యూసీ బ్రౌజర్ మళ్లీ వచ్చేసింది..

Posted By: BOMMU SIVANJANEYULU

నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ మొబైల్ బ్రౌజర్ యాప్‌ను గూగుల్ తన యాప్ స్టోర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగల్ పాలసీలకు అనుగుణంగా యూసీ బ్రౌజర్‌లో మార్పులు చేసి కొత్త వర్షన్‌లో ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోకి తీసుకువచ్చినట్లు యూసీవెబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

యూసీ బ్రౌజర్ మళ్లీ వచ్చేసింది..

వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా యూసీ బ్రౌజర్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించటం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ యాప్‌ను వినియోగించుకుంటోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అయోమయానికి గురయ్యారు.

దీని పై యూసీ‌వెబ్ స్పందిస్తూ, యూసీ బ్రౌజర్‌లోని ఓ సెట్టింగ్ గూగుల్ పాలసీకి వ్యతిరేకంగా ఉండటం వల్లనే ఇలా జరిగిందని వివరణ ఇచ్చుకుంది.తాజా అప్‌డేట్‌లో భాగంగా యాప్‌కు సంబంధించిన టెక్నికల్ సెట్టింగ్స్‌ను గూగుల్ నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసినట్లు యూసీవెబ్ తెలిపింది.

నోకియా 6కు ఆండ్రాయిడ్ 'Oreo' అప్‌డేట్

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించుకోబడుతోన్న మొబైల్ బ్రౌజర్ అప్లికేషన్‌లలో యూసీ బ్రౌజర్ ఒకటి. అక్టోబర్ నాటికి ఈ యాప్‌ను 50 కోట్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. భారత్‌లో యూసీ బ్రౌజర్‌కు 10 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. డేటా తస్కరణ కారణంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజర్‌ను తొలగించారన్న వార్తలను యూసీవెబ్ కొట్టిపారేసింది.

English summary
UCWeb said yesterday that an updated version of UC Browser is now available for download on Google Play.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot