Home
Apps

బెంగుళూరు వాసుల కోసం Uber కొత్త రైడ్ ఆఫ్షన్

By Bommu Sivanjaneyulu

ప్రముఖ ఆన్ డిమాండ్ రైడ్-షేరింగ్ యాప్ ఉబెర్ (Uber), బెంగుళూరు వాసుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటలోకి తీసుకువచ్చింది. PREMIER పేరుతో ఈ కొత్త రైడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇన్-యాప్ ప్రొడక్ట్ ఆప్షన్ ద్వారా ప్రస్తుత uberX ఎక్స్‌పీరియన్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటుంది.

Uber launches PREMIER a new ride option in Bengaluru

ఉబెర్ PREMIER ఆప్షన్ సదుపాయం గతంలో ముంబై, పూణే యూజర్లకు మాత్రమే అందుబాటలో ఉండేది. ఇక పై బెంగుళూరు వాసులకు అందుబాటులో ఉంటంది. ప్రీమియర్ ఆప్షన్‌లో భాగంగా రైడర్స్ ఎకానమి-రేంజ్ సెడాన్ కార్లలో ప్రయాణించే వీలుంటుంది. అంతేకాకుండా పోస్ట్-రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకునేందుకు మెరుగైన కస్టమర్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఉబెర్ అందించే ప్రతి రైడ్ ప్రయాణికులకు గొప్ప అనుభూతిగా మిగలాలన్నది మా సంకల్పం. యూజర్ అసవసరాలకు అనుగుణంగా ప్రొడక్ట్స్‌ను బిల్డ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే కొత్త సౌకర్యాలతో కూడిన PREMIER ఆప్షన్‌ను బెంగుళూరులో లాంచ్ చేయటం జరుగిందని ఉబెర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రైడర్ అంచనాలకు అనుగుణంగా ఇన్-సిటీ రైడ్‌లను ఆఫర్ చేయటమే ప్రీమియర్ ఆప్షన్ ముఖ్య ఉద్దేశమని ఉబెర్ తెలిపింది.

ఉబర్ ప్రీమియర్ ఆప్షన్ క్రింద రైడ్‌లను బుక్ చేసుకునే రైడర్స్‌కు వారివారి ట్రిప్స్‌కు అనుగుణంగా పికపింగ్ సమయాలాను కేటాయించటంతో పాటు బెస్ట్ క్లాస్ సర్వీసును వారికి ఆఫర్ చేయటం జరుగుతుందని ఉబర్ తెలిపింది. మిడ్ డే మీటింగ్స్, షాపింగ్, ఫ్యామిలీ ట్రిప్స్, ఫ్రెండ్స్‌తో ఔటింగ్, బిజెనిస్ హోస్టింగ్

పార్ట్‌నర్స్‌ను పిక్ చేసుకోవటం వంటి అవసరాలకు ఈ ప్రీమియర్ ఆప్షన్‌ను ఉపయగించుకోవచ్చని ఉబెర్ తెలిపింది.

1000కు పై లైఫ్ టైమ్ ప్రయాణాలను పూర్తి చేసిన బెస్ట్ క్లాస్ డ్రైవర్ పార్టనర్స్ తమతో ఉన్నారని, వీరి పనితీరును రైడర్స్ ఇచ్చిన రేటింగ్ ద్వారా గుర్తించామని ఉబర్ తెలిపింది. ప్రీమియర్ ఆప్షన్‌తో పాటు ఉబర్‌పూల్, ఉబెర్‌గో, ఉబర్‌ఎక్స్ఎల్ ఆప్షన్లను కూడా బెంగుళూరు వాసులకు అందుబాటులో ఉంచింది.

అమెరికాకు చెందిన ఉబర్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా 633 నగరాల్లో క్యాబ్ రైడింగ్ సేవలను అందిస్తోంది. మన దేశానికి వచ్చేసరికి ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో ఉబెర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉబర్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మనకు కావల్సిన ప్రీమియం శ్రేణి కార్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకుని ప్రయాణించే వీలుంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Riders have indicated the need and helped shape the product by sharing feedback through features such as Driver Compliments and Driver Ratings.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X