Uber Lite యాప్‌తో మరింత వేగంగా క్యాబ్ బుకింగ్!

  ప్రముఖ క్యాబ్ బుకింగ్ సర్వీస్ 'ఉబెర్' (Uber) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఉద్దేశించి సరికొత్త యాప్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Uber Lite పేరుతో లాంచ్ అయిన ఈ అప్లికేషన్ తక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌లోనూ వేగవంతమైన ఫెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయగలుగుతుంది. అంతేకాదు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఈ ఉబెర్‌లైట్‌ వెర్షన్‌ను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. త్వరలోనే భారతీయ భాషలు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ , గుజరాతీ భాషల్లో విడుదల చేయనుంది. తద్వారా భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రధాన ప్రత్యర్థి ఓలాను ఢీకొట్టేందుకు సిద్దపడుతోంది.

  BSNL ఈద్ ముబారక్ ప్లాన్, రోజుకు 2జిబి డేటా,150 రోజుల వ్యాలిడిటీ

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ప్రస్తుతానికి ఇన్విటేషన్ పద్ధతిలో..

  ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఢిల్లీ, జైపూర్ ఇంకా హైదరాబాద్ ప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతోంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఉబెర్‌లైట్ యాప్ సేవలను విస్తరించినున్నట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్స్‌తో వచ్చే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇన్విటేషన్ పద్దతిలోనే ఈ యాప్ లభ్యమవుతోంది. ఈ లింక్ (https://docs.google.com/forms/d/e/1FAIpQLSft_n6E85mNiimPqLJVnMpKeWrZCbK6B8sIglxpJVXZ-mk4Ag/viewform)లోకి వెళ్లటం ద్వారా ఉబెర్‌లైట్ యాప్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు.

  5MB స్టోరేజ్ స్పేస్ ఉంటే చాలు..

  స్టాండర్డ్ ఉబెర్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే దాదాపుగా 180 MB స్టోరేజ్ స్పేస్‌తో పాటు అంతకంటే ఎక్కువ మొత్తంతో ర్యామ్ అవసరమముంది. ఇదే సమయంలో Uber Lite యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే 5MB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. ఎంట్రీ లెవల్ ప్రాసెసర్‌తో పాటు 1జీబి అంతకంటే తక్కువ ర్యామ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆండ్రాయిడ్ ఓరియో గో స్మార్ట్ ఫోన్‌లను ఈ యాప్ భేషుగ్గా సపోర్ట్ చేస్తుంది.

  ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా..

  రెగ్యులర్ ఉబెర్ యాప్‌లో ఉన్న అన్ని ఫీచర్లు లైట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. డేటా యూసేజ్‌ను తగ్గించే క్రమంలో కస్టమ్ అల్గారిథమ్‌ను ఈ యాప్ ఉపయోగించుకుంటుంది. త్వరలో లభించబోయే సాఫ్ట్‌‌వేర్ అప్‌డేట్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఈ యాప్‌ను వినియోగించుకునే వీలుంటుంది. భారత్‌లో తయారైన ఈ యాప్ ద్వారా 300 మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయంలో క్యాబ్‌ను బుక్ చేసుకునే వీలుంటుందని కంపెనీ చెబుతోంది.

  Uber Lite యాప్‌లోని ప్రధానమైన హైలైట్ పాయింట్స్..

  ఈ లైటర్ వెర్షన్ యాప్ బరువు కేవలం 5 MB మాత్రమే. అంటే, ఈ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే కేవలం 5ఎంబి స్టోరేజ్ మాత్రమే ఖర్చవుతుంది. ఎంట్రీలెవల్ స్పెసిఫికేషన్స్‌తో లభ్యమయ్యే అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఉబెర్ లైట్ యాప్ ప్రస్తుతానికి భారత్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. నచ్చిన భాషలో ఈ యాప్‌ను మేనేజ్ చేసుకోవచ్చు.

  ఏడు భారతీయ భాషలలో

  ఉబెర్ లైట్ రానున్న నెలల్లో దేశంలోని ఇతర ప్రదేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని ఉబెర్‌ ప్రకటించింది. ఏడు భారతీయ భాషలలో దీన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లకు రైడ్-బుకింగ్ అనుభవాన్ని సాధ్యమైనంత మృదువుగా, సన్నిహితంగా వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం యూజర్లతో మాట్లాడుతున్నామని ఉబెర్ రైడర్ ప్రొడక్షన్ హెడ్ పీటర్ డెంగ్ చెప్పారు.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Uber announces a new light version of its app for Android smartphones with entry-level specifications and low internet speeds. The app will be initially available in Delhi, Jaipur, and Hyderabad and the app will be made available on other markets as well.
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more