ ఫీచర్

DM డైరెక్ట్ మెసేజ్ లలో వాయిస్ ఫీచర్ ను ఇండియాలోకి తీసుకురావడంతో ప్రజలు తమను తాము వ్యక్తీకరించడానికి ఒక కొత్త మార్గంగా ఉపయోగపడుతుంది. వినియోగదాలు తాము పంపవలసిన మెసేజ్ లను టైప్ చేయడానికి బదులుగా మీ యొక్క స్వరంతో పలకడం ద్వారా ఆ మాటలు అక్షరాల రూపంలో నిర్మించి మరొకరికి పంపడానికి వీలును కల్పిస్తుంది. వినియోగదారుల యొక్క భావోద్వేగం మరియు తాదాత్మ్యం ద్వారా కనెక్ట్ అవ్వడానికి కూడా ఈ కొత్త ఫీచర్ సహాయపడుతుంది.

ట్విట్టర్ ఆడియో మెసేజింగ్ ఫీచర్‌

ట్విట్టర్ ఆడియో మెసేజింగ్ ఫీచర్‌

ట్విట్టర్ తన ప్లాట్‌ఫామ్‌లో ఆడియో మెసేజింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 2020 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం వాయిస్ ట్వీట్లను రూపొందించింది. DM ల ద్వారా వాయిస్ మెసేజ్ ఫీచర్ అనేది వాట్సాప్, టెలిగ్రామ్ మరియు ఇతర మెసేజింగ్ యాప్ లలో ఉన్న ఫీచర్‌తో సమానంగా ఉంటుంది. ఇది ప్రైవేట్ చాట్ లలో వాయిస్ మెసేజ్ లను పంపడానికి అనుమతిస్తుంది.

ట్విట్టర్‌లో వాయిస్ DMలను పంపే విధానం

ట్విట్టర్‌లో వాయిస్ DMలను పంపే విధానం

ట్విట్టర్ DM ల ద్వారా వాయిస్ మెసేజ్లను పంపడం ప్రారంభించడానికి ట్విట్టర్‌లో గల ఏదైనా ఒక చాట్ ను ఓపెన్ చేయండి లేదా క్రొత్త చాట్‌ను ప్రారంభించండి. ఇప్పుడు మెసేజ్ ను రికార్డ్ చేయడానికి వాయిస్ రికార్డింగ్ బటన్‌పై నొక్కండి. IOS వినియోగదారులు మెసేజ్ ను రికార్డ్ చేయడానికి మైక్ బటన్‌ను నొక్కి ఉంచవచ్చు. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారులు రికార్డింగ్‌ను ప్రారంభించడానికి మరియు ముగించడానికి విడిగా బటన్‌ను నొక్కవలసి ఉంటుంది అని గమనించుకోండి.

Best Mobiles in India

English summary
Twitter Starts Rolling Voice Message Features For Direct Messages(DMs) in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X