Home
Apps

దొంగ బుద్ధి పోనిచ్చుకోని చైనా, ఇలా బరితెగించింది !

ఈ మధ్య చైనా ఇండియా యూజర్ల డేటాను తస్కరిస్తోందంటూ కథనాలు వస్తున్నాయి.

By Hazarath

ఈ మధ్య చైనా ఇండియా యూజర్ల డేటాను తస్కరిస్తోందంటూ కథనాలు వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో యూజర్ల సమాచారం చోరీకి గురవుతుందంటూ కేంద్రం 21కి పైగా మొబైల్ తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫోన్లలో యూజర్ల డేటాకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు, డేటా హ్యాకింగ్‌కు గురికాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు వంటి అంశాలపై వివరణ కోరుతూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. అందుకు గడువు కూడా విధించింది. అయితే డేటా చోరీపై మరో వార్త బయటకు వచ్చింది.

యూసీ బ్రౌజర్ (UC Browser)

యూసీ బ్రౌజర్ (UC Browser)

చైనాకు చెందిన ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్ 'యూసీ బ్రౌజర్ (UC Browser)' మన దేశంలో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్ల డేటాను తస్కరించి చైనా సర్వర్లకు పంపుతున్నట్టు తెలిసింది. ఇదే విషయంపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

50 శాతానికి పైగా యూజర్లు

50 శాతానికి పైగా యూజర్లు

యూసీ బ్రౌజర్ నిజానికి చైనా కంపెనీ అయిన అలీబాబా గ్రూప్‌నకు చెందినది. భారత్‌లో ఈ బ్రౌజర్‌ను వాడుతున్న యూజర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. దేశంలోని మొత్తం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో 50 శాతానికి పైగా యూజర్లు యూసీ బ్రౌజర్ యాప్‌ను వాడుతున్నట్టు రీసెర్చి సంస్థ స్టాట్ కౌంటర్ వెల్లడించింది.

తరువాత స్థానంలో గూగుల్ క్రోమ్

తరువాత స్థానంలో గూగుల్ క్రోమ్

ఆ తరువాత స్థానంలో గూగుల్ క్రోమ్ ఉంది. దీన్ని 33 శాతం మంది యూజర్లు వాడుతున్నారు. ఆ తరువాత యూజర్లు ఓపెరా బ్రౌజర్ యాప్‌ను వాడుతున్నారు. దీన్ని వాడుతున్న వారు 10 శాతం వరకు ఉన్నారు.

యూజర్లకు చెందిన డివైస్ సమాచారం

యూజర్లకు చెందిన డివైస్ సమాచారం

యూసీ బ్రౌజర్‌ను డెవలప్ చేసిన విధానంలోనే ఎన్నో లోపాలు ఉన్నాయని దాని వల్ల హ్యాకర్లు ఎవరైనా ఆ యాప్‌ను వాడుతున్న యూజర్లకు చెందిన డివైస్ సమాచారం, ఐఎంఈఐ నంబర్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, జీపీఎస్ లొకేషన్ వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని మరో రీసెర్చి సంస్థ తెలియజేస్తున్నది.

ఇప్పటికే చైనా సర్వర్లకు

ఇప్పటికే చైనా సర్వర్లకు

ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో యూసీ బ్రౌజర్‌ను వాడుతున్న యూజర్ల డేటా ఇప్పటికే చైనా సర్వర్లకు చేరిందని కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ముఖ్యంగా యూజర్ల ఫోన్ నంబర్లు, డివైస్ సమాచారం, జీపీఎస్ లొకేషన్ వివరాలు చైనా సర్వర్లకు చేరి ఉంటాయని కేంద్రం భావిస్తున్నది.

యూసీ బ్రౌజర్ యాప్‌ను

యూసీ బ్రౌజర్ యాప్‌ను

అందులో భాగంగానేసెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) చేత యూసీ బ్రౌజర్ యాప్‌ను క్షుణ్ణంగా స్కానింగ్ చేయిస్తున్నట్టు తెలిసింది.

సీడాక్

సీడాక్

యూజర్ల సమాచారం ఈ యాప్ ద్వారా చోరీకి గురవుతుందా, లేదా అన్న కోణంలో యాప్‌ను సమూలంగా సీడాక్ పరిశీలిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే యూసీ బ్రౌజర్ యాప్‌ను నిషేధించే అవకాశం ఉందని తెలిసింది

Best Mobiles in India

English summary
UC Browser leaks sensitive data, shows study Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X