ఢిల్లీ పోలీసులతో ఉబెర్ భాగస్వామ్యం!

Posted By: Madhavi Lagishetty

దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒంటరిగా వెళ్లే మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతారక్కడ. గతంలో జరిగిన అత్యాచార ఘటనలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఢిల్లీ పోలీసులతో ఉబెర్ భాగస్వామ్యం!

ఈ ఘటనల నేపథ్యంలో ఢిల్లీలో మహిళల భద్రత కోసం ఓ మొబైల్ యాప్ రూపొందించారు. రైడర్ షేరింగ్ కంపెనీ ఉబెర్ ఢిల్లీ పోలీసులతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రైడర్ యాప్ ద్వారా మహిళల భద్రత కోసం ఈ యాప్ ను ప్రత్యేకంగా తయారుచేశారు.

ఈ భాగస్వామ్యంతో హిమత్ యాప్ ఇప్పుడు...లక్షల మంది మహిళా రైడర్స్ కి ఈయాప్ ను వినియోగించుకుంటున్నారు. ఇది టెక్నాలజీ సంస్థతో ఢిల్లీ పోలీసులు కుదుర్చుకున్న మొట్టమొదటి భాగస్వామ్యం. మహిళల భద్రతపై తమ ద్రుష్టిని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రభుత్వ సంస్థ సహాయపడుతుంది.

జనవరి 2015లో ప్రారంభమైనప్పటి నుంచి సమారు 90,000మంది హిమ్మత్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది ప్రస్తుతం 31,000మంది వినియోగదారులను కలిగి ఉంది. ఇప్పుడు ఉబెర్ ఒక శక్తిలా పనిచేయడానికి మహిళల రైడర్స్ ఎక్స్ పాండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

వాట్సాప్‌లో coloured Text status సదుపాయం

ఉబెర్ అధినేత శ్వేతా రాజ్ పల్ కోహ్లి మాట్లాడుతూ...భద్రతా సవాళ్లను అధిగమించాలన్న టెక్నాలజీ నేత్రుత్వంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఢిల్లీలో మహిళలకు అభద్రతాభావం ఉంది. ఇలాంటి కీలక సమయాల్లో ఢిల్లీ పోలీసులతో కలిసి పనిచేయడాన్ని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము.

ఉబెర్ ద్వారా హిమ్మత్ యాప్ అనుసందానిస్తూ...మహిళా రైడర్స్ లక్షల మందికి భద్రతా వలాయన్ని పటిష్టం చేయడం కోసం ఒక పెద్ద మెట్టు ఎక్కాల్సి ఉంది. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాల దిశలో హిమ్మత్ యాప్ అనేది ఒక గొప్ప ప్రయత్నంగా తాము నమ్ముతున్నామని స్పష్టం చేశారు.

ఉబెర్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేయగల లింక్ తో సహా...హిమ్మత్ యాప్ కోసం శాశ్వత యాప్ లో యాక్సెస్ ను అభివ్రుద్ధి చేస్తుంది. రెండవ దశ ఉబెర్ యాప్ లోపల నంచి హిమ్మత్ యాప్ నేరుగా యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఆఖరి దశ..యాప్ ల మధ్య ఒక API ఇంటిగ్రేషన్ ఉంటుంది.

మహిళల భద్రత, విమానాశ్రయాల ఆధునికీకరణ ప్రత్యేక కమిషనర్ పోలీస్ సంజయ్ బనివాల్ మాట్లాడుతూ...టెక్నాలజీ మరింత సమర్థవంతమైన నిఘా వ్యవస్థను కల్పిస్తుంది. బాధపడుతున్న మహిళలకు త్వరగా ..సకాలంలోనే సహాయం అందించడానికి హిమ్మత్ ను ఉపయోగించుకునేందుకు వీలు కలిపిస్తుంది.

ఢిల్లీలో ఎక్కువమంది మహిళా రైడర్లు ఈ సహాయంతో అందుబాటులో ఉండటం గురించి సున్నితంగా ఉంటారు. ఉబెర్ యాప్ లో అత్యవసర బటన్ తో పాటు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల హెల్ప్ లైన్లను యాక్టివేట్ చేయడానికి రైడర్స్ మరో టచ్ పాయింట్ ను కలిగి ఉంటారని తెలిపారు.

ప్రత్యేకించి మహిళల భద్రతా ప్రచారాలకు అవసరమైన ప్రత్యేకమైన భద్రతా చర్యలు అవసరమవుతాయని డీఎస్పీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ మధుర్ శర్మ చెప్పారు. మా విభాగంలో మనకు హెల్ప్ లైన్ సంఖ్య 1091 ఉందన్నారు.

సోషల్ మీడియా ప్రపంచంలో సైబర్ స్టాకింగ్ హెల్ప్ లైన్ నంబర్ 1096ను ప్రవేశపెట్టామన్నారు. మహిళల భద్రతపై ఢిల్లీ పోలీసులు మరొక అడుగుగా హిమ్మత్ యాప్ మాకు భద్రతపై ద్రుష్టి పెట్టడం ముఖ్యం..ఉబెర్ మాకు ఎక్కువ మంది మహిళలను తీసుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నమని తెలిపారు.

English summary
This is Delhi Police’s first partnership with any technology company
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot