డ్రైవర్ల కోసం ఉబెర్ కొత్త యాప్

|

ప్రముఖ రైడ్ షేరింగ్ సర్వీస్ 'ఉబెర్ టెక్నాలజీస్' (Uber Technologies), తన డ్రైవర్స్‌ను ఉద్దేశించి సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఉబెర్ డ్రైవర్స్ తమ సర్వీస్‌ను మరిత మెరుగు పరుచుకోవటంతో పాటు ఆదాయాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునే వీలుంటుంది.ఉబెర్ డ్రైవర్లు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తూ '180 డేస్ ఆఫ్ ఛేంజ్' పేరుతో సరికొత్త ప్రోగ్రామ్‌ను ఉబెర్ లాంచ్ చేసిన విషయంలో తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉబెర్ డ్రైవర్లు గతంలో చేసిన తప్పులను మ సరిదిద్దుకుని పనితీరును మరింత మెరుగుపరుచుకునే వీలుంటుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి తెలిపారు.

 
డ్రైవర్ల కోసం ఉబెర్ కొత్త యాప్

దేశవ్యాప్తంగా 29 నగరాల్లో...
ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా 29 నగరాల్లో ఉబెర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ ఇంకా విశాఖపట్నంలో ఉబెర్ సేవలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు ఉబెర్ సేవలు విస్తరించనున్నాయి. తొలత ఈ యాప్ సర్వీసును అమెరికాలో ప్రారంభించారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావటం. ఉబర్ సేవలను మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్...

ప్రొసీజర్ ఇలా..?
ముందుగా ఉబెర్ సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత సైనప్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ పేరు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీతో పాటు క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. వివరాలను ఎంటర్ చేసిన తరువాత ఉబర్ సర్వీసుకు సంబంధించి టర్మ్స్ ఇంకా ప్రైవసీ పాలసీలను నిశితంగా పరిశీలించి ఆ తరువాత సైనప్ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తైనట్లయితే మీ ఉబర్ అకౌంట్ క్రియేట్ కాబడతుంది. మీ ఉబెర్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు మీరు జత చేసిన ఈమెయిల్ అకౌంట్‌కు పంపబడతాయి.

Galaxy S9, Galaxy S9 plus కెమెరాపై ఆసక్తికర విషయాలుGalaxy S9, Galaxy S9 plus కెమెరాపై ఆసక్తికర విషయాలు

ఆండ్రాయడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచే..
ఉబెర్ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ఐఫోన్ యూజర్లు యాపిల్ అప్లికేషన్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉబర్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తరువాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

సౌకర్యవంతమైన సేవలు..
+యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత మీ ప్రాంతాన్ని బట్టి ఉబర్ రకరకాల కార్ సర్వీసులను అందిస్తుంది. వాటిలో మీకు నచ్చిన క్యాబ్ సర్వీసును పొందవచ్చు. క్యాబ్ సర్వీసును ఎంచుకున్న తరువాత మీరు ఉన్న ప్రదేశాన్ని యాప్‌లో మార్క్ చేయండి. మీకు అత్యంత చేరువలో ఉన్న కారు ఎక్కడుందో తెలిసిపోతుంది. అంతేకాకుండా డ్రైవర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. యాప్‌లో మీరు ఉన్న ప్రదేశాన్ని మార్క్ చేయటం ద్వారా యాప్ సాయంతో డ్రైవర్ మిమ్మల్ని చేరుకోగలగుతారు.

Best Mobiles in India

English summary
Uber redesigned its driver app with input from actual drivers. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X