ఫోన్ నంబర్ లేకుండా ట్విట్టర్ నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు.. !
గత సంవత్సరం అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కీలక మార్పులు చేశారు. సంచలన నిర్ణయాలు తీసుకోవడం సహా అనేక ఫీచర్లను ప్రవేశపెట్టారు. కొన్ని రోజుల క్రితం ట్విట్టర్‌ను ఎక్స్‌కార్ప్‌లో విలీనం చేశారు. అనంతరం ట్విట్టర్‌ను 2012 నుంచి ఉన్న లోగో స్థానంలో Xను ఏర్పాటుచేశారు. అనంతరం ట్విట్టర్ కోసం X.com పేరిట కొత్త డొమైన్‌ను క్రియేట్ చేశారు.
తాజాగా X (ట్విట్టర్) సీఈవో లిండా యక్కరినో సరికొత్త ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో కీలక ఫీచర్ గురించి తెలిపారు. ట్విట్టర్‌కు త్వరలో వీడియో కాల్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ట్విట్టర్‌ను చైనాకు చెందిన wechat యాప్ మాదిరిగా ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

తాను గత 8 వారాలుగా X సంస్థలో ఉన్నానని, తమ లక్ష్యాలకు దగ్గర అవుతున్నట్లు చెప్పారు. మరియు సబ్‌స్క్రిప్షన్ వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని X (ట్విట్టర్) సీఈవో వెల్లడించారు. మస్క్ నేతృత్వంలో తాను స్వయంప్రతిపత్తి హోదాలో పనిచేస్తున్నానని, మస్క్ ప్రస్తుతం కొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టారని, తాను మిగిలిన విభాగాలకు నేతృత్వం వహిస్తున్నట్లు చెప్పారు.
ట్విట్టర్ (X) ద్వారా త్వరలో వీడియో కాల్ చేసుకోగలుగుతారని చెప్పారు. అదికూడా ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చని సీఈవో తెలిపారు. డిజిటల్ పేమెంట్స్, ఎక్కువ నిడివి ఉన్న వీడియో పోస్టింగ్‌లు, క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్ వంటి ఫీచర్‌లు తమ లక్ష్యాల్లో ఉన్నాయని చెప్పారు.
ట్వీట్టర్‌ను కొనుగోలు చేశాక.. ఒకరకంగా దానిపై ఎలాన్ మస్క్ ప్రయోగాలు చేశారు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ప్రముఖుల అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. అనంతరం మళ్లీ పునరుద్ధరించారు. దాంతోపాటు బ్లూటిక్ కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చాడు. తాజాగా కొన్నిరోజుల క్రితం ట్వీట్లకు పరిమితిని విధించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ అసంతృప్తి వ్యక్తం అయింది.
వెరిఫైడ్ ఖాతాల కలిగిన వ్యక్తులు రోజుకు పదివేల ట్వీట్లు, వెరిఫైడ్ ఖాతా లేకున్నా చాలా కాలం నుంచి ట్వీట్టర్ అకౌంట్ కలిగి వ్యక్తులు రోజుకు వెయ్యి ట్వీట్లు, కొత్తగా అకౌంట్ తెరిచి వెరిఫైడ్ అకౌంట్ లేకుంటే కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూడగలిగేలా మార్పులు చేశారు.
* ట్విట్టర్ (X)కు పోటీగా మెటా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్‌ను జులై తొలివారంలో విడుదల చేసింది. ప్రారంభంలో భారీగా డౌన్‌లోడ్లు, సైన్‌ఆప్‌లు నమోదు చేసిన థ్రెడ్స్ యాప్ అనంతరం డీలా పడింది. జులై 31 తేది నాటికి రోజువారి యాక్టివ్ యూజర్ల సంఖ్య 82 శాతానికి పడిపోయినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం రోజుకు కేవలం 8 మిలియన్‌ల యూజర్లు మాత్రమే థ్రెడ్స్ యాప్‌ను వినియోగిస్తున్నారు. గత నెలలో థ్రెడ్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇదే అత్యంత తక్కువని తెలిపింది. గతంలో గరిష్ఠంగా 44 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉండేది.
థ్రెడ్స్ యాప్ ప్రారంభంలో స్క్రోలింగ్ సమయం 19నిమిషాల పాటు ఉండేదని, ప్రస్తుతం ఆ సమయం కేవలం 2.9 నిమిషాలకు పడిపోయిందని ఆ నివేదిక తెలిపింది. తొలి రెండు వారాల్లో థ్రెడ్స్ యాప్ గణనీయంగా యూజర్లను సంపాదించింది. అనంతరం క్రమంగా పడిపోయింది. థ్రెడ్స్ ప్లాట్‌ఫాంపై మార్క్ జుకర్‌బర్గ్ కార్యకలాపాలు కూడా భాగా తగ్గాయి. యాప్ ప్రారంభంలో ఉన్నంత యాక్టివ్‌గా ప్రస్తుతం లేరు. గతంలో మాదిరిగా ఆర్గానిక్ పోస్టులను షేర్ చేయడం లేదు.


Click it and Unblock the Notifications








