Home
Apps

mAadhaar యాప్ : కొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ & IOS స్మార్ట్‌ఫోన్‌లలో

MAadhaar యాప్ గురించి అందరు వినివుంటారు. ఈ యాప్ ఉపయోగించి ఆండ్రాయిడ్ మరియు ios వినియోగదారులు ఆధార్ ను డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా అందులో ఏవైనా మార్పులు చేయవలసి ఉంటే కనుక చేయవచ్చు. ఇప్పుడు ఈ యాప్ కోసం కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆండ్రాయిడ్ యాప్ ను భారత ప్రభుత్వం తయారుచేసింది.

MAadhaar

MAadhaar యాప్ ను ఇప్పుడు మరింత సురక్షితంగా చేయడానికి యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆండ్రాయిడ్ మరియు iOS డివైస్ల కోసం తన కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త యాప్ పలురకాల భాషలకు అనుమతిని ఇస్తుంది. ఇందులో ఇంగ్లీష్ భాషతో పాటు 12 భారతీయ భాషలను కలుపుకొని మొత్తంగా 13 భాషలకు మద్దతు ఇస్తుంది.

 

UIDAI

ఇండియా బాషలలో హిందీ, బెంగాలీ, ఒడియా, ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ మరియు అస్సామీ భాషలు ఉన్నాయి. UIDAI ప్రకారం వినియోగదారులు తమ ఆధార్ యొక్క మునుపటి సంస్కరణలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని తొలగించి క్రొత్త అప్డేట్ ను వెంటనే ఇన్‌స్టాల్ చేయవచ్చు. అలాగే ఇందులో మూడవ పార్టీ యాప్ లకు UIDAI మద్దతు ఇవ్వదు.

 

 

MAadhaar యాప్

MAadhaar యాప్ ను ఉపయోగించి వినియోగదారులు ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్‌లైన్ eKYC, క్యూఆర్ కోడ్‌ను చూపించవచ్చు లేదా స్కాన్ చేయవచ్చు, పునముద్రణకు ఆర్డర్ ఇవ్వవచ్చు, చిరునామాను అప్డేట్ చేయవచ్చు, ఆధార్‌ను ధృవీకరించవచ్చు, మెయిల్ / ఇమెయిల్‌ను ధృవీకరించవచ్చు, యుఐడి / ఇఐడిని తిరిగి పొందవచ్చు, చిరునామా ధ్రువీకరణ లెటర్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు మరియు వివిధ ఆన్‌లైన్ అభ్యర్థనల స్టేటస్ కూడా తనిఖీ చేయవచ్చు.

 

బయోమెట్రిక్

MAadhaar యాప్ ద్వారా వినియోగదారులు వారి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా కూడా యాక్సిస్ ను కూడా లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు.

 

స్మార్ట్‌ఫోన్‌లో

ఆధార్ యొక్క సేవలను పొందడానికి ఒక వినియోగదారుడు MAadhaar యాప్ లో ఆధార్ ప్రొఫైల్‌ను నమోదు చేయాలి. కానీ ఆధార్‌తో పని లేకుండా కూడా అతను / ఆమె తమ స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. MAadhaar యాప్ ను ఉపయోగించడానికి వినియోగదారులు వారి ఫోన్ నంబర్ ను UIDAI లో నమోదు చేసుకోవాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్ కార్డు వివరాలను యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా మరియు ఫోటో వంటి డేటాను వారి ఫోన్‌లో డిజిటల్‌గా నిల్వ చేస్తుంది.

Best Mobiles in India

English summary
UIDAI Offers Ultra-protective mAadhaar App For Both Android And iOS Devices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X